ముగిసిన RWD మహీంద్రా థార్ పరిచయ ధరలు, ఇకపై ఈ SUV కోసం రూ.55,500 అధిక ధరను చెల్లించాల్సిందే
మహీంద్రా థార్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 17, 2023 01:39 pm ప్రచురించబడింది
- 41 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఆఫ్-రోడర్ 4WD వేరియెంట్ؚల ధరలు ఏకరీతిగా రూ.28,200 పెరిగాయి
-
పెట్రోల్ ఆటోమ్యాటిక్ LX RWD వేరియెంట్‌ను మినహాహించి, ఈ SUV అన్ని వేరియెంట్‌ల ధరలు పెరిగాయి.
-
RWD థార్ డీజిల్ వేరియెంట్ؚల ధర అత్యధికంగా రూ. 55,500 పెరిగింది.
-
థార్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 2-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ మరియు 1.5-లీటర్ డీజిల్ (RWD మాత్రమే).
-
దీని ధర ఇప్పుడు రూ.10.55 లక్షల నుండి రూ.16.77 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్).
BS6 ఫేజ్ 2 నిబంధనల అమలు కారణంగా వినియోగదారులపై అధిక ధరల ప్రభావం పడింది, దీనికి అదనంగా, మహీంద్రా థార్ ధర కూడా పెరిగింది! మార్చి నెలలో బొలెరో శ్రేణి ధరలను పెంచిన తరువాత, ఈ కారు తయారీదారు SUV ధరలను సవరించారు, తత్ఫలితంగా ఇటీవల పరిచయం చేసిన రేర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియెంట్ؚల పరిచయ ధరలను ముగించారు.
ఇది కూడా చదవండి: ఇకపై మహీంద్రా KUV100 NXTని కొనుగోలు చేయలేరు
కొత్త వేరియెంట్-వారీ ధరలను చూద్దాం:
RWD వేరియెంట్‌లు |
|||
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
AX(O) డీజిల్ MT |
రూ. 10 లక్షలు |
రూ.10.55 లక్షలు |
రూ. 55,500 |
LX డీజిల్ MT |
రూ.11.50 లక్షలు |
రూ.12.05 లక్షలు |
రూ. 55,500 |
LX పెట్రోల్ AT |
రూ.13.50 లక్షలు |
రూ. 13.50 లక్షలు |
0 |
4WD వేరియెంట్ؚలు |
|||
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
AX (O) CT పెట్రోల్ MT |
రూ. 13.59 లక్షలు |
రూ. 13.87 లక్షలు |
రూ. 28,200 |
LX HT పెట్రోల్ MT |
రూ. 14.28 లక్షలు |
రూ. 14.56 లక్షలు |
రూ. 28,200 |
LX CT పెట్రోల్ AT |
రూ. 15.73 లక్షలు |
రూ. 16.01 లక్షలు |
రూ. 28,200 |
LX HT పెట్రోల్ AT |
రూ. 15.82 లక్షలు |
రూ. 16.10 లక్షలు |
రూ. 28,200 |
AX (O) CT డీజిల్ MT |
రూ. 14.16 లక్షలు |
రూ. 14.44 లక్షలు |
రూ. 28,200 |
AX (O) HT డీజిల్ MT |
రూ. 14.21 లక్షలు |
రూ. 14.49 లక్షలు |
రూ. 28,200 |
LX CT డీజిల్ MT |
రూ. 14.97 లక్షలు |
రూ. 15.25 లక్షలు |
రూ. 28,200 |
LX HT డీజిల్ MT |
రూ. 15.06 లక్షలు |
రూ. 15.35 లక్షలు |
రూ. 28,200 |
LX CT డీజిల్ AT |
రూ. 16.40 లక్షలు |
రూ. 16.68 లక్షలు |
రూ. 28,200 |
LX HT డీజిల్ AT |
రూ. 16.49 లక్షలు |
రూ. 16.77 లక్షలు |
రూ. 28,200 |
*అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఈ SUV LX పెట్రోల్ ఆటోమ్యాటిక్ వేరియెంట్‌ను మినహహించి, RWD వేరియెంట్‌ల ధరలు రూ. 55,500 వరకు పెరిగాయి. ఈ వేరియెంట్‌లకు జనవరిలో అందించిన పరిచయ ధరలకు ముగింపు పలికారు. నాలుగు-వీల్-డ్రైవ్ (4WD) అన్నీ వేరియెంట్ؚలలో కూడా, రూ.28,200 ఏకరీతి ధర పెంపును చూడవచ్చు.
థార్ LX డీజిల్ మాన్యువల్ RWD వేరియెంట్ ధర మొదటి సారిగా ఒక నెల క్రిందటే రూ.50,000 పెంచారు. ప్రస్తుత ధర పెంపుకి దాన్ని జోడిస్తే, ఈ వేరియెంట్ విడుదల అయినప్పటి నుండి దీని ధర రూ.1.05 లక్షలు పెరిగింది.
థార్ పవర్ؚట్రెయిన్ؚలు
మహీంద్రా థార్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 4WD వేరియెంట్ؚలు 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో (150PS మరియు 320Nm), 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో (130PS మరియు 300Nm) వస్తాయి. రెండు యూనిట్‌లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను పొందాయి.
ఇది కూడా చదవండి: కార్దెకో మాటలలో: మహీంద్రా థార్ؚ ఇప్పటి వరకు ప్రత్యేక ఎడిషన్‌లను ఎందుకు పొందలేదు?
మరొక వైపు RWD వేరియెంట్‌లు, 4WD వేరియెంట్ؚలలాగే 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తాయి, కానీ కేవలం 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ؚతో మాత్రమే వస్తుంది. 1.5-లీటర్ చిన్న డీజిల్ ఇంజన్ (118PS మరియు 300Nm) కూడా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడి వస్తుంది.
ఫీచర్‌లు
థార్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో ఏడు-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ కంట్రోలెడ్ AC, LED DRLలతో హాలోజెన్ హెడ్ؚలైట్ؚలు, క్రూజ్ కంట్రోల్, వాషబుల్ ఇంటీరియర్ ఫ్లోర్ మరియు విడదీయగలిగిన రూఫ్ ప్యానెల్ వంటి వాటితో వస్తుంది.
ఇది కూడా చదవండి: అధికారిక SUV భాగస్వామిగా 4 IPL T20 బృందాలతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా
భద్రత విషయానికి వస్తే, ఈ ఆఫ్-రోడర్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ మరియు డిసెండ్ కంట్రోల్, మరియు ప్రయాణీకులు అందరికి మూడు-పాయింట్ సీట్ బెల్ట్ؚలను అందిస్తుంది.
ధర & పోటీదారులు
కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత, థార్ ధర ఇప్పుడు రూ.10.55 లక్షల నుండి రూ.16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ మూడు-డోర్‌ల, నాలుగు సీటర్‌ల SUV ఫోర్స్ గూర్ఖాకు మరియు రాబోయే మారుతి జిమ్నీకి ప్రత్యర్ధిగా నిలుస్తుంది. అయితే దీన్ని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, టయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి కాంపాక్ట్ SUVలకు సాహసోపేతమైన ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా థార్ డీజిల్