హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10: ఓల్డ్ వర్సెస్ న్యూ
మార్చి 12, 2019 11:10 am raunak ద్వారా ప్రచురించబడింది
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండవ తరం హ్యుందాయ్ ఐ 10 ఫేస్లిఫ్ట్ (ఇది భారతదేశంలో గ్రాండ్ ఐ 10 గా పిలువబడుతుంది) ఇంటర్నెట్లో ఆగస్ట్ 2016 లో అలాగే ప్రజలకు 2016 ప్యారిస్ మోటార్ షోలో బహిర్గతమైంది. ఇది దేశంలో హ్యుండాయ్ యొక్క కొత్త 'క్యాస్కేడింగ్' ఫ్యామిలీ గ్రిల్ ను తొలిసారిగా చూస్తే ఇది దక్షిణ కొరియా వాహనదారుడి ఒక ముఖ్యమైన ప్రపంచ మోడల్ అనుకుంటారు.
రెండో- తరం ఐ 10 పరిచయం తరువాత, ఈ కాస్కేడింగ్ గ్రిల్ నవీకరించిన క్రీటా (బ్రెజిల్ లో వెల్లడించబడిన)లో, మరియు అన్ని-కొత్త ఐ30 (భారతదేశంలో రాలేదు) వాహనాలలో అందించబడింది. ఈ కొత్త గ్రిల్తో పాటు, 2017 గ్రాండ్ ఐ 10 కు హ్యుందాయ్ మార్పులు చేర్పులు చేసింది, ఎందుకంటే మొదట, ఇది 2017 లో మారుతి సుజుకి స్విఫ్ట్తో పోటీపడవలసి ఉంది మరియు రెండవది, మారుతి ఇగ్నిస్తో పాటు అనేక సెగ్మెంట్-ఫస్ట్స్ ప్యాకింగ్ ఉంది. ముందు ఫేస్లిఫ్ట్ మోడల్ తో పోలిస్తే ఈ నవీకరించిన హ్యాచ్ బ్యాక్ లో ఏ అంశాలు విభిన్నంగా అందించారో చూద్దాం.
- కొత్త స్విఫ్ట్ లో అందించబడిన ఈ 5 పాయింట్లను తెలుసుకోవాలి
ఎక్స్టీరియర్స్
ఈ కారు యొక్క ముందు భాగం విష్యానికి వస్తే, ఇదీరకే చెప్పినట్టుగా ఫ్రంట్ ప్రొఫైల్ అద్భుతంగా ఉంటుంది - కొత్త కాస్కేడింగ్ గ్రిల్ పాత షట్కోణ ఆకృతితో ఉన్న గ్రిల్ ను భర్తీ చేస్తుంది. ఎలైట్ ఐ20 వలె, గ్రాండ్ ఐ 10 కూడా డే టైం రన్నింగ్ ఎల్ ఈ డి లైట్ లను అందుకుంటుంది, ఇవి దాని ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ లో ఉంచబడతాయి. అంతేకాకుండా, కొత్త ఎలంట్రా లాగానే, బూమేరాంగ్ ఆకారపు ముందు ఫాగ్ ల్యాంప్ లు కూడా ఎయిర్ కర్టెన్ల వలే పనిచేస్తాయి, ఇది ముందు వైపు నుండి వచ్చే ఎక్కువ గాలి వలన కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఏ మాత్రం మారలేదు, ముందు దానిలో అందించిన అవే 14- అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ చక్రాల కొత్త సెట్ అందిచబడుతుంది. వెనుక భాగం విషయానికి వస్తే, వృత్తాకార ప్రతిబింబాలతో కూడిన పునఃరూపకల్పన చేయబడిన డ్యూయల్ టోన్ బంపర్ను మాత్రమే పొందింది. పాత వైన్ రెడ్ స్థానంలో ఇది కొత్త మరియు ప్రకాశవంతమైన రంగు, రెడ్ ప్యాషన్, ఇప్పుడు అందుబాటులో ఉంది.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
లోపల భాగం విషయానికి వస్తే, హ్యుందాయ్ దాని ముందు మోడల్ లో ఉన్న సుదీర్ఘ జాబితా తో పాటు అపోలిస్ట్రీ ని నిలుపుకుంటూ డాష్ బోర్డ్ యొక్క థీమ్ ను అలాగే అదనపు ఫీచర్లతో కొనసాగుతుంది. దాని ప్రత్యక్ష ప్రత్యర్థులను మేము పరిగణించినట్లయితే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 దాని మొట్టమొదటి ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలో మిర్రర్లింక్ కనెక్టివిటీతో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే మద్దతును అందించే మొదటి కారుగా మారుతుంది. ఇది రేర్ వ్యూ కెమెరా స్క్రీన్ కూడా అధనపు భలాన్ని చేకూరుస్తుంది, ఇది అంతకుముందు అంతర్గత రేర్ వ్యూ మిర్రర్లో అమర్చబడింది.
అలాగే, తక్కువ వేరియంట్లలో, పాత నాన్ టచ్ యూనిట్ ను కొత్త ఐదు- అంగుళాల టచ్- ఆధారిత యూనిట్తో భర్తీ చేయబడింది. 2017 గ్రాండ్ ఐ 10 ఇప్పుడు ఎక్సెంట్ లో ఉన్న ఒక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ను అందిస్తుంది, ఇది ముందు- ఫేస్లిఫ్ట్ నమూనాలో అందుబాటులో లేదు.
ఇంజిన్లు
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫేస్లిఫ్ట్ మోడల్ 1.2 లీటర్ సీఅర్డీఇ డీజిల్ ఇంజన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజన్- 1.1 లీటర్ల సి ఆర్ డి ఐ స్థానాన్ని బర్తీ చేసింది. ఈ కొత్త 1.2 లీటర్ డీజిల్, గరిష్టంగా (75పిఎస్ / 190 ఎన్ఎం) గలా గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది, (సుమారుగా 30ఎన్ఎం) ఒక ముఖ్యమైన బంప్ వస్తుంది, ఇది చాలా గరిష్ట శక్తిని కలిగి ఉంది, దాని గరిష్ట శక్తి ముందు దాని కంటే 4 పిఎస్ యొక్క ఆరోగ్యకరమైన బంప్ను అందిస్తుంది. ముందుగా, డీజిల్ ఇంజన్- ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్- మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ఎంపికను కూడా అందుబాటులో ఉంటుంది. దాని ట్రాన్స్మిషన్ ఎంపికల విషయానికి వస్తే (ఐదు- స్పీడ్ మాన్యువల్ మరియు నాలుగు- స్పీడ్ ఆటోమేటిక్) లతో మార్పు చెందుతుంది.
సిఫార్సు చేయబడిన దానిని చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఫేస్లిఫ్ట్: వేరియంట్ల వివరాలు
మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10