టాటా పంచ్‌కు ప్రత్యర్ధిగా హ్యుందాయ్ నుండి వస్తున్న “ఎక్స్ؚటర్ ” పేరుగల SUV
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం tarun ద్వారా ఏప్రిల్ 14, 2023 05:12 pm ప్రచురించబడింది
- 86 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కొత్త మైక్రో SUV త్వరలోనే, బహుశా జూన్ؚలో మార్కెట్‌లోకి రావచ్చు.
-
రానున్న తన మైక్రో SUVకి హ్యుందాయ్ ‘ఎక్స్ؚటర్’గా నామాకరణం చేసింది.
-
నిటారుగా మరియు కొన్ని విలక్షణమైన విజువల్ ఎలిమెంట్ؚలతో ఈ SUV దృఢంగా కనిపించవచ్చు.
-
భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు TPMS ఉండవచ్చని అంచనా.
-
83PS పవర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు. 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఎంపికని కూడా అందించవచ్చు.
-
ఎక్స్ؚటర్ ధర సుమారు రూ.6 లక్షలు వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.
రాబోయే తన సరికొత్త మైక్రో SUV పేరును హ్యుందాయ్ ‘ఎక్స్ؚటర్’ అని ఖరారు చేసింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉందని కారు తయారీదారు తెలిపారు, జూన్ؚలో రావచ్చని అంచనా వేస్తున్నాము.
తాజా టీజర్‌లో SUV అవుట్‌లైన్ؚను చూడవచ్చు, ఇది నిటారైన వాహనంలా కన్పిస్తోంది. బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ మరియు స్టబ్బీ బోనెట్ వంటి కొన్ని దృఢమైన ఎలిమెంట్ؚలను ఆశించవచ్చు. మునుపటి రహస్య చిత్రాలలో H-ఆకారపు LED DRLలు, టెయిల్ లైట్ؚలు మరియు విలక్షణమైన ఆలాయ్ వీల్స్ؚతో సహా ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్ؚలు కనిపించాయి.
హ్యుందాయ్ ఎక్స్ؚటర్ؚలో ప్రత్యేకమైన క్యాబిన్ ఉండవచ్చు. ఇది గ్రాండ్ i10 నియోస్ మరియు వెన్యూల కలయిక కావచ్చు. ఫీచర్‌ల పరంగా భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉంటాయని ఆశించవచ్చు.
83PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎక్స్‌టర్‌కు పవర్‌ను అందిస్తుంది, ఇది గ్రాండ్ i10 నియోస్, i20, ఆరా మరియు వెన్యూ బేస్ వేరియెంట్ؚలలో కూడా ఉంది. మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ మిషన్ؚల మరియు CNG ఎంపికని కూడా అందించవచ్చు. ఎక్స్ؚటర్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో కూడా అందుబాటులో ఉంటుంది అని అంచనా వేస్తున్నాము.
ఇది కూడా చదవండి: రూ.10 లక్షల కంటే తక్కువ ధరతో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కలిగిన 10 అత్యంత చవకైన కార్‌లు
ఎక్స్‌టర్‌ను హ్యుందాయ్ సుమారు రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందిస్తుందని అంచనా. ఈ కారు తయారీదారు లైన్అప్‌లో, ఇది గ్రాండ్ i10 నియోస్‌కు సమానమైన ప్రత్యామ్నాయంగా, i20 ధరలో వస్తుంది. ఈ కొత్త మైక్రో SUV టాటా పంచ్, సిట్రోయెన్ C3, మారుతి ఇగ్నిస్ మరియు ఇతర కాంపాక్ట్ హ్యాచ్ؚబ్యాక్ؚలతో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful