ఎక్స్ఎఫ్ ఏరో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ ను 52 లక్షల వద్ద ప్రవేశపెట్టిన జాగ్వర్ ఇండియా
published on జూలై 02, 2015 03:44 pm by saad కోసం జాగ్వార్ ఎక్స్
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: టాటా సొంతమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్, నేడు ఎక్సెఫ్ యొక్క ఏరో స్పోర్ట్ అను నామకరణం కలిగిన ప్రత్యేక వాహనాన్ని విడుదల చేసింది. ఈ వాహనాన్ని, ఈణృ 52 లక్షల ఎక్స్-షోరూమ్ ముంబై, వద్ద ప్రవేశపెట్టారు. ఈ ప్రీమియం సెడాన్ యొక్క స్పెషల్ ఎడిషన్, అనేక బాహ్య ఉపకరణాలతో వచ్చింది. ఇది, ఈ నెల నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
మార్పులు పరంగా చెప్పాలంటే, ఈ జాగ్వర్ ఎక్స్ ఎఫ్ ఏరో స్పోర్ట్, స్పోర్ట్-శైలి కలిగిన ముందు బంపర్, క్రోమ్ సరౌండ్ తో కూడిన బ్లాక్ గ్రిల్, ఆర్ స్టైల్ సైడ్ సిల్స్ మరియు రేర్ స్పాయిలర్ వంటి బాహ్య బాగాలతో రాబోతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ పొలారిస్ వైట్, అల్టిమేట్ బ్లాక్, సెప్పైర్ బ్లూ మరియు ఒడిస్సీ రెడ్ బాహ్య రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా యొక్క అధ్యక్షుడు అయిన రోహిత్ సూరి మాట్లాడుతూ, ఈ జాగ్వర్ ఎక్స్ ఎఫ్ డైనమిక్ డిజైన్, తప్పుపట్టలేని పనితీరు, శుద్ధి డ్రైవ్ మరియు ఎఫోర్ట్లెస్ పవర్ కు ప్రతి రూపం అని చెప్పవచ్చు. ఈ ఎక్స్ ఎఫ్ ఏరొ స్పోర్ట్ ఎడిషన్, యూనిక్ డిజైన్ కలిగిన మోడల్ గా మరియు మా యువ, అధునాతన వినియోగదారులకు, ఇది అత్యంత ప్రముఖ మోడల్ అని చెబుతున్నారు.
జాగ్వార్ ఎక్స్ ఎఫ్ ఏరో ఎడిషన్ యొక్క బాహ్య బాగాలను ప్రక్కన పెడితే, ఈ వాహనం 7-అంగుళాల టచ్స్క్రీన్ / నావిగేషన్ సమాచార్ వ్యవస్థ తో రాబోతుంది. అంతేకాకుండా, సన్రూఫ్ తో రాబోతుంది. ఈ వాహనం యొక్క క్యాబిన్ లోపలి బాగం అంతా లెధర్ అపోలిస్ట్రీ తో పాటు అల్యూమినియం చేరికలతో అలంకరించబడి ఉంటుంది మరియు సొగసైన చెక్క వెనీర్స్ తో పేర్చబడి ఉంటుంది.
ఈ జాగ్వర్ ఎక్స్ ఎఫ్ ఏరో స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3500 rpm వద్ద 187 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 2000rpm వద్ద 450 Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 8-స్ఫీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో అనుసందానం చేయబడి ఉంటుంది. దీని ద్వారా విడుదల అయిన టార్క్ ను వాహనం యొక్క ముందు వీల్స్ కు అందజేస్తుంది.
ప్రస్తుతం ఉన్న జాగ్వర్ ఎక్స్ ఎఫ్ మోడల్ త్వరలోనే, ఇటీవల న్యూయార్క్ ఆటో షోలో ఆవిష్కరించబడిన కొత్త 2016 జాగ్వర్ ఎక్స్ ఎఫ్ చే బర్తీ చేయనుంది. ఈ 2016 జాగ్వర్ ఎక్స్ ఎఫ్, వచ్చే ఏడాది భారతదేశం లో విడుదలవుతుందని భావిస్తున్నారు.
- Renew Jaguar XF Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful