Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హ్యుందాయ్ క్రెటా మరియు ఆల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్‌ల మొదటి టీజర్ విడుదల

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం rohit ద్వారా ఆగష్టు 07, 2023 01:29 pm ప్రచురించబడింది

హ్యుందాయ్ క్రెటా-ఆల్కాజార్ జంట హ్యుందాయ్ ఎక్స్టర్ నలుపు రంగు రూఫ్ؚతో కొత్త రేంజర్ ఖాకీ రంగు ఎంపికను పొందుతాయని టీజర్ చిత్రాలు మరియు వీడియోలలో స్పష్టమవుతుంది

  • త్వరలోనే విడుదల కానున్న హ్యుందాయ్ క్రెటా మరియు ఆల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్‌లు.

  • ఇది క్రెటాకు రెండవ స్పెషల్ ఎడిషన్ కాగా, ఆల్కాజార్ؚకు మాత్రం మొదటిది.

  • ఎక్స్ؚటీరియర్ మార్పులలో నలుపు రంగు ఎలిమెంట్ؚలు మరియు “అడ్వెంచర్ ఎడిషన్” బ్యాడ్జ్ؚలు ఉంటాయి.

  • ఉమ్మడి ఫీచర్‌లలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, పనోరమిక్ సన్ؚరూఫ్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉండవచ్చు.

  • మెకానికల్ పరంగా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు; ఇవి రెండూ ప్రస్తుతం ఉన్న పెట్రోల్, టర్బో-పెట్రోల్ (ఆల్కాజార్ మాత్రమే) మరియు డీజిల్ ఇంజన్ؚలను కొనసాగించవచ్చు.

  • రెండు SUVల ధరలు ప్రస్తుతం రూ.10.87 నుండి రూ.21.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి.

మన దేశంలో “హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్” మరియు “హ్యుందాయ్ ఆల్కాజార్ అడ్వెంచర్” పేర్లను హ్యుందాయ్ ఇటీవల ట్రేడ్ؚమార్క్ చేసింది. ప్రస్తుతం, ఈ కారు తయారీదారు మొదటిసారిగా ఈ రెండు SUVల ప్రత్యేక ఎడిషన్ؚలను టీజ్ చేయడంతో, త్వరలోనే వీటి విడుదల ఉంటుంది అని ఆశించవచ్చు. ఇది క్రెటాకు రెండవ ప్రత్యేక ఎడిషన్ కాగా, ఇటువంటి ఎడిషన్ ఆల్కాజార్ؚలో రావడం మొదటిసారి.

టీజర్‌లో గమనించదగిన విషయాలు

టీజర్ చిత్రాలు మరియు వీడియోలలో, రెండు SUVలు హ్యుందాయ్ ఎక్స్టర్ సిగ్నేచర్ “రేంజర్ ఖాకీ” రంగు ఎంపికలో, నలుపు రూఫ్ కలిగి ఉన్నట్లు కనిపించాయి. ఈ SUVల జంటలో క్రోమ్ ఎలిమెంట్ؚలను హ్యుందాయ్ కనిపించకుండా ఉండేలా చేసింది, బయట వైపు కొన్ని “అడ్వెంచర్ ఎడిషన్” బ్యాడ్జ్ؚలను ఉంచింది.

క్యాబిన్ మరియు పరికరాల సవరణలు

View this post on Instagram

A post shared by Hyundai India (@hyundaiindia)

క్రెటా మరియు ఆల్కాజార్ؚల ప్రత్యేక ఎడిషన్ؚల క్యాబిన్‌లు టీజర్‌లో కనిపించనప్పటికి, కారు తయారీదారు వాటిని పూర్తి-నలుపు రంగు ఇంటీరియర్ థీమ్ؚతో, బహుశా ఎక్స్టర్‌లో ఉన్నటు వంటి కొన్ని గ్రీన్ యాక్సెంట్ؚలతో అందించవచ్చు.

ఫీచర్‌ల విషయంలో, ఈ రెండు SUVలలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, పనోరమిక్ సన్ؚరూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఉమ్మడి ఫీచర్‌లు ఉన్నాయి. వీటి భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) రేర్ పార్కింగ్ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: జూలై 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్‌ల వివరాలు

పవర్‌ట్రెయిన్ؚలు అప్ؚడేట్ؚలను పొందాయా?

క్రెటా-ఆల్కాజార్ జంట ప్రస్తుత పవర్‌ట్రెయిన్ సెట్అప్ؚకు హ్యుందాయ్ ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. క్రెటా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (6-స్పీడ్ MT మరియు CVTతో) మరియు డీజిల్ ఇంజన్‌లలో (6-స్పీడ్ MT మరియు AT) వస్తుంది. మరొకవైపు, 3-వరుసల హ్యుందాయ్ SUV 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (6-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCT) కలిగి ఉంది, అలాగే క్రెటాలో ఉన్న అదే డీజిల్ యూనిట్ ఉంటుంది.

అంచనా ధరలు

సంబంధిత ప్రత్యేక ఎడిషన్‌లు పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ؚల కంటే కొంత అధిక ధర కలిగి ఉండవచ్చు. ప్రస్తుతానికి, కాంపాక్ట్ SUV ధర రూ.10.87 లక్షల నుండి రూ.19.20 లక్షల వరకు ఉంది, 3-వరుసల SUV ధర రూ.16.77 లక్షలు మరియు రూ.21.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య విక్రయించబడుతుంది.

క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ؚకు ప్రత్యక్ష పోటీదారులుగా స్కోడా కుషాక్ మరియు వోక్స్వాగన్ టైగూన్ మాట్ ఎడిషన్‌లు నిలవగా, టాటా సఫారి రెడ్ డార్క్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ؚలతో ఆల్కాజార్ ప్రత్యేక ఎడిషన్ పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 157 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ క్రెటా 2020-2024

హ్యుందాయ్ అలకజార్

Rs.16.77 - 21.28 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్18.8 kmpl
డీజిల్24.5 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర