రూ. 39.90 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన జాగ్వార్ XE
జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం manish ద్వారా ఫిబ్రవరి 03, 2016 03:20 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బ్రిటీష్ వాహన తయారీసంస్థ దాని కాంపాక్ట్ సెడాన్ XE ని కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రారంభించింది. ఈ కారు రూ.39.90 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరని కలిగియుండి BMW 3-సిరీస్, ఆడి A4 మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది. వాహన తయారీసంస్థ దేశవ్యాప్తంగా ఈ సెడాన్ కోసం బుకింగ్స్ తెరిచింది మరియు ఇది విలాసవంతమైన తయారీసంస్థచే అందించబడిన గణనీయమైన ఉత్పత్తిగా పరిగణించబడింది, ఇప్పటికే ఈ వాహనం మార్కెట్ లో విశేషమైన స్పందనను పొందగలిగింది.
ఈ జాగ్వార్ XE వాహనం ఒక 2.0 లీటర్ పెట్రోల్ ఎంపికతో 200Ps శక్తి సామర్ధ్యన్ని ఉత్పన్నం చేయగలిగి మరియు 320Nm గరిష్ట టార్క్ ను కలిగి ఉండబోతోంది. అయితే టర్బో ద్వారా చార్జ్ చేయబడిన 2.0 లీటర్ పవర్ప్లాంట్ 240Ps శక్తి సామర్ధ్యాన్ని ఉత్పన్నం చేస్తూ 340Nm గరిష్ట టార్క్ ని కలిగి ఉంటుంది. తూలనాత్మకంగా ఇతర వాహనాలతో దీనిని సరి పోల్చినప్పుడు దీని ప్రత్యర్ద్ధి అయిన XE శ్రేణి BMW3 సిరీస్ మరియు ఆడీ A4 ఇంతకంటేఅ తక్కువ సామర్ధ్యాన్ని ఉత్పన్నం చేస్తూ 187Ps మరియు 177Ps లు గా కలిగి ఉన్నాయి.
సామర్ధ్యానికి చేయూతగా కారు యొక్క పలుచని బరువు తీరుతెన్నులు ఉండబోతున్నాయి. ఈ జాగ్వార్ ఎక్స్ ఇ ఒక తక్కువ బరువు గల అల్యూమినియం మోనోకాక్ చాసిస్ ని కలిగి పవర్ప్లాంట్ కి చేదోడుగా ఉంటుంది. తద్వారా ఈ సెడాన్ వాహనం 0 నుంచి 100kmph కేవలం 5.1 సెకెన్లలో చేరుకోగలుగుతుంది. అంతేకాకుండా ఒక అధ్వితీయమైన వేగం కలిగిన 8-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి మరియు తక్కువ బరువు తో జాగ్వార్ XE ఇంధన సామర్ధ్యాన్ని కూడా మెరుగుగా అందించే కారుగా శ్రేణిలో నిలుస్తుంది.
కారు అంతర్భాగంలో జాగ్వార్ వారు నవీకరించిన సౌకర్యాలను ఈ XE వాహనంలో అందిస్తున్నారు, అంతేకాకుండా విభిన్నమైన ఉపకరణాలను కేవలం ప్రదర్శనతో పరిమితం చేయకుండా ఒక వినూత్న 8-అంగుళాల ఇంకంట్రోల్ సమాచార వినోద వ్యవస్థను అందిస్తూ, SD కార్డ్డుల ద్వారా మ్యాప్ లను పొంది సౌకర్యవంతమైన నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. దీనితో పాటూ బ్లూటూత్ అనుసంధానం కూడా కలిగి ఈ వాహనం ఉండబోతోంది.