Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో విడుదలైన హోండా ఎలివేట్

హోండా ఎలివేట్ కోసం tarun ద్వారా జూన్ 06, 2023 05:39 pm ప్రచురించబడింది

హోండా నుండి వచ్చిన ఈ సరికొత్త SUV, 2017 తర్వాత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన జపనీస్ మార్క్ యొక్క మొట్టమొదటి సరికొత్త మోడల్.

జపాన్ ఆటో దిగ్గజం అయిన హోండా, తన సరికొత్త SUV హోండా ఎలివేట్‌ను వెల్లడించింది. సాంప్రదాయ 'R-V' నామకరణాన్ని ఉపయోగించని భారతదేశంలో ఇది మొదటి హోండా SUV మరియు ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బ్రాండ్ యొక్క మొట్టమొదటి సరికొత్త కారు కూడా ఇదే. ఎలివేట్ బుకింగ్‌లు జూలైలో తెరవబడతాయి, సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

కళ్లు చెదిరే డిజైన్

హోండా ఎలివేట్ కొంచెం క్రాస్ ఓవర్ లుక్ తో బోల్డ్, బాక్సీ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంది. ఈ SUV భారీ గ్రిల్, LED హెడ్‌లైట్‌లు మరియు DRLల యొక్క సొగసైన సెట్ అలాగే గ్రే ఎలిమెంట్‌తో స్లిమ్ బంపర్‌ వంటి అంశాలను పొందుతుంది.

సైడ్ భాగం విషయానికి వస్తే, ఎలివేట్ బాడీ క్లాడింగ్ మరియు స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లతో సాంప్రదాయ SUV రూపాన్ని పొందుతుంది, అయితే ఇక్కడ క్రాస్ఓవర్ రూపాన్ని మరింత ప్రముఖంగా చూడవచ్చు. ఇది సాధారణంగా A-పిల్లర్‌పై ఉండే ORVMలను డోర్ ప్యానెల్‌పై కలిగి ఉంటుంది. 17-అంగుళాల డైమండ్ కట్ బ్లాక్ మరియు సిల్వర్ అల్లాయ్ వీల్స్ ద్వారా దీని లుక్ మరింత మెరుగ్గా ఉంటుంది.

వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, హోండా లోగోను కలిగి ఉండే కనెక్ట్ రిఫ్లెక్టర్ ఎలిమెంట్‌తో LED టెయిల్ ల్యాంప్‌ల సొగసైన సెట్‌ను పొందుతుంది. బాడీ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌ల నుండి వెనుక బంపర్ వరకు కొనసాగుతుంది, ఇది బూడిద రంగు ఎలిమెంట్ లను కూడా పొందుతుంది.

అనేక ఫీచర్లతో కూడిన ఇంటీరియర్

హోండా మరింత ప్రీమియం మరియు స్టైలిష్ అనుభవం కోసం సిటీ వంటి పాతబడిన మరియు సరళమైన ఇంటీరియర్ డిజైన్‌కు దూరంగా ఉంది. లోపల భాగంలో, ఉన్నతమైన అనుభూతి కోసం లెథెరెట్ అప్హోల్స్టరీగా కనిపించే డ్యుయల్-టోన్ నలుపు మరియు గోధుమ రంగు డాష్‌బోర్డ్‌తో స్వాగతం పలికినట్టుగా ఉంటుంది.

ఎలివేట్- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి చక్కని ఫీచర్లతో కూడిన ఫీచర్-రిచ్ ఎంపిక అని చెప్పవచ్చు.

భద్రత? సురక్షితం!

ఎలివేట్ SUV యొక్క భద్రతా అంశాల విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్ల కోసం మాత్రమే) మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ వంటి అంశాలు ఉన్నాయి. యాక్టివ్ సేఫ్టీ విషయానికి వస్తే, రాడార్-ఆధారిత ADAS (అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ) ద్వారా మరింత భద్రత అందించబడుతుంది, ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ మరియు హై-బీమ్ అసిస్ట్‌ వంటి అధునాతన భద్రతా అంశాలను పొందుతుంది.

సుపరిచిత పవర్‌ట్రెయిన్‌లు

ఎలివేట్‌ వాహనం, సిటీ యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను పొందుతుంది. ఈ ఇంజన్, 121PS పవర్ ను మరియు 145Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్‌తో జత చేయబడింది, అంతేకాకుండా ప్యాడిల్ షిఫ్టర్‌లను కూడా పొందుతుంది. సెగ్మెంట్‌లోని అనేక వాహనాల మాదిరిగానే, హోండా SUV కోసం డీజిల్ ఇంజన్ ఎంపిక అందుబాటులో ఉండదు. సిటీ హైబ్రిడ్‌లో చూసినట్లుగా, హోండా స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5-లీటర్ ఇంజన్‌ను కూడా పొందవచ్చు.

ధర మరియు పోటీదారులు

ఇంతకు ముందు చెప్పినట్లుగా, హోండా ఎలివేట్ ధరలు ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ SUV- హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు MG ఆస్టర్ వంటి వాహనాలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 56 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా ఎలివేట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర