కార్దెకో మాటలలో: మహీంద్రా థార్ؚ ఇప్పటి వరకు ప్రత్యేక ఎడిషన్ؚలను ఎందుకు పొందలేదు?
మహీంద్రా థార్ కోసం sonny ద్వారా ఏప్రిల్ 05, 2023 12:32 pm సవరించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
1 లక్ష యూనిట్‌ల అమ్మకాల తరువాత కూడా, ఈ SUV నుండి పరిమిత ఎడిషన్ వేరియెంట్ؚల పరంగా కొనుగోలుదారులకు విలక్షణమైన ఎంపికలు అందుబాటలో లేవు
మహీంద్రా థార్ రెండవ జనరేషన్ అమ్మకాలు ప్రారంభం అయ్యి రెండున్నర సంవత్సరాల అవుతుంది, ఇప్పటివరకు సుమారుగా 1 లక్ష యూనిట్‌లు వినియోగదారులకు అందించారు. దీనికి ఉన్న ప్రజాదరణపై ఎటువంటి సందేహం లేనప్పటికీ, ఔత్సాహికుల కోసం ఈ SUVకి ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రత్యేక ఎడిషన్ؚను కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. టాటా వంటి బ్రాండ్‌లు తమ ప్రధాన SUVలను సాధారణ వేరియెంట్‌ల ప్రత్యేక ఎడిషన్‌లను లుక్ మరియు ఫీచర్ పరంగా మార్పులతో తీసుకువస్తుండగా, మహీంద్రా మాత్రం ఇలా ప్రత్యేక ఎడిషన్‌లను అందించకపోవడం నిర్లక్ష్యం అని చెప్పవచ్చు.
థార్ ఏమి అందిస్తోంది?
మహీంద్రా థార్ మూడు-డోర్‌ల 4 మీటర్‌ల ఎత్తు గల SUV, ఇది ఫిక్సెడ్ హార్డ్ టాప్ లేదా కన్వర్టబుల్ సాఫ్ట్-టాప్ؚతో వస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ రెండు ఎంపికలతో 4WD ప్రామాణికతో ఆవిష్కరించబడింది, ప్రతి దానిలో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలు ఉన్నాయి. వేరియెంట్‌పై ఆధారపడి, రూఫ్ మరియు పవర్ؚట్రెయిన్ؚల ఖచ్చితమైన కలయికలో మార్పులు ఉండవచ్చు. మహీంద్రా, థార్ؚను అనేక అధికారిక యాక్సెసరీలు కలిగిన జాబితాతో అందిస్తుంది, ఆఫ్-రోడ్ సామర్ధ్యాన్ని పెంచడానికి లేదా మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేయడానికి కొనుగోలు చేసిన తరువాత కూడా అనేక సవరణలు అందుబాటులో ఉన్నాయి.
2023 ప్రారంభంలో, మహీంద్రా కొత్త రేర్-వీల్-డ్రైవ్ వెర్షన్ థార్ؚను పరిచయం చేసింది, లుక్ పరంగా ఇందులో ఉన్న తేడా కేవలం రెండు కొత్త ఎక్స్ؚటీరియర్ రంగులు – ఎవరెస్ట్ వైట్ మరియు బ్లేజింగ్ బ్రాంజ్. రూఫ్ మెటీరీయల్ విషయానికి వస్తే, థార్ؚ డ్యూయల్-టోన్ ఫినిష్‌తో ప్రామాణికంగా వస్తుంది, ఇది మరో నాలుగు రంగులలో మాత్రమే అందించబడుతుంది – ఎరుపు, నలుపు, బూడిద రంగు మరియు ఆక్వా మెరైన్.


మహీంద్రా మెరుగు పరచవలసిన అంశాలు?
డీలర్-ఫిట్ చేయగలిగే యాక్సెసరీలు మరియు మహీంద్రా నేరుగా అందించే ప్రత్యేక ఎడిషన్‌ల థార్ؚ రావలసిన సమయం ఇది. థార్ؚను మరింత ప్రత్యేకంగా మరియు మరింత ధృఢంగా, ఆఫ్-రోడ్ హితంగా వినియోగదారులకు నచ్చే విధంగా ప్రత్యేక మోడల్‌లను తీసుకురాగలిగే ఆస్కారం ఉంది. మరింత ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ ఆల్-టెర్రీయన్ టైర్‌లు మరియు వేరు వేరు ఆలాయ్ వీల్స్, మెరుగైన అప్రోచ్ మరియు డిపార్చర్ యాంగిల్స్ కోసం సవరించిన ముందు మరియు వెనుక బంపర్‌లు మరియు ధృఢత్వాన్ని పెంచడానికి జోడించిన క్లాడింగ్ వంటి వాటిని మహీంద్రా అందించవచ్చు.
అదనంగా, దీనిలో ప్రత్యేకమైన డెకాల్స్, కస్టమ్ హెడ్ؚరెస్ట్ؚలు మరియు క్యాబిన్ చుట్టూ అదనపు బ్యాడ్జింగ్ వంటివి ఉండవచ్చు. మహీంద్రా ఈ దిశగా ప్రయత్నం చేయాలనుకుంటే, పరిమిత ఎడిషన్ వేరియెంట్ؚలకు ప్రత్యేకంగా ఉండే కొత్త ఎక్స్ؚటీరియర్ రంగును కూడా పరిచయం చేయవచ్చు.
భారతదేశం వెలుపల, దక్షిణ ఆఫ్రికాలో అందిస్తున్న స్కోర్పియో పికప్ కారు ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్‌లను మహీంద్రా అందిస్తోంది అనేది కూడా ఒక వాస్తవం. భారతదేశంలో మహీంద్రా అందించాలని మనం కోరుకునే ప్రతిదీ ఈ ఎడిషన్ؚలో ఉంది – ప్రత్యేకమైన డెకాల్స్, ఆఫ్-రోడ్ టైర్‌లతో విలక్షణమైన ఆలాయ్ వీల్స్, బ్రేసింగ్ؚతో ముందు మరియు వెనుక ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ బంపర్‌లు. విదేశాలలో ఇలాంటివి అందించడాన్ని మహీంద్రా తమ ఉత్పత్తి ప్రణాళికలో కలిగి ఉన్నప్పుడు, భారతదేశంలో భారీ సంఖ్యలో ఉన్న వినియోగదారుల కోసం, థార్ వంటి వాహనానికి ప్రత్యేక ఎడిషన్ؚను ఎందుకు అందించడం లేదు?
ఈ పని చేస్తున్న బ్రాండ్‌లు
ప్రతి ప్రత్యర్ధి బ్రాండ్ ప్రత్యేక ఎడిషన్ؚలను అందిస్తోంది అనే విషయాన్ని పరిగణిస్తే, థార్ؚకు ఉన్న నమ్మకమైన ఫ్యాన్ బేస్ؚ కోసం మహీంద్రా ఎలాంటి ప్రత్యేకమైన ఎడిషన్ؚలను అందించడం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. హ్యారీయర్, సఫార్, నెక్శాన్ మరియు పంచ్ؚలలో డార్క్, కజిరంగా, జెట్ మరియు గోల్డ్ వంటి ప్రత్యేక ఎడిషన్ؚలను టాటా తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే నైట్ ఎడిషన్, స్కోడా కుషాక్ మాంటే కార్లో, వోక్స్వాగన్ టైగూన్ మొదటి వార్షికోత్సవ ఎడిషన్, కియా సెల్టోస్ మరియు సోనెట్ X-లైన్, ప్రస్తుతం వస్తున్న మారుతి బ్లాక్ ఎడిషన్ؚల వంటివి కూడా ఉన్నాయి.


ఆఫ్-రోడ్ మరియు లైఫ్‌స్టైల్ విభాగాన్ని చూస్తే, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఎడిషన్ؚలను అందించడంలో జీప్ చాలా ముందు ఉంది. ప్రస్తుత లైన్అప్ؚలోనే, వ్రాంగ్లర్ కు ఈ క్రింది ప్రత్యేక వేరియెంట్‌లు ఉన్నాయి:
-
బీచ్ ప్రత్యేక ఎడిషన్
-
హైటైడ్ ప్రత్యేక ఎడిషన్
-
టుస్కాడెరో పెయింట్ ఎడిషన్
-
ఫ్రీడమ్ ఎడిషన్
-
రీన్ పెయింట్ ఎడిషన్


జీప్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ؚ అందించడం మరియు ఆఫ్-రోడింగ్ నిష్పత్తులను మెరుగుపరచడం వంటి మార్పులను కూడా చేసింది.
మహీంద్రా ఇలాంటి మార్పులను ఎందుకు చేయడం లేదు?
ఈ విషయంలో కారు తయారీదారు ఎలాంటి పబ్లిక్ ప్రకటన చేయలేదు, థార్‌ను ప్రత్యేక ఎడిషన్ؚలను ఎందుకు అందించడం లేదు అనే దానికి ఊహించదగిన కారణం ఉంది: ఏది ఏమైనా థార్ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా, విడుదల అయినప్పటి నుండి థార్ؚకు ఎలాంటి పోటీ లేదు, కాబట్టి ఏమైనా మార్పులు తీసుకురావడంలో మహీంద్రా కొంత ఆలస్యం చేస్తుందని చెప్పవచ్చు. మే 2023లో మారుతి జిమ్నీ మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత మహీంద్రా వైఖరిలో మార్పు రావచ్చు.


థార్ؚను కొనుగోలు చేసేవారు చక్కని వ్యక్తీకరణ చేయగలిగిన వారు, దీన్ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత దీనికి మార్పులు చేయకుండా ఉన్న వారు అరుదుగా ఉంటారు. తమ వ్యక్తిత్వానికి, అవసరాలకు తగినట్లుగా తమ SUVకి ఉపకరణాలు జోడించి వ్యక్తీగతీకరిస్తారు, వీటిలో మరింత ఆఫ్-రోడింగ్ శక్తిని అందించడం, క్రోమ్ మరియు LEDలతో వెలిగిపోయేలా చేయడం వరకు ఉన్నాయి. ఇలాంటి వినియోగదారుల కోసం, నేరుగా ఫ్యాక్టరీ-అమర్చే అదనపు ఉపకరణాలు వ్యారెంటీతో పొందగలిగే ఎంపిక ఉండాలి, అంతేకాకుండా ప్రత్యేక ఎడిషన్ వేరియెంట్ؚల ద్వారా విలక్షణమైన లుక్‌ను అందించాలి, మహీంద్రా ఇలాంటి కోరికలను ఎప్పటికైనా తీరుస్తుందని ఆశిద్దాం.
మార్పులు చేసిన థార్ ఫోటో క్రెడిట్: క్లాసిక్ నోయిడా
ఇక్కడ మరింత చదవండి: థార్ డీజిల్