భారత ప్రత్యేక జాగ్వర్ XE మరియు XF యూరో Ncap లో 5-స్టార్ రేటింగ్ నమోదు చేసుకున్నాయి
జాగ్వార్ ఎక్స్ కోసం raunak ద్వారా డిసెంబర్ 04, 2015 02:45 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
జాగ్వార్ యొక్క కొత్త XF మరియు XE యూరో NCAPయొక్క 2015 భద్రతా పరీక్షలలో గరిష్టంగా 5 స్టార్ భద్రత రేటింగ్స్ ని నమోదు చేసుకుంది. ఫలితాల గురించి మాట్లాడుకుంటే కొత్త XF పెద్దల రక్షణ కొరకు 92% మరియు పిల్లల రక్షణల కొరకు 84% స్కోర్లను నమోదు చేసుకుంది. పాదచారుల భద్రత మరియు భద్రతా సహాయం సిస్టమ్స్ ప్రమాణాల విభాగంలో వరుసగా 80% మరియు 83% నమోదు చేసుకుంది. ఇది ఇలా ఉండగా కొత్త XE వాహనం పెద్దల రక్షణ కొరకు 92% మరియు పిల్లల సంరక్షణ కొరకు 82% మార్కులను పొందింది. పాదచారుల భద్రత మరియు భద్రత సహాయ సిస్టమ్స్ ప్రమాణాల విభాగంలో వరుసగా 81% మరియు 82% వద్ద నిలిచాయి.
జాగ్వార్ XE, XF, F-పేస్ వెహికెల్ లైన్ డైరెక్టర్, కెవిన్ స్ట్రిడే మాట్లాడుతూ " XEమరియు XFఎటువంటి విషయాలలోరాజీ లేకుండా రూపొందించబడ్డాయి. మేము ఈ వాహనాలలో ఎక్కువగా డైనమిక్స్, పనితీరు, శుద్ధీకరణ మరియు సమర్థతపై ఎక్కువగా దృష్టి పెట్టాము మరియు ఈ వాహనం శాసన మరియు వినియోగదారు పరీక్షలు అవసరాలను దాటి ఉంటుంది."
"వాహనంలో అల్యూమినియం శరీర నిర్మాణం, అత్యుత్తమ స్టీరియో కెమేరా మరియు అటనామస్ అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ వంటి భద్రతా అంశాలు వసరానికి అనుగుణంగా చాలా జాగ్రత్తగా మలచబడ్డాయి." అని పేర్కొన్నారు.
చూడండి: జాగ్వార్ XF 2015 యూరో NCAP క్రాష్ టెస్ట్ (VIDEO)
చూడండి: జాగ్వార్ XE 2015 యూరో NCAP క్రాష్ టెస్ట్ (VIDEO)
ఆన్‌బోర్డ్ పైన భద్రతా వ్యవస్థలు జోడించడం కొరకు XE మరియు XF రెండూ కూడా జాగ్వార్ యొక్క కొత్త తేలికైన అల్యూమినియం నిర్మాణం తో నిర్మించబడ్డాయి. ఈ ప్లాట్‌ఫార్మ్ తులనాత్మకంగా తేలికైనది మరియు అదే సమయంలో బలమైనది. ఇంకా ఈ వాహనాలు డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఎయిర్బ్యాగ్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి క్రియాశీల భద్రత టెక్స్ తో సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, అత్యవసర బ్రేక్ అసిస్ట్, లేన్ డిపాచర్ హెచ్చరిక, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, క్లోసింగ్ వెహికెల్ సెన్సింగ్, రివర్స్ ట్రాఫిక్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికర్గ్నిషన్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి భద్రతా అంశాలు కలిగి ఉంటాయి.