స్విఫ్ట్ యొక్క ఆప్షనల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS కోసం మీరు ఎంత అదనపు మొత్తం చెల్లించాలి?
మారుతి డిజైర్ 2017-2020 కోసం sumit ద్వారా నవంబర్ 26, 2015 01:36 pm సవరించబడింది
- 19 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి సుజికి, దానికి ఇకానిక్ కార్లు అయినటువంటి డిజైర్ మరియు స్విఫ్ట్ యొక్క ప్రతీ వేరియంట్లో డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS అందిస్తామని ప్రకటించింది. భద్రత కి ఎక్కువ ప్రాముక్యత ఇచ్చే వినియోగదారులకు ఇది ఒక మంచి వార్తగా చెప్పవచ్చు. ఇప్పుడు వినియోగదారులు విలాసవంతమైన లక్షణాలకు కాకుండా భద్రతా లక్షణాలకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. మా పాఠకుల కోసం శీఘ్ర ఆలోచన ఇచ్చేందుకుగానూ కొనుగోలుదారు ఈ భద్రత కిట్ కోసం ఎంత అధనపు మొత్తం చెల్లించాలి అనే అంశంపై చిన్న విశ్లేషణ చేశాము.
మారుతి సుజుకి (డిజైర్ మరియు స్విఫ్ట్) కార్ల యొక్క అమ్మకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక కొత్త నిదర్శకంగా నిలుస్తాయి మరియు వారు ఆర్థిక సంవత్సరం 2014-15 కొరకు నెలకు 17,000 యూనిట్లు సగటున అమ్మకాలు నమోదు చేశారు.
మోడల్ | భద్రత కిట్ లేకుండా (INR) | భద్రత కిట్ తో (O) (INR) | తేడా (INR) |
స్విఫ్ట్ LDI | 584341 | 604341 | 20000 |
స్విఫ్ట్ VXI | 540180 | 560180 | 20000 |
స్విఫ్ట్ VDI | 631184 | 643184 | 12000 |
స్విఫ్ట్ LXI | 478299 | 490000 | 11701 |
డిజైర్ LDI | 599451 | 619450 | 19999 |
డిజైర్ VXI | 594556 | 619455 | 19999 |
డిజైర్ VDI | 694963 | 706963 | 22000 |
డిజైర్ LXI | 528350 | 540000 | 11650 |
డిజైర్ VXI AT (O) | 673974 | 693974 | 20000 |
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ " స్విఫ్ట్ మరియు డిజైర్ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన కార్లు. ఈ రెండూ కూడా భారత ఆటోమొబైల్ పరిశ్రమ రూపొందించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ కార్లు సమకాలీన స్టైలింగ్, ఉన్నతమైన సౌలభ్యం, సౌకర్యం లక్షణాలు మరియు ప్రదర్శన కోసం ప్రముఖమైనవి. స్విఫ్ట్ మరియు డిజైర్ యొక్క అన్ని వేరియంట్లలో డ్రైవర్ మరియు సహ డ్రైవర్ ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి లక్షణాలు అందించడం ద్వారా వినియోగదారుల ఆదరణ మరింతగా పొందవచ్చు." అని వివరించారు.
ఇంకా చదవండి :
- రాబోయే మారుతి సుజుకి YBA భారతదేశంలో కనిపించింది
- భారతదేశం ఎదురు చూస్తున్న టక్సన్ !హుండాయ్ న్యూ TVC ఒక SUV
మరింత చదవండి : మారుతి స్విఫ్ట్