నాన్-హైబ్రిడ్ వేరియంట్‌లలో కూడా కొద్దిపాటి నవీకరణలను, ADASను పొందనున్న హోండా సిటీ
హోండా సిటీ కోసం rohit ద్వారా మార్చి 03, 2023 11:25 am ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ రెండు వాహనాలు స్టాండర్డ్ సిటీ, సిటి హైబ్రిడ్ؚ వరుసగా కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ؚ – SV మరియు V లలో రానున్నాయి.
-
నవీకరించబడిన సిటీ ధరను హోండా రూ.11.49 లక్షల నుండి రూ.15.97 లక్షలుగా నిర్ణయించింది.
-
ఇప్పుడు సిటీ హైబ్రిడ్ ధర రూ.18.89 లక్షల నుండి 20.39 లక్షల వరకు ఉంటుంది.
-
ముందు మరియు వెనుక భాగాలలో తేలికపాటి మార్పులతో అందిస్తున్నారు.
-
కొత్త ఫీచర్‌లలో రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్ ఉన్నాయి.
-
హోండా మునపటి లానే దాని సెడాన్ؚను 1.5-లీటర్ పెట్రోల్ మరియు పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలతో అందిస్తోంది.
-
ఈ అప్ؚడేట్ؚతో డీజిల్ వేరియంట్‌లను పూర్తిగా నిలిపివేయనున్నాను.
హోండా సంస్థ నవీకరించబడిన సిటీ మరియు సిటీ హైబ్రిడ్ؚలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ రెండు వాహనాలు కొత్త బేస్-స్పెక్ వేరియంట్‌లను (వరుసగా SV మరియు V) కొన్ని అదనపు ఫీచర్‌లను కూడా పొందాయి, రెగ్యులర్ సిటీలో అందించిన ADAS ఫీచర్ మరింత ప్రయోజనంగా ఉంటుంది. కొత్త వేరియంట్ వాహనాలు, వాటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్-వారీ ధరలు
వేరియంట్ |
పాత ధర |
కొత్త ధర |
వ్యత్యాసం |
సిటీ పెట్రోల్ |
|||
SV |
– |
రూ. 11.49 లక్షలు (కొత్తది) |
– |
V |
రూ. 11.87 లక్షలు |
రూ. 12.37 లక్షలు |
+రూ. 50,000 |
V CVT |
రూ. 13.27 లక్షలు |
రూ. 13.62 లక్షలు |
+రూ. 35,000 |
VX |
రూ. 13.33 లక్షలు |
రూ. 13.49 లక్షలు |
+రూ. 16,000 |
VX CVT |
రూ. 14.63 లక్షలు |
రూ. 14.74 లక్షలు |
+రూ.11,000 |
ZX |
రూ. 14.32 లక్షలు |
రూ. 14.72 లక్షలు |
+రూ. 40,000 |
ZX CVT |
రూ. 15.62 లక్షలు |
రూ. 15.97 లక్షలు |
+రూ. 35,000 |
సిటీ హైబ్రిడ్ |
|||
V |
– |
రూ. 18.89 లక్షలు (కొత్తది) |
– |
ZX |
రూ. 19.89 లక్షలు |
రూ. 20.39 లక్షలు |
+రూ.50,000 |
ఈ కాంపాక్ట్ సెడాన్ స్టాండర్డ్ మరియు హైబ్రిడ్ వేరియంట్‌ల ధరలు రూ.50,000 వరకు అధికంగా ఉన్నాయి. రెండు మోడల్‌లు, వాటి కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియంట్ కారణంగా మునపటి కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఈ నవీకరణతో, సిటీ డీజిల్ వేరియంట్ؚను హోండా నిలిపివేసింది.
డిజైన్ నవీకరణలు
సిటీ, నవీకరించిన నమూనాలో సవరించిన గ్రిల్, మరింత కొట్టొచ్చినట్లు కనిపించే LED DRLలు, పునర్నిర్మించిన బంపర్ؚలతో ముందు భాగానికి తేలికపాటి నవీకరణలను చేశారు. ఈ సెడాన్ؚ వెనుక భాగంలో అల్లాయ్ వీల్ డిజైన్, బంపర్ؚలలో తేలికపాటి సవరణలు మినహహించి చెప్పుకోదగిన మార్పులు చేయలేదు.
హోండా, ముందు మరియు వెనుక బంపర్ؚలకు, క్యాబిన్ లోపల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ చుట్టూ కార్బన్ ఫైబర్ వంటి ఎఫెక్ట్ؚను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న షేడ్‌లను కొనసాగిస్తూ, అదనంగా ఈ సెడాన్ ఇప్పుడు అబ్సీడియన్ బ్లూ పర్ల్ షేడ్ؚను కూడా అందిస్తుంది.
కొత్తగా వస్తున్నవి ఏమిటి?
హోండా, ఈ నవీకరించబడిన సిటీలో వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, యాంబియెంట్ లైటింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లను అందిస్తుంది. భద్రత విషయానికి వస్తే, సిటీ హైబ్రిడ్‌లో అడ్వాన్సెడ్ డ్రైవర్ అస్సిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్ సరికొత్త అప్ؚగ్రేడ్‌గా వస్తుంది. లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటో-ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఇతర ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ సెడాన్ హైబ్రిడ్ వర్షన్ ADASను ప్రామాణికంగా పొందుతుంది.
ADAS భద్రత సూట్ కూడా నవీకరించబడింది, తక్కువ-స్పీడ్‌లో ఫాలో అవ్వడం (హైబ్రిడ్ మాత్రమే) మరియు ముందు ఉన్న కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ؚలను చేరుస్తూ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సామర్ధ్యాలను విస్తరించింది. మొదటి ఫీచర్ ముందు ఉన్న వాహనం నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు తరువాతి ఫీచర్ ముందు ఉన్న వాహనం కదిలితే విజువల్ మరియు ఆడిబుల్ హెచ్చరికలతో డ్రైవర్ؚకు సమాచారం అందిస్తుంది.
ఇంకా, V వేరియంట్ (బేస్ వేరియంట్) నుండి ADASను అన్నీ వేరియంట్‌లలో హోండా అందిస్తుంది. అంతేకాకుండా, చాలా వరకు ఇతర వాహన తయారీదారులు ఈ భద్రత సాంకేతికతను కేవలం టాప్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేశాయి.
హోండా సెడాన్‌లో ఉన్న ఇతర ఫీచర్‌లలో ఎనిమిది-అంగుళాల టచ్ؚస్క్రీన్, సన్ؚరూఫ్, లేన్ؚవాచ్ కెమెరా, క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. దీని భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగులు, రేర్ؚవ్యూ కెమెరా, EBDతో ABS ఉంటాయి.
పెట్రోల్ పవర్ మాత్రమే
ప్రస్తుతం, తేలికపాటి నవీకరణతో పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే సిటీని అందిస్తున్నారు. దీని పవర్ؚట్రెయిన్ ఎంపికలను ఇక్కడ చూద్దాం.
స్పెసిఫికేషన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ |
పవర్ |
121PS |
126PS (కంబైన్డ్) |
టార్క్ |
145Nm |
253Nm (కంబైన్డ్) |
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ MT, 7-స్టెప్ CVT |
e-CVT |
సిటీ హైబ్రిడ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో పాటు 0.7kWh బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ؚతో అందించబడుతుంది. డీజిల్ ఎంపిక ఇకపై అందుబాటులో లేనందున (సిటీ వాహనానికి మాత్రమే కాకుండా అన్నీ వాహన విభాగంలో), సిటీ హైబ్రిడ్ ఇప్పుడు వాస్తవంగా ఉన్న డ్రైవింగ్ పరిస్థితులలో పొదుపైన సెడాన్‌గా నిలుస్తుంది, దీని పరీక్షించిన ఎకానమీ 20.15kmpl (సిటీ), 23.38kmpl (హైవే)గా ఉంది.
దీని పోటీదారులు ఎవరు?
ఈ హోండా కాంపాక్ట్ సెడాన్ వోక్స్ؚవ్యాగన్ విర్టస్, మారుతి సియాజ్, స్కోడా స్లావియా మరియు రాబోయే కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలతో పోటీ పడుతుంది. అయితే, హైబ్రిడ్ వెర్షన్ؚలో దీనికి ప్రత్యక్ష పోటీ లేదు.
ఇక్కడ మరింత చదవండి: హోండా సిటీ 2023 డీజిల్
0 out of 0 found this helpful