• English
    • Login / Register

    రూ. 6.99 లక్షల ధరతో విడుదలైన Hyundai i20 ఫేస్‌లిఫ్ట్

    హ్యుందాయ్ ఐ20 కోసం tarun ద్వారా సెప్టెంబర్ 08, 2023 02:40 pm సవరించబడింది

    • 76 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    తాజా స్టైలింగ్ మరియు నవీకరించబడిన ఇంటీరియర్ డిజైన్‌తో, i20 హ్యాచ్‌బ్యాక్ పండుగ సీజన్‌లో తేలికపాటి నవీకరణను పొందుతుంది.

    Hyundai i20 2023

    • హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.99 లక్షల నుండి రూ. 11.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. 

    • ఇది కొత్త బేస్-స్పెక్ ఎరా వేరియంట్‌ను పొందుతుంది.

    • పునఃరూపకల్పన చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు సవరించబడిన వెనుక బంపర్ లను పొందుతుంది.

    • కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ గ్రే థీమ్ ఇంటీరియర్, మునుపటి -ఫేస్‌లిఫ్ట్ తో సమానంగా ఉంటుంది.

    • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ ఇప్పుడు ప్రామాణికం.

    • 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఎంపికను కోల్పోతుంది. అయితే మాన్యువల్ మరియు IVTతో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది.

    హ్యుందాయ్ i20 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ప్రారంభించబడింది, దీని ధరలు రూ. 6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుత తరం 2020eలో భారతదేశంలో ప్రారంభమైన తర్వాత, హ్యాచ్‌బ్యాక్ దాని మొదటి తీవ్రమైన నవీకరణను పొందుతుంది. బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వేరియంట్‌ల వారీగా ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    ధర తనిఖీ

    ట్రాన్స్మిషన్

    ఎరా

    మాగ్నా

    స్పోర్ట్జ్

    అస్తా

    అస్తా (O) 

    MT

    రూ.6.99 లక్షలు

    రూ.7.77 లక్షలు

    రూ.8.33 లక్షలు

    రూ.9.30 లక్షలు

    రూ.9.98 లక్షలు

    IVT

    -

    -

    రూ.9.34 లక్షలు

    -

    రూ.11.01 లక్షలు

    హ్యుందాయ్ i20 యొక్క ప్రారంభ ధర తగ్గింది, కొత్త దిగువ శ్రేణి ఎరా వేరియంట్‌కు ధన్యవాదాలు. ఇకపై టర్బో-పెట్రోల్ ఎంపిక లేనందున, అగ్ర శ్రేణి వేరియంట్ ధర కూడా తగ్గింది.

    మార్పు చేయబడిన స్టైలింగ్

    Hyundai i20 2023

    దృశ్యమాన మార్పులు సూక్ష్మంగా ఉన్నప్పటికీ, అవి ఇప్పటికీ సులభంగా గుర్తించబడతాయి. క్యాస్కేడింగ్ గ్రిల్ డిజైన్ మరియు LED హెడ్‌ల్యాంప్‌లు సవరించబడ్డాయి, LED DRLలు ఇప్పటికీ విలోమం చేయబడ్డాయి. ఫాగ్ ల్యాంప్స్ అందించబడలేదు, కానీ ఎయిర్ డ్యామ్ డిజైన్ కొద్దిగా అప్‌డేట్ చేయబడింది. రేసింగ్ స్కర్ట్‌ల వలె కనిపించే రీడిజైన్ చేయబడిన బంపర్‌లు ఫ్రంట్ లుక్‌ కు మరింత అందాన్ని పెంచుతాయి.

    కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారణంగా i20 ఫేస్‌లిఫ్ట్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. వెనుక ప్రొఫైల్ రీడన్ బంపర్‌తో అప్‌డేట్ చేయబడింది, అయితే అదే Z-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌లతో కొనసాగుతుంది.

    లోపలి భాగంలో సూక్ష్మమైన మార్పులు

    Hyundai i20 2023

    ఇంటీరియర్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో సమానంగా కనిపిస్తుంది, కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ గ్రే ఇంటీరియర్ కోసం అందించబడింది, ఇది ఆల్-బ్లాక్ థీమ్‌ను భర్తీ చేస్తుంది. లెథెరెట్ సీట్లు సెమీ-లెథెరెట్ అప్హోల్స్టరీ తో మార్చబడ్డాయి, అయితే డోర్ ట్రిమ్‌లపై సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఇప్పటికీ ఉంది.

    ఫీచర్ మార్పులు

    20 ఫేస్‌లిఫ్ట్ కేవలం USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ ఫీచర్‌ను  పొందుతుంది. అంతేకాకుండా ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటలైజ్డ్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌ వంటి మునుపటి అంశాలతో కొనసాగుతుంది.

    ప్రామాణికమైన భద్రతా లక్షణాలు

    i20 ఫేస్‌లిఫ్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ESC, హిల్ అసిస్ట్ కంట్రోల్, డే-నైట్ IRVM, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ మరియు ప్యాసింజర్లందరికీ మూడు-పాయింట్ సీట్‌బెల్ట్‌లతో మరింత భద్రత మెరుగుపరిచబడింది. అధిక శ్రేణి వేరియంట్‌లు వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను ప్రామాణికంగా పొందుతాయి.

    నవీకరించబడిన పవర్‌ట్రెయిన్

    సాధారణ i20 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను కోల్పోతుంది కాబట్టి ఇక్కడ అతిపెద్ద మార్పు నిజానికి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కి ఇది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు. హ్యాచ్‌బ్యాక్‌కు శక్తినివ్వడం కోసం, ఇప్పుడు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది, ఈ ఇంజన్ 83PS మరియు 115Nm పవర్, టార్క్ లను విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ లతో జతచేయబడతాయి, రెండోది పవర్ ఫిగర్‌ను 88PSకి పెంచుతుంది.

    టర్బో-పెట్రోల్, N లైన్ వేరియంట్‌ల కోసం ప్రత్యేకంగా అందించబడింది, ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ పొందుతుందని భావిస్తున్నారు.

    ప్రత్యర్థులు

    హ్యుందాయ్ ఐ20- టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతోంది.

    మరింత చదవండి : హ్యుందాయ్ ఐ20 ఆన్ రోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Hyundai ఐ20

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience