• English
  • Login / Register

ఇండియా బౌండ్ : జి ఐఐఎ ఎస్ 2015 వద్ద ప్రదర్శింపబడిన మారుతీ వైఆర్ఎ అనగా బాలెనో

ఆగష్టు 21, 2015 04:19 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతి  పరిశోధన మరియు ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ వై ఆర్ ఎ,  గైకండో ఇండోనేషియన్ అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో 2015 వద్ద  ప్రదర్శింపబడుతున్నది. తయారీదారులు   దీనిని ప్రపంచవ్యాప్తంగా  చాలా ఆలస్యంగా చూపిస్తున్నారు. కానీ, ముందుగా దీని గురించి తెలియజేశారు. ఈ వాహనం యొక్క తయారీ వెర్షన్  66 వ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించబడుతుంది. ప్రారంభానికి సంభందించినంతవరకూ,  కారు లండన్ లో 2016 వేసవి లో ప్రారంభం కానున్నది. కానీ భారతదేసంలో దాని కంటే ముందే ప్రారంభం కావచ్చు. వై ఆర్ ఎ హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ తో పోటీ పడనున్నది.

ఈ కారు స్విఫ్ట్ కంటే పెద్దది, కానీ ఇది పీర్స్ వలే  సబ్-4 మీటర్  వాహనంగా వూహించవచ్చు. వై ఆర్ ఎ, స్విఫ్ట్ కంటే విశాలమైనది,  పొడవైనది మరియు లోపల చాలా విశాలంగా ఉంటుంది . వై ఆర్ ఎ యొక్క బాహ్య స్వరూపాలు ఆకర్షణీయంగా ఉండి మారుతీ యొక్క బలం  కనిపిస్తుంది. దీని ముందర భాగం హెడ్ల్యాంప్స్ తో అమర్చబడియున్న సొగసైన విలక్షణమైన గ్రిల్ ని కలిగి ఉంది మరియు క్రింద బంపర్ సంస్థ యొక్క శ్రేణితో కలిగి ఉంది. దీని పక్క భాగం, మధ్యలో క్యారెక్టర్ లైన్స్ కలిగియున్న వీల్ ఆర్చులని కలిగి ఉంది. దీని వెనుకభాగం ఎల్ ఇడి క్లస్టర్ మరియు వెనుక  బంపర్ ని కలిగి ఉంది. దీని వెనుక బంపర్ ముందరి బంపర్ వలే ఉంటుంది. దీని టెయిల్గేట్ విశాలంగా ఎలైట్ ఐ 20 లో చూసిన విధంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వన్-ఆఫ్ డి ఆర్ ఎల్ ఎస్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు ఎల్ ఇడి టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉన్నాయి.

 

మారుతి తమ వై ఆర్ ఏ యొక్క అంతర్భాగాల విషయాలను రహస్యంగా ఉంచిది. కానీ భారతదేశంలో  టెస్ట్ జరిగిన  సమయంలో  కొన్ని రహస్య చిత్రాల వలన అవి బయటకు వచ్చాయి. లోపలి వైపు నల్లగా సిల్వర్ చేరికలతో  ఉన్నాయని భావిస్తున్నారు మరియు ఎస్-క్రాస్ మరియు సియాజ్ నుండి తీసుకోబడిన స్మార్ట్ ప్లే యూనిట్ ను కలిగి ఉన్నట్లు కూడా  భావిస్తున్నారు. దీనిలో ఇతర ముఖ్యాంశాలు  ఆటోమేటిక్ ఏసి, ఒక ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ మరియు ఒక పెద్ద బూట్ మొదలైనవి.   

వై ఆర్ ఏ హుడ్ కింద, స్విఫ్ట్ నుండి తీసుకోబడిన 1.3 లీటర్ డిడీఇఎస్200 మోటార్ తో పాటు  1.2 కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉందని భావిస్తున్నారు. ఈ రెండు మాత్రమే కాకుండా, తయారీదారుడు కొత్త గా అభివృద్ధి చేసిన బూస్టర్-జెట్ మోటారు ను కూడా అదనపు ఎంపికగా తీసుకుని రావచ్చునని  భావిస్తున్నారు. దీని 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారు దాదాపు 120 బి హెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని ఊహిస్తున్నారు. ఇంకా ఇది  ఇంధన సామర్థ్యం ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దీని పేరుకి సంబంధించినంతవరకు, మారుతి భారతదేశంలో బాలెనో ట్యాగ్ ను తీసివేసి దీనికి వేరే పేరును పెట్టింది. అంతేకాక, ఈ కారు నెక్సా డీలర్షిప్ల ద్వారా రిటైల్ మార్కెట్లోకి రాబోతుందని భావిస్తున్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience