• English
  • Login / Register

న్యూ జాజ్ ను బహిర్గతం చేసిన హోండా, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుంది! [వీడియో]

హోండా జాజ్ 2014-2020 కోసం raunak ద్వారా మే 25, 2015 04:00 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తున్న జాజ్ - అధికారికంగా టీజర్ వీడియో లో వెల్లడించబడింది, ఇది సిటీ యొక్క సీవీటీ అని అంచనా!  

రాబోవు 2015 జాజ్ హ్యాచ్బ్యాక్ యొక్క విడుదల తేదీ సమీపిస్తుండగా, హోండా ఇండియా దాని మొదటి టీజర్ వీడియోను ఇటీవల విడుదల చేసింది. రాబోవు 2015 జాజ్ హ్యాచ్బ్యాక్ యొక్క గతంలో జరిగిన పొరపాట్లను ద్రుష్టిలో పెట్టుకొని, ఈ సారి జాజ్ తన ప్రత్యర్థులకు మంచి పోటీగా నిలుస్తుందని అంచనా. దీని యొక్క రెండో ఇన్నింగ్స్ ఆశాజనకంగా కనిపిస్తుంది  మరియు ఇది కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో వస్తుంది. కొన్ని నమ్మకమైన మూలాల ప్రకారం, హోండా జూలై రెండవ వారం లో జాజ్ ను ప్రారంభించనుంది.  

ఇంజిన్ల పరంగా చూస్తే, ఈ కొత్త జాజ్ 1.2-లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఐ-డీటెక్ డీజిల్ మోటార్లతో అందుబాటులో వుంటుంది. ఇది రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇందులో ఒకటి 5-స్పీడ్ మాన్యువల్ (ధర పరిమితులు పరిగణలోకి తీసుకుంటే సిటీ మోడల్ యొక్క 6-స్పీడ్ మ్యాన్యువల్ యూనిట్ వుండదని అంచనా) మరియు ఆటోమేటిక్ (సిటీ యొక్క సీవీటీ వుండే అవకాశం). అయితే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దీని యొక్క పెట్రోల్ వేరియంట్ తోనే అందుబాటులో ఉంటుంది. దీనిలో అమర్చబడిన 1.2-లీటర్ ఐ-వీటెక్ మోటర్ 87బీహెచ్పీ శక్తి మరియు 109ఎన్నెం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.   

దీని యొక్క సిటీ/అమేజ్/మొబీలియో మోడళ్ల తరహా, ఈ 1.5 లీటర్ ఐ-డీటెక్ టర్బో డీజిల్ ఇంజన్ 99బీహెచ్పీ శక్తి మరియు 200ఎన్నెం గరిష్ట టార్క్ ను అందిస్తుంది.  అంతేకాక, హోండా దాని జాజ్ మోడల్ ను పాడిల్ షిప్టర్లతోనూ అందించవచ్చని అంచనా.  

ఈ సరి కొత్త జాజ్, సిటీ మొడల్ యొక్క ప్లాట్ఫారమ్ ఆధారంగా నిర్మించబడింది. దీని యొక్క అంతర్గత, బాహ్య రూపం మరియు ఇంకెన్నో అంశాలు ఒకేలా ఉంటాయి.  ఇందులో అమర్చబడిన డాష్బోర్డ్, టచ్ స్క్రీన్ నావిగేషన్ యూనిట్ మరియు ఇతర అంశాలు శిటీలో కుడా వున్నాయి( క్రింద వీడియోలో చూడవచ్చు). మరో వైపు, ఇది మారుతి సుజుకి స్విఫ్ట్, వోక్స్వేగన్ పోలో, హ్యుండాయ్ ఎలైట్ ఐ 20, ఫియట్ పుంటో ఈవో వంటి వాహనాలతో పోటీ పడుతుంది.     

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience