హ్యుందాయ్ శాంత్రో పాతది VS కొత్తది: ప్రధాన వ్యత్యాసాలు

హ్యుందాయ్ శాంత్రో కోసం dhruv attri ద్వారా జూన్ 10, 2019 11:42 am ప్రచురించబడింది

  • 29 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ యొక్క తాజా పొడవైన ఆకారం దాని పాత కారు నుండి చాలా మార్పులు పొందింది. కానీ ఎందులో? పదండి కనుక్కుందాము    

Hyundai Santro Old vs New: Major Differences

నవీకరణ: కొత్త హ్యుందాయ్ శాంత్రో రూ.3.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, పాన్ భారతదేశం) ప్రారంభ ధర వద్ద భారతదేశంలో ప్రారంభించబడింది. ఇక్కడ అన్ని వివరాలను పొందండి.

హ్యుందాయ్, సెప్టెంబర్ 1998 లో శాంత్రో తో ఇండియన్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది,ఇప్పుడు అదే హ్యాచ్‌బ్యాక్ ని కొత్త మోనికర్ తో తెచ్చింది. ఈ కొత్త తరం శాంత్రో అనేది పాత వెర్షన్ నిలిపివేయబడిన నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మరింత చక్కగా మళ్ళీ ప్రారంభించబడింది. కాబట్టి ఇంక ఏమీ ఆలోచించకుండా పదండి చూద్దాము, ఈ రెండు హ్యాచ్‌బ్యాక్ లు ఏమిటి అందిస్తున్నాయో పదండి చూద్దాము.

డిజైన్:

శాంత్రో స్పోర్ట్ యొక్క రెండు వెర్షన్లు ఒక పొడవైన ఆకారపు డిజైన్ ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడతో ఈ సమపాళ్ళలో ఉండే అంశాలు అనేవి ముగిసిపోతాయి. పాత శాంత్రో సాధారణంగా ఉండే ముందర భాగంతో ట్రిపుల్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్ ని కలిగి ఉంటుంది, అయితే ప్రస్తుత ఉన్నది హ్యుందాయి యొక్క కాస్కేడింగ్ గ్రిల్ ని కలిగి ఉంటుంది. పాత కారు యొక్క గ్రిల్ కి దీర్ఘచతురస్ర హెడ్ల్యాంప్ లను కలిగి ఉంటుంది. మరొకవైపు కొత్తది అప్‌స్వెప్ట్ హెడ్‌ల్యాంప్స్ లు ఉంటాయి, ఇవి గ్రాండ్ i10 నుండి  ప్రేరేపితం చేయబడి ఉంటాయి.   

Hyundai Santro Old vs New: Major Differences

పాత శాంత్రో యొక్క ప్రక్క ప్రొఫైల్ విషయానికి వస్తే దీనిలో మనకి చిన్న క్రీజులు లాంటివి ముందర మరియు వెనుక భాగంలో వస్తాయి, అవే కొత్త శాంత్రో లో మరింత సరికొత్త రూపంలో పెట్టడం జరిగింది. దీనికి తోడు వెనకాతల విండో యొక్క క్రింద భాగంలో ఒక చిన్న వొంపు లాగా మనకి కనిపిస్తుంది, వెనకాతల భాగంలో మునుపటి శాంత్రో ఒక ఉన్నత-ఆకారపు వెనుక విండ్షీల్డ్ మరియు ఒక నిలువుగా ఉంచబడిన టెయిల్ ల్యాంప్స్ తో ఒక సాధారణ డిజైన్ లేఅవుట్ ని కలిగి ఉంది. దీనికి విరుద్ధంగా, కొత్తది గ్రాండ్ i10 లో ఉన్న మాదిరిగానే టెయిల్ లాంప్స్ ని కలిగి ఉంది మరియు గట్టిగా ఉండే బూట్ కలిగి ఉంటుంది, ఉదాహరణకు నిలిపి వేయబడిన మారుతి సుజుకి A-స్టార్ లో ఉన్నటువంటి విధంగా ఉంటుంది.

  • స్పెసిఫిక్ పోలిక: 2018 హ్యుందాయ్ శాంత్రో vs డాట్సన్ గో ఫేస్‌లిఫ్ట్  vs సెలెరియో Vs టియాగో vs వాగన్R

కొలతలు

కొలతలు (mm)

పాత శాంత్రో

కొత్త శాంత్రో

పొడవు

3565

3610

వెడల్పు

1525

1645

ఎత్తు

1590

1560

వీల్బేస్

2380

2400

వీల్ సైజ్

13- ఇంచ్

14- ఇంచ్

కొత్త హ్యుందాయ్ శాంత్రో తన టైర్ సైజుతో సహా దాదాపు అన్ని అంశాలలో పెరిగింది. ఇది చిన్నది అయినప్పటికీ, హెడ్‌రూం అనేది ఇబ్బందిగా అయితే ఉండదు అది రిపోర్ట్ చేయడానికి మేము సంతోషంగా భావిస్తున్నాము. మీరు కొత్త శాంత్రో యొక్క ప్రారంభ ప్రభావాలను గురించి మరింత తెలుసుకోవచ్చు.   

Hyundai Santro Old vs New: Major Differences

ఇంజిన్

 

పాత శాంత్రో

కొత్త శాంత్రో

ఇంజిన్

1.1-లీటర్, 4-సిలెండర్ పెట్రోల్

1.1-లీటర్, 4-సిలెండర్ పెట్రోల్

పవర్

63PS

69PS

టార్క్

98Nm

99Nm

ట్రాన్స్మిషన్

5- స్పీడ్ MT

5- స్పీడ్ MT/AMT

 ఈ 1.1 లీటర్  E- ఎప్సిలాన్ ఇంజిన్ పూర్తిగా నూతనంగా పునఃనిర్మించబడింది. ఇది ఇప్పుడు అధిక శక్తి మరియు టార్క్ గణాంకాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ దాని ప్రత్యక్ష పోటీదారులతో పోలిస్తే అదనపు సిలిండర్ యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది, ఇది 3-సిలిండర్ ఇంజిన్లతో పని చేస్తుంది మరియు ఇది మరింత శుద్ధి చేస్తుంది. మొట్టమొదటిసారిగా ఏ హ్యుందాయి లో లేని విధంగా, కొత్త శాంత్రో కొత్త 5-స్పీడ్ AMT ని భారతదేశంలో అభివృద్ధి చేయబడి కలిగి ఉంది. ముందు వలే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ని కూడా పొందుతుంది. ఈ ఇంజన్ కి కర్మాగారం నుండి నేరుగా CNG కిట్ ని కలిగి ఉంటుంది.

Hyundai Santro Old vs New: Major Differences

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్

నాలుగు సంవత్సరాల క్రితం, ఒక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ నిజంగా ఎంట్రీ లెవల్ లేదా కాంపాక్ట్ హాచ్బాక్ యొక్క ఫీచర్ జాబితాలో భాగం కాదు. ఆ విధంగా, మునుపటి శాంత్రో లో AUX మరియు USB కనెక్టివిటీతో ఒక సింగిల్ DIN ఆడియో యూనిట్ ఉండేది. ఇది ఒక 7-అంగుళాల టచ్స్క్రీన్ యూనిట్ ని ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ మరియు AUX-కనెక్టివిటీ తో ఉండడం అనేది ఒక పెద్ద మెరుగుదల అని చెప్పవచ్చు..  

Hyundai Santro Old vs New: Major Differences

భద్రతా లక్షణాలు

పాత శాంత్రో EBD తో ABS లేదా ఎయిర్బాగ్స్ ని గానీ అందించలేదు. ఇది ముందర మరియు వెనుక సీటు బెల్ట్లు, డే/నైట్ IRVM, కీలెస్ ఎంట్రీ, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్స్ మరియు ఇంజిన్ ఇమ్మొబలైజర్ వంటి లక్షణాలు కలిగి ఉంది. కొత్త 2018 హ్యుందాయ్ శాంత్రో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS, సెన్సార్స్ తో రేర్ పార్కింగ్ కెమేరా, ఫాగ్ లాంప్స్ తో కూడా లభిస్తుంది. డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ మరియు ABS ప్రామాణికంగా అందించబడతాయి.   

కొత్త హ్యుందాయ్ శాంత్రో లోని అన్ని నవీకరణలు కొన్ని అంశాల్లో పోటీదారుల కి సమానంగా లేదా ఇంకా మెరుగ్గా ఉంటాయి అని చెప్పవచ్చు, కానీ కొన్ని ఎంట్రీ-లెవల్ వేరియంట్స్ వాటి ధరను సమర్థించేలా కనిపించవు మరియు ఈ ధరకు వచ్చిన భద్రతా లక్షణాలు కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ శాంత్రో

1 వ్యాఖ్య
1
V
vikas verma
Jun 30, 2022, 11:32:45 PM

It's phased out anyway. So why even this comparison

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    explore మరిన్ని on హ్యుందాయ్ శాంత్రో

    కార్ వార్తలు

    ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience