హ్యుందాయ్ ఎక్స్టర్ vs టాటా పంచ్ vs మారుతి ఇగ్నిస్: పరిమాణం, పవర్ ట్రైన్ మరియు ఇంధన సామర్థ్యాల పోలిక.
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం ansh ద్వారా జూలై 12, 2023 11:24 pm ప్రచురించబడింది
- 602 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎక్స్టర్ దాని ప్రధాన పోటీదారుల కంటే ఏ విధంగా ముందుకు దూసుకుపోతోందో చూద్దాం.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఇండియాలోని కొరియన్ బ్రాండ్కు సంబంధించిన అతి చిన్న SUV. ఇది మైక్రో SUV విభాగంలోకి తాజాగా చేరింది. ఇది టాటా పంచ్ మరియు మారుతి ఇగ్నిస్లకు గట్టి పోటీదారు. అయితే, మారుతి ఇగ్నిస్ మిగితా SUVల మాదిరిగా ఉండదు. ఎక్స్టర్ మిగితా SUVలతో పోలిస్తే పరిమాణం మరియు పవర్ ట్రైన్ వంటి అంశాల్లో ఏ విధంగా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిమాణం
కొలతలు |
హ్యుందాయ్ ఎక్స్టర్ |
టాటా పంచ్ |
మారుతి ఇగ్నిస్ |
పొడవు |
3.815 mm |
3,827 mm |
3,700 mm |
వెడల్పు |
1,710 mm |
1,742 mm |
1,690 mm |
ఎత్తు |
1,631 mm |
1,615 mm |
1,595 mm |
వీల్ బేస్ |
2,450 mm |
2,445 mm |
2,435 mm |
బూట్ స్పేస్ |
391 లీటర్లు |
366 లీటర్లు |
260 లీటర్లు (పార్సెల్ ట్రే వరకు) |
టాటా పంచ్ బాగా పొడవైనది మరియు వెడల్పైనది కాగా, ఎక్స్టర్ యొక్క పొడవు దాని SUV గుర్తింపుని మరింత మెరుగుపరుస్తుంది. ఈ రెండిటి యొక్క వీల్ బేస్ ఒకేలా ఉన్నప్పటికీ ఎక్స్టర్లోని వీల్ బేస్ 5 మిల్లీమీటర్ల అదనపు పొడవు ఉంటుంది. అయితే, దాని యొక్క పొడవైన రూపకల్పన కారణంగా హ్యుందాయ్ మరింత ఎక్కువ లగేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ వర్సెస్ టాటా పంచ్, సిట్రోయెన్ C3 మరియు ఇతర కార్లు : ధరల పోలిక
మరోవైపు ఎక్స్టర్ మరియు పంచ్ కంటే ఇగ్నిస్ అన్ని అంశాలలోనూ చిన్నది. దీనివల్ల ఇది అన్నిటికంటే అతి చిన్న మోడల్ గా నిలిచింది. పోల్చి చూస్తే దీనికి అతి చిన్న బూట్ కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్స్టర్ మరియు పంచ్ కేవలం పార్సెల్ షెల్ఫ్ వరకు మాత్రమే కాకుండా వాటి వాటి సామర్థ్యాలను రూఫ్ వరకు పేర్కొంటున్నాయి.
పవర్ ట్రైన్
లక్షణాలు |
హ్యుందాయ్ ఎక్స్టర్ |
టాటా పంచ్ |
మారుతి ఇగ్నిస్ |
|
ఇంజన్ |
1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్+ CNG |
1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ |
పవర్ |
83PS |
69PS |
86PS |
83PS |
టార్క్ |
114Nm |
95Nm |
115Nm |
113Nm |
ట్రాన్స్మిషన్ |
5MT/ 5AMT |
5MT |
5MT/ 5AMT |
5MT/ 5AMT |
ఈ మూడు మోడల్స్ 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఎంపికల్లో అందిస్తున్నాయి. మూడిటిల్లోకల్లా పంచ్ యొక్క ఇంజన్ అత్యధిక పవర్ మరియు టోర్క్ను ఉత్పన్నం చేస్తుంది. దీనివల్ల మిగితా రెండిటి కంటే ఇది మెరుగైనదిగా పరిగణింపబడుతుంది. కాకపోతే, ఈ విభాగంలో CNG పవర్ ట్రైన్ను అందించే ఒకే ఒక్క మోడల్ ప్రస్తుతానికి ఎక్స్టర్ మాత్రమే.
ఇదీ చూడండి: మారుతి ఇన్విక్టో జీటా+ వేరియంట్ను ఈ చిత్రాల్లో చూడండి.
మారుతి పంచ్ CNG ఇంకా తయారీ దశలోనే ఉంది. ఇది ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అందుబాటులోకి రావచ్చు. కాకపోతే ఇగ్నిస్లో CNG ఎంపిక ఉన్నట్టు ఎలాంటి వార్తలు లేవు. టాటా యొక్క CNG వేరియంట్కు ఉన్న ట్విన్ సిలిండర్ సెటప్ (ఏర్పాటు) కారణంగా సౌకర్యవంతమైన అతి పెద్ద బూట్ లభిస్తుంది. అలాగే కారుని నేరుగా CNG మోడ్ లో స్టార్ట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.
ఇంధన సామర్థ్యం
ఇంధన సామర్థ్యం |
హ్యుందాయ్ ఎక్స్టర్ |
టాటా పంచ్ |
మారుతి ఇగ్నిస్ |
పెట్రోల్ MT |
19.4 kmpl |
20.09 kmpl |
20.89 kmpl |
పెట్రోల్ AMT |
19.2 kmpl |
18.8 kmpl |
|
CNG MT |
27.1 km/kg |
NA |
NA |
టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్టర్లలో మాన్యువల్ షిఫ్టర్ కలిగి ఉన్న టాటా SUV అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నదిగా చెప్తారు. కాగా, హ్యుందాయ్ మోడల్లో ఉన్న AMT ఎంపికల వల్ల దీని నిర్వహణ భారం అర్థవంతంగా ఉంటుందని తయారీదారుల వెళ్ళడి. మరోవైపు ఇగ్నిస్ మాన్యువల్ మరియు AMT వేరియంట్స్ రెండిటికీ సమానంగా మైలేజీ అందిస్తుందని భావన. ఇది మిగితా రెండు SUV ల మైలేజీ కంటే మరింత ఎక్కువ.
ఇదీ చదవండి: ఈ నాలుగు నగరాల్లో టయోటా ఇన్నోవా హై క్రాస్ కన్నా మారుతి ఇన్విక్టో వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ.
ఏది ఏమైనా, పీక్ ఫ్యూయల్ ఎకానమీస్ ఆధారంగా ఈ మూడింటినీ పోల్చి చూస్తే, ఎక్స్టర్ CNG 27.1km/kg చొప్పున మెరుగైన ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని గమనించవచ్చు.
డాక్యుమెంట్ల ఆధారంగా లేదా అధికారికంగా ఈ మూడు మైక్రో SUV లలోని భేదాలను చూపిస్తూ ఎన్నో అంశాలు లేకపోయినా, ఎక్స్టర్ మరియు పంచ్ దాదాపు అన్ని అంశాల్లో మరీ దగ్గరగా ఉంటాయి. ఒక్క ఇగ్నిస్ మాత్రమే అతి తక్కువ నిష్పత్తులతో మిగితా వాటితో పోలిస్తే రాజీ పడి ఉంటుంది. వీటి ఫీచర్లలో ఉన్న తేడాలను మనం మరొక కథనంలో తెలుసుకుందాం. కాబట్టి వీటి గురించి మరింత తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండండి. అయితే, వీటిల్లో నుంచి మీరు దేనిని ఎంచుకుంటారో కామెంట్ల రూపంలో మాకు తెలపండి.
మరింత చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ AMT.