MG కామెట్ EV యొక్క ప్రతి వేరియంట్ ఏమి అందిస్తుందో చూద్దాం
ఎంజి కామెట్ ఈవి కోసం sonny ద్వారా మే 14, 2023 01:05 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
MG కామెట్ EV మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది, దిగువ శ్రేణి వేరియంట్ దేశంలోనే అత్యంత సరసమైన EV.
MG కామెట్ EV కేవలం రూ. 7.98 లక్షల (ఎక్స్-షోరూమ్) యొక్క ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో ఇటీవల మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పుడు, దాని కోసం వేరియంట్ వారీగా ధరలు మరియు ఫీచర్ వివరాలను కూడా కలిగి ఉన్నాము. అల్ట్రా-కాంపాక్ట్ EV మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది - అవి వరుసగా పేస్, ప్లే మరియు ప్లష్.
అయితే ఏ ఏ వేరియంట్ ఏ ఏ ఫీచర్లను పొందుతుందో తెలుసుకునే ముందు, కామెట్ యొక్క మెకానికల్ స్పెసిఫికేషన్‌ల యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
బ్యాటరీ |
17.3kWh |
పవర్ |
42PS |
టార్క్ |
110Nm |
పరిధి (క్లైమ్డ్) |
230km |
డ్రైవ్ ట్రైన్ |
రేర్-వీల్-డ్రైవ్ (RWD) |
కామెట్ ఎంట్రీ-లెవల్ EV స్పేస్‌లో అతి చిన్న బ్యాటరీ మరియు అత్యల్ప శ్రేణిని కలిగి ఉంది, అయితే ఇది సిటీ లో తిరగడం కోసం నిర్మించబడింది. ఆ దృష్టితో, కేవలం 200కిమీల పరిధి రాత్రిపూట ఛార్జింగ్‌తో సరిపోతుంది మరియు 3.3kW సెటప్‌తో 100% ఛార్జ్ అవ్వడానికి 7 గంటలు పడుతుంది. ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటికి భిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది, ఎందుకంటే ఇవి అంతర్గత దహన ఇంజన్ (ICE) మోడల్‌ల ఆధారిత ఫ్రంట్-వీల్-డ్రైవ్ EVలు. మరోవైపు, కామెట్ ప్రత్యేక EV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రేర్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది.
ఇప్పుడు వేరియంట్ వారీగా ఫీచర్ వివరాలను చూద్దాం:
పేస్
దిగువ శ్రేణి ప్లే వేరియంట్ ఫీచర్లు:
● హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌లు
● కవర్‌లతో 12-అంగుళాల చక్రాలు
● 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
● బ్లూటూత్ మ్యూజిక్ మరియు కాలింగ్‌తో కూడిన ప్రాథమిక ఆడియో సిస్టమ్
● స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణలు
● రెండు స్పీకర్లు
● కీలెస్ ఎంట్రీ
● మాన్యువల్ AC
● 3 USB ఛార్జింగ్ పోర్ట్‌లు
● పవర్ సర్దుబాటు చేయగల ORVMలు
● స్ప్లిట్ మడత వెనుక సీట్లు (50:50)
● బ్లాక్ క్యాబిన్ థీమ్
● ఫాబ్రిక్ అప్హోల్స్టరీ
● డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
● EBD తో ABS
● రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
● టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
● ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
● ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
దిగువ శ్రేణి వేరియంట్ పవర్ అడ్జస్టబుల్ ORVMలు, ఆడియో సిస్టమ్ మరియు కీలెస్ ఎంట్రీతో చాలా అవసరమైన వాటిని కవర్ చేస్తుంది. భద్రత పరంగా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను చేర్చడంలో ఎలాంటి రాజీ కనబరచలేదు. అయితే, మీరు కామెట్ EV యొక్క హైలైట్ ఫీచర్లు ఏవీ పొందలేరు మరియు ఈ వేరియంట్ యొక్క సరసమైన అంశం స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, మీరు మీ స్వంతం చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన MG అనుకూలీకరణ ప్యాక్‌ల నుండి ఎంచుకోవచ్చు.
ప్లే
మధ్య శ్రేణి ప్లే వేరియంట్, పేస్ వేరియంట్‌లో కంటే అధికంగా అందిస్తున్న ఫీచర్ల వివరాలు:
● LED హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌లు
● కనెక్టింగ్ ముందు మరియు వెనుక లైట్స్
● గ్రే క్యాబిన్ థీమ్
● లెదర్ చుట్టబడిన స్టీరింగ్ వీల్
● 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
● 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
● వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే
● వేగవంతమైన ఛార్జింగ్‌తో మూడు USB ఛార్జింగ్ పోర్ట్‌లు
● వాయిస్ ఆదేశాలు
● కనెక్టడ్ కార్ టెక్
లక్ష కంటే ఎక్కువ ధరకు, ప్రీమియం నాణ్యతతో మనం ఆశించే ఫీచర్లు మరియు క్యాబిన్ తో కామెట్ EVని పొందవచ్చు. ప్లే వేరియంట్, స్పోర్ట్స్ LED లైటింగ్ ఫ్రంట్ మరియు రేర్, లెథెరెట్ స్టీరింగ్ వీల్ కవర్‌తో గ్రే క్యాబిన్ మరియు డ్యూయల్ 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లేలను జోడిస్తుంది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ స్టీరింగ్ కోసం టిల్ట్ సర్దుబాటును పొందలేదు.
ప్లష్
ప్లష్ వేరియంట్, ప్లే వేరియంట్ కంటే అధికంగా కలిగి ఉన్న ఫీచర్లు:
● బ్లూటూత్‌తో డిజిటల్ కీ
● స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్
● టిల్ట్ సర్దుబాటు (పైకి క్రిందికి) స్టీరింగ్ వీల్
● డ్రైవర్ విండో కోసం ఆటో అప్ ఫంక్షన్
● రివర్స్ పార్కింగ్ కెమెరా
● అప్రోచ్ అన్‌లాక్ ఫంక్షన్
ఈ అగ్ర శ్రేణి వేరియంట్ యొక్క ప్రారంభ ధరను చూసినట్లయితే చాలా తక్కువ అని చెప్పవచ్చు మరియు ఈ కామెట్ EV ప్రీమియం నాణ్యతతో కనిపిస్తుంది. ప్రీమియం కోసం కొన్ని కూల్ టెక్ ఫీచర్లు అలాగే రియర్‌వ్యూ పార్కింగ్ కెమెరా వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
సంబంధిత: MG కామెట్ EV vs ప్రత్యర్థులు: వివరంగా పోల్చిన ధరలు
MG కామెట్ EV వ్యక్తిగతీకరణ ఎంపికలతో అందుబాటులో ఉంది అలాగే ఇది వేరియంట్‌ను బట్టి మారవచ్చు. మార్కెట్‌లో MG స్థానం, టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
మరింత చదవండి : కామెట్ EV ఆటోమేటిక్