• English
  • Login / Register

విడుదలకు ముందే 10,000 బుకింగ్ؚలను పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్

హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం ansh ద్వారా జూలై 12, 2023 07:50 am ప్రచురించబడింది

  • 8.9K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ ఎక్స్టర్ డెలివరీలు 11 జూలై నుండి ప్రారంభం కానున్నాయి

Hyundai Exter

  • ఎక్స్టర్ ధరలు రూ.5.99 లక్షల (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి

  • మైక్రో-SUV బుకింగ్ؚలు కొంత కాలం క్రితం ప్రారంభం అయ్యాయి.

  • 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు CNG పవర్‌ట్రెయిన్ؚతో కూడా వస్తుంది.

  • ఫీచర్‌లలో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్-ఆధారిత సింగిల్-పేన్ సన్ؚరూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంటాయి.

సుమారు మూడు నెలలు తరువాత, హ్యుందాయ్ ఎక్స్టర్ రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్) మార్కెట్ؚలోకి ప్రవేశించింది. టాటా పంచ్, మారుతి ఇగ్నిస్ؚలతో ఎక్స్టర్ నేరుగా పోటీ పడనుంది మరియు ఇప్పటికే అధిక సంఖ్యలో బుకింగ్ؚలను పొందింది. దీని బుకింగ్ మరియు డెలివరీ వివరాలు ఇక్కడ అందించబడ్డాయి:

బుకింగ్ؚలు & డెలివరీ

Hyundai Exter

ఎక్స్టర్ బుకింగ్ؚలు 2 నెలల క్రితం ప్రారంభం అయ్యాయి, రూ.11,000 ముందస్తు ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు. విడుదల సమయంలోనే 10,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను పొందింది. ఈ వాహన డెలివరీలు 11 జూలై నుండి ప్రారంభం అవుతాయని హ్యుందాయ్ వెల్లడించింది. 

పవర్ؚట్రెయిన్

Hyundai Exter Engine

ఎక్స్టర్ 82PS పవర్ మరియు 113Nm టార్క్‌ను అందించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో జత చేయబడుతుంది. CNG పవర్‌ట్రెయిన్ؚను కూడా పొందనుంది, ఇందులో ప్రస్తుతం అందించే ఇంజన్ؚతో వస్తుంది కానీ కొంత తక్కువగా 69PS పవర్ మరియు 95Nm టార్క్‌ను అందిస్తుంది. CNG వేరియెంట్ؚలు కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తాయి.

ఫీచర్‌లు & భద్రత

Hyundai Exter Dashboard

హ్యుందాయ్ ఎక్స్టర్ؚలో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లతో సింగిల్-పేన్ సన్ؚరూఫ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు రెండు కెమెరాలతో డ్యాష్ؚకామ్ ఉంటాయి.

ఇది కూడా చదవండి: గ్రాండ్ i10 నియోస్‌తో పోలిస్తే హ్యుందాయ్ ఎక్స్టర్ؚలో అదనంగా ఉన్న 5 ఫీచర్‌లు 

దీని ప్రామాణిక భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM) మరియు ప్యాసెంజర్‌లు అందరికి 3-పాయింట్ సీట్ బెల్టులు ఉంటాయి. ఈ మైక్రో-SUV హయ్యర్ వేరియెంట్ؚలు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), డే & నైట్ IRVM, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు మరియు రేర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్‌లను కూడా పొందుతాయి. 

ధర & పోటీదారులు 

Hyundai Exter

ఈ వాహన మోడల్‌ల పూర్తి ధరల జాబితాను ప్రస్తుతానికి వెల్లడించలేదు, కేవలం మాన్యువల్ వేరియెంట్ؚల ధరలు మాత్రమే వెల్లడయ్యాయి, ఇవి రూ.5.99 లక్షల నుండి రూ.10 లక్షల (పరిచయ ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. టాటా పంచ్ మరియు మారుతి ఇగ్నిస్ؚలతో ఎక్స్టర్ నేరుగా పోటీ పడుతుంది అయితే దీన్ని సిట్రోయెన్ C3, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ؚలకు ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: ఎక్స్టర్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai ఎక్స్టర్

1 వ్యాఖ్య
1
S
sanjay singh
Jul 22, 2023, 12:59:21 PM

Muje bhi chahiye

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience