గ్రాండ్ i10 నియోస్‌తో పోలిస్తే, హ్యుందాయ్ ఎక్స్టర్ కలిగి ఉన్న 5 ఫీచర్లు
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా జూన్ 19, 2023 04:58 pm ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎక్స్టర్ తన తోటి హ్యాచ్ؚబ్యాక్ؚతో కొన్ని సమిష్టి అంశాలను కూడా కలిగి ఉంది
హ్యుందాయ్ ఎక్స్టర్ క్యాబిన్ చిత్రాల మొదటి వివరణాత్మక లుక్ ఇప్పటికే చూశాం. ఈ మైక్రో SUVలో అందించే అనేక ఫీచర్‌లను కూడా ఈ కారు తయారీదారు నిర్ధారించారు. లైన్ؚఅప్ؚలో గ్రాండ్ i10 నియోస్ కంటే ఎగువన ఎక్స్టర్ నిలుస్తుంది కాబట్టి, ఇది ఈ ప్లాట్ؚఫార్మ్ؚలో వచ్చే తన తోటి వాహనం కంటే మరిన్ని ఫీచర్‌లతో వస్తుంది.
గ్రాండ్ i10 నియోస్ కంటే ఎక్స్టర్‌లో అందిస్తున్న టాప్ ఐదు ఫీచర్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం:
డిజిటైజ్డ్ డ్రైవర్ డిస్ప్లే
నవీకరించిన వెన్యూలో ఉన్న డిజిటలైజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚను హ్యుందాయ్ ఎక్స్టర్‌లో అందిస్తుంది. టైర్ ప్రెజర్, ఓడోమీటర్ రీడింగ్ మరియు ఇంధన స్థాయి వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూపించే రంగుల TFT MIDతో వస్తుంది. కానీ గ్రాండ్ i10 నియోస్‌లో రెండు అనలాగ్ డయల్స్ మధ్యలో మాత్రమే రంగుల TFT డిస్ప్లేను పొందింది.
ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు
నవీకరించిన గ్రాండ్ i10 నియోస్ నాలుగు ప్రామాణికంగా పూర్తిగా ఆరు ఎయిర్ బ్యాగ్ؚల వరకు అందిస్తుండగా, ఎక్స్టర్‌లో ఇందుకు భిన్నంగా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా అందిస్తోంది. తన ప్రత్యక్ష ప్రత్యర్ధి అయిన టాటా పంచ్ కంటే దీనికి ఉన్న ప్రయోజనాలలో ఇది ఒకటి.
డ్యూయల్-కెమెరా డ్యాష్ؚక్యామ్
డ్యాష్ؚకామ్ సెటప్ యాక్సెసరీలా కాకుండా అధికారిక ఫీచర్‌ల జాబితాలో వస్తున్న మొదటి హ్యుందాయ్ కారుగా వెన్యూ N లైన్ నిలిచింది. అత్యవసర పరిస్థితులలో అందుబాటులో ఉండే, మరియు దీర్ఘమైన మరియు సాహస ప్రయాణాలను డాక్యుమెంట్ చేయడానికి లేదా మీ ట్రిప్ؚలను రికార్డ్ చేయడానికి ఎక్స్టర్ డ్యూయల్-డిస్ప్లే యూనిట్ؚతో వస్తుందని హ్యుందాయ్ ప్రస్తుతం ధృవీకరించింది.
ఇది కూడా చూడండి: మొదటిసారి కెమెరాకు చిక్కిన నవీకరించిన హ్యుందాయ్ i20 N లైన్
సింగిల్-పేన్ సన్ؚరూఫ్
హ్యుందాయ్ నుంచి వస్తున్న కొత్త ఎంట్రీ-లెవెల్ SUV ఆకర్షణ, సింగిల్-పేన్ సన్ؚరూఫ్ జోడించడంతో మరింతగా పెరిగింది. దీనితో ఇది గ్రాండ్ i10 నియోస్‌ను మాత్రమే కాకుండా పంచ్ కంటే కూడా భిన్నంగా ఉండేలా చేస్తుంది. భారతదేశంలో సన్‌రూఫ్ؚతో వస్తున్న అతి చిన్న కారుగా కూడా ఇది నిలుస్తుంది.
సెమీ-లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ
టాప్-స్పెక్ వేరియెంట్ؚలో కూడా ఫ్యాబ్రిక్ సీట్‌లతో వచ్చే గ్రాండ్ i10 నియోస్ؚలాగా కాకుండా ఎక్స్టర్ సెమీ-లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీతో వస్తుంది. ఎక్స్టర్ؚలో పూర్తి నలుపు రంగు క్యాబిన్ థీమ్‌ను పొందింది, ఈ హ్యాచ్ؚబ్యాక్ؚలో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కూడా ఉంది.
సంబంధించినది: హ్యుందాయ్ ఎక్స్టర్: దీని కోసం వేచి ఉండాలా లేదా పోటీదారులలో ఒక దాన్ని ఎంచుకోవాలా?
ముఖ్యమైన సారూప్యతలు
ఎక్స్టర్ؚను హ్యుందాయ్ విభిన్నంగా ఉన్న క్యాబిన్ మరియు ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚతో అందిస్తున్నా, దీనికి గ్రాండ్ i10 నియోస్ؚతో కొన్ని ముఖ్యమైన సారూప్యతలు పంచుకుంది.
ఎక్స్టర్ؚలో గ్రాండ్ i10 నియోస్ؚలో ఉన్న అవే 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, మరియు స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఏకరితి వీల్ బేస్ మరియు పవర్‌ట్రెయిన్ ఎంపికలను కూడా పొందింది: మాన్యువల్ మరియు AMT ఎంపికతో, CNG ప్రత్యామ్నాయంతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందింది.
విడుదల మరియు ధర వివరాలు
హ్యుందాయ్ ఎక్స్టర్ జులై 10వ తేదీన విడుదల కానుంది. దీని ధర రూ.6 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని ఆశిస్తున్నాం. టాటా పంచ్ؚతో పాటు సిట్రోయెన్ C3, మారుతి ఫ్రాంక్స్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ؚలతో ఎక్స్టర్ పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ AMT