Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మునపటి వెర్నాؚతో పోలిస్తే, కొన్ని విషయాలలో భిన్నంగా ఉన్న సరికొత్త హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా మార్చి 29, 2023 02:42 pm ప్రచురించబడింది

జనరేషన్ అప్ؚగ్రేడ్ పొందిన ఈ సెడాన్‌లో, సరికొత్త పవర్‌ట్రెయిన్ ఎంపికలతో ప్రారంభించి అనేక మార్పులను చూడవచ్చు.

ఆరవ-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా ఇటీవలే, ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని మునపటి మోడల్ؚతో పోలిస్తే కొత్త వెర్నా మరింత పెద్దదిగా ఉంటుంది, కొత్త పవర్‌ట్రెయిన్ؚను పొందింది అలాగే అనేక ప్రీమియం ఫీచర్‌లతో వస్తుంది. ఈ రెండూ ఎంత భిన్నంగా, లేదా ఎంత సారూప్యంగా ఉన్నాయో మీకు స్పష్టంగా తెలియడానికి, వాటిని వివరంగా మరియు వివిధ పారామితుల ఆధారంగా పోల్చడం జరిగింది:

ఎక్స్ؚటీరియర్

విప్లవాత్మక విధానంతో హ్యుందాయ్ తన సరికొత్త వెర్నాను రీడిజైన్ చేసింది. పాత మోడల్ؚలో మరింతగా ఆకర్షించే అంశాలు లేకపోయినా, ప్రస్తుత ఆరవ-జనరేషన్ సెడాన్ؚ ముందు భాగంలో పొడవైన LED DRL స్ట్రిప్ మరియు “పారామెట్రిక్ జువెల్” డిజైన్ కలిగిన గ్రిల్‌తో ఆకర్షణీయమైన లుక్‌తో వస్తుంది. కొత్త వెర్నాను చూస్తే ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్న సరికొత్త-జనరేషన్ ఎలాంత్రాకు స్వరూపంగా కనిపిస్తుంది.

ఈ సెడాన్‌లో ఫాగ్ ల్యాంప్ؚలు లేకపోయినప్పటికీ (హెడ్‌లైట్ؚకు కార్నరింగ్ ఫంక్షనాలిటీతో వస్తుంది), మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్ؚలైట్‌లతో వస్తుంది. సరికొత్త వెర్నాలో అదనపు జోడింపుగా అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కోసం రాడార్ వస్తుంది.

ప్రొఫైల్ పరంగా, ఐదవ-జనరేషన్ వెర్నా ఫ్రంట్ ఫెండర్ నుండి వెనుక వరకు సరళ రేఖలతో హుందాగా కనిపిస్తుంది. దీనితో పోలిస్తే, సరికొత్త మోడల్, పదునైన కట్ؚలు మరియు మూడతలతో ప్రస్తుత టక్సన్ؚను గుర్తు చేస్తుంది, దీని రెండు పక్కల పొడవైన ఫుట్ ప్రింట్ؚలు మరియు సెడాన్ ఫాస్ట్‌బ్యాక్-వంటి డిజైన్ కనిపిస్తుంది. ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ ఆలాయ్ వీల్స్ؚతో వస్తుంది (టర్బో వేరియెంట్ؚలలో ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్స్ؚతో బ్లాక్డ్-అవుట్ వీల్స్ ఉంటాయి.)

వెనుక భాగంలో కూడా, పాత మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్నా చాలా భిన్నంగా ఉంటుంది. పాత వెర్షన్‌లో LED టెయిల్‌లైట్‌లతో చుట్టినట్లు సాదాగా కనిపిస్తుంది, కొత్త మోడల్ؚలో కోరాల వంటి కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లు మరియు బంపర్ؚలో జ్యామెట్రిక్ ఎలిమెంట్ؚలతో వెనుక భాగం హుందాగా కనిపిస్తుంది.

సంబంధించినది: ఈ విభాగంలో మొదటి స్థానంపై కనేసిన కొత్త హ్యుందాయ్

వాటి కొలతలను ఇక్కడ చూద్దాం:

కొలతలు

పాత వెర్నా

కొత్త వెర్నా

తేడా

పొడవు

4,440mm

4,535mm

+95mm

వెడల్పు

1,729mm

17,65mm

+36mm

ఎత్తు

1,475mm

1,475mm

మార్పు లేదు

వీల్ؚబేస్

2,600mm

2,670mm

+70mm

ఎత్తును మినహాహిస్తే, కొత్త వెర్నా కొలతలు అన్నీ ఐదవ జనరేషన్ మోడల్‌తో పోలిస్తే ఎక్కువే. దీని వలన క్యాబిన్ؚలో మరింత ఎక్కువ స్థలం ఉండవచ్చు.

ఇంటీరియర్

వెలుపల చూసినట్లే, లోపల కూడా – జనరేషన్ అప్ؚగ్రేడ్‌తో – ఈ సెడాన్ؚలో అనేక మార్పులు ఉన్నాయి. నాజూకైన AC వెంట్ؚలు, మరింత మెత్తని మెటీరియల్స్, రెండు-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు చుట్టూ సిల్వర్ యాక్సెంట్ؚతో హ్యుందాయ్ దీని క్యాబిన్ؚను మరింత హుందాగా కనిపించేలా చేసింది.

వెర్నా రెండు క్యాబిన్ థీమ్ ఎంపికలు రానుంది: డ్యూయల్-టోన్ థీమ్ (నలుపు మరియు లేత గోధుమ రంగు) ప్రామాణికంగా ఉంటుంది మరియు టర్బో వేరియెంట్ؚలలో ఎరుపు యాక్సెంట్ؚతో పూర్తి-నలుపు థీమ్‌తో వస్తుంది. ఐతే, దీనిలో ప్రధానమైనది డ్యూయల్ డిస్ప్లే సెట్అప్ (డిజిటైజ్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ కూడా ఉంటాయి).

సంబంధించినది: కొత్త హ్యుందాయ్ వెర్నా Vs ప్రత్యర్ధులు: స్పెసిఫికేషన్ؚల పోలిక

పవర్ؚట్రెయిన్ؚలు

స్పెసిఫికేషన్‌లు

పాత వెర్నా

కొత్త వెర్నా

ఇంజన్

1.5-లీటర్ పెట్రోల్

1-లీటర్ టర్బో పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ టర్బో పెట్రోల్

పవర్

115PS

120PS

115PS

115PS

160PS

టార్క్

144Nm

172Nm

250Nm

144Nm

253Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT, CVT

7-స్పీడ్ DCT

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

6-స్పీడ్ MT, CVT

6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT

ధర మరియు ప్రత్యర్ధులు

పాత వెర్నాను ఉపసంహరించుకోక ముందు దాని ధర రూ.9.64 లక్షల నుండి రూ.15.72 లక్షల వరకు ఉంది. ఆరవ-జనరేషన్ సెడాన్ పరిచయ ధరలు రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల మధ్య ఉంటాయి (అన్నీ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధరలు).

ఈ కాంపాక్ట్ సెడాన్ వోక్స్ؚవ్యాగన్ విర్టస్, హోండా సిటీ, స్కోడా స్లావియా మరియు మారుతి సియాజ్ؚతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 24 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర