• English
  • Login / Register

గ్రాండ్ ఐ10 ఫేస్లిఫ్ట్ వర్సెస్ ఇగ్నిస్ వర్సెస్ ఫిగో వర్సెస్ స్విఫ్ట్: ప్రతీ వేరియంట్ యొక్క ఫీచర్ పోలిక

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కోసం akas ద్వారా మార్చి 12, 2019 11:02 am ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్- భారత మార్కెట్లో సుజుకి గ్రాండ్ ఐ 10 ను విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర రూ .4.58 లక్షల నుంచి మొదలవుతుండగా, దీని టాప్- వేరియంట్ రూ .7.32 లక్షల వద్ద ముగుస్తుంది (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఫేస్లిఫ్ట్ గ్రాండ్ ఐ 10 మరియు దాని ప్రత్యర్థుల అయిన ఫోర్డ్ ఫిగో, మారుతి ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ వాహనాల యొక్క వివరణాత్మక స్పెసిఫికేషన్ పోలిక ఇక్కడ ఇవ్వబడింది. అయితే కొత్త హ్యాచ్బ్యాక్తో కొత్త ఫీచర్లు ఏమి అందిస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే, దాని పోటీదారులు అందించే ఫీచర్లను విలువకు తగినట్టుగా అందిస్తారా అని తెలుసుకోవాలనుకుంటే, మరింత సమాచారం చదవండి.

పెట్రోల్ వేరియంట్స్ మరియు వారి ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2017 హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10

మారుతి ఇగ్నిస్

మారుతి స్విఫ్ట్

ఫోర్డ్ ఫిగో

ఎరా రూ 4.58 లక్షలు

సిగ్మా రూ 4.59 లక్షలు

ఎల్ ఎక్స్ ఐ రూ. 4.76 లక్షలు

స్టాండార్డ్ రూ. 4.66 లక్షలు

మాగ్నా రూ 5.22 లక్షలు

డెల్టా రూ 5.19 లక్షలు

ఎల్ ఎక్స్ ఐ (ఓ) రూపాయలు 4.81 లక్షలు

ఆంబియంట్ రూ 5.06 లక్షలు

స్పోర్ట్స్ రూ. 5.65 లక్షలు

-

వి ఎక్స్ ఐ రూ 5.52 లక్షలు

ట్రెండ్ రూ .5.46 లక్షలు

స్పోర్ట్స్ (ఓ) రూ. 5.96 లక్షలు

జీటా రూ .5.75 లక్షలు

-

టైటానియం రూ .5.82 లక్షలు

ఆస్టా రూ 6.39 లక్షలు

ఆల్ఫా రూ 6.69 లక్షలు

జి ఎక్స్ ఐ రూ 6.37 లక్షలు

టైటానియం ప్లస్ రూ 6.36 లక్షలు

మాగ్నా ఏటి రూ .5.98 లక్షలు

డెల్టా ఏ ఎం టి రూ 5.74 లక్షలు

-

-

స్పోర్ట్స్ (ఓ) ఏటి రూ. 6.82 లక్షలు

జీటా ఏ ఎం టి రూ 6.3 లక్షలు

-

1.5 టైటానియం ఏటి రూ 7.44 లక్షలు

డీజిల్ వేరియంట్స్ మరియు వారి ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2017 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

మారుతి ఇగ్నిస్

మారుతి స్విఫ్ట్

ఫోర్డ్ ఫిగో

ఎరా రూ 5.68 లక్షలు

-

ఎల్ డి ఐ రూ. 5.97 లక్షలు

బేస్ రూ 5.71 లక్షలు

మాగ్నా రూ 6.15 లక్షలు

డెల్టా రూ 6.39 లక్షలు

-

ఆంబియంట్ రూ. 6.2 లక్షలు

స్పోర్ట్స్ రూ. 6.58 లక్షలు

-

విడీఇ రూ 6.44 లక్షలు

ట్రెండ్ రూ 6.46 లక్షలు

స్పోర్ట్స్ (ఓ) రూ 6.89 లక్షలు

జీటా రూ 6.91 లక్ష

-

టైటానియం రూ. 6.67 లక్షలు

ఆస్టా రూ 7.32 లక్షలు

ఆల్ఫా రూ 7.80 లక్షలు

జెడ్ డి ఐ రూ 7.44 లక్షలు

టైటానియం ప్లస్ రూ 7.26 లక్షలు

ఎరా

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

ఎరా అనేది గ్రాండ్ ఐ 10 ఫేస్ లిఫ్ట్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్. రూ. 4.58 లక్షల పెట్రోల్ ధరతో ఉన్న గ్రాండ్ ఐ10 ఎరా - ఇగ్నిస్ సిగ్మా (4.59 లక్షల రూపాయలు), స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ (రూ 4.76 లక్షలు), ఫిగో దిగువ శ్రేణి వేరియంట్ (4.66 లక్షల రూపాయలు) వంటి వాటితో పోటీ పడుతోంది. 5.68 లక్షల రూపాయలతో ఉన్న డీజిల్ ఇంజిన్ ఎరా వేరియంట్- దాని ప్రత్యర్థులైన స్విఫ్ట్ లిడిఐ 5.97 లక్షల రూపాయలు, ఫిగో దిగువ శ్రేణి వేరియంట్ 5.71 లక్షలు వంటి వాటితో గట్టి పోటీను ఇస్తుంది. గ్రాండ్ ఐ 10 ఫేస్లిఫ్ట్ ఎరా, మాన్యువల్ ఎయిర్ కండీషనర్ మరియు ఫ్రంట్ పవర్ విండోస్ వంటి ప్రామాణిక లక్షణాలను అందిస్తుంది.

ఇగ్నిస్ దాని ప్రవేశ- స్థాయి సిగ్మా వేరియంట్లో డీజిల్ ఇంజిన్ను అందించదు. ఏదేమైనప్పటికీ, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిఎస్ వంటి ప్రామాణిక అంశాలను కలిగి ఉన్న కారు ఇది ఒక్కటే. గ్రాండ్ ఐ 10, ఫిగో మరియు స్విఫ్ట్ వంటి కార్లలో డ్రైవర్ ఎయిర్బ్యాగ్ను ఒక్కదాన్నే ప్రామాణికంగా అందిస్తాయి, స్విఫ్ట్లో ఒక ప్రయాణీకుల ఎయిర్బాగ్ మరియు ఏబిఎస్ లు ప్రామాణికంగా అందించబడతాయి. ఫిగో ముందు పవర్ విండోలను అందించడం లేదు మిగిలిన మూడు ప్రత్యర్ధి వాహనాలు ముందు పవర్ విండోలను అందిస్తున్నాయి. అన్ని ఇతర కార్లలో అందించిన టిల్ట్ స్టీరింగ్ ఫీచర్- గ్రాండ్ ఐ 10 లో మిస్ అవుతుంది. అయితే స్విఫ్ట్ 60:40 వెనుక సీట్ మడత ఎంపికను కలిగి ఉన్న ఏకైక కారు.

మాగ్నా

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

ఎరా లో అందించబడిన అన్ని అంశాలతో పాటు, మాగ్నా ముందు ఫాగ్ ల్యాంప్లు, వీల్ కవర్లు, వెనుక పవర్ విండోలు మరియు ఎలక్ట్రానిక్ సర్దుబాటు వెలుపలి మిర్రర్లు వంటి అదనపు ఫీచర్లను పొందుతుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో రెండింటితోనూ అందించబడుతుంది మరియు ప్రామాణిక ఐదు- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే కాకుండా నాలుగు- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడా పెట్రోల్ మోటార్ అందుబాటులో ఉంది.

అయితే, ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో తో ఉన్న మాగ్నా పెట్రోల్ ధర 5.22 లక్షల రూపాయలు. ఈ కారు- ఇగ్నిస్ డెల్టా (రూ 5.19 లక్షలు), స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ (రూ 4.81 లక్షలు), ఫిగో ఆంబియంట్ (5.06 లక్షలు)  వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. నాలుగు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెర్షన్ ధర రూ .5.98 లక్షలు మాగ్నా- ఇగ్నిస్ డెల్టా ఏ ఎంటి (రూ 5.74 లక్షలు) తో పోటీ పడుతోంది.

మాగ్నా యొక్క డీజిల్ వెర్షన్ ధర 6.15 లక్షల రూపాయలు, ఈ కారు- రూ 6.39 లక్షలతో ఉన్న ఇగ్నిస్ యొక్క డెల్టా వేరియంట్తో, ఫిగో యొక్క ఆంబియంట్ (6.2 లక్షల రూపాయలు) వేరియంట్ తో, స్విఫ్ట్ యొక్క ఎల్డిఐ వేరియంట్ (రూ 5.97 లక్షలు) తో పోటీ పడుతుంది .

అన్ని ఇతర కార్లు ప్రయాణీకుల వైపు ఎయిర్బాగ్స్ కలిగి ఉండగా, గ్రాండ్ ఐ 10 లో అందించబడటం లేదు. ఏది ఏమైనా, వెనుకవైపు ఉన్న ఏసి వెంట్ ను అందించే ఏకైక కారు ఇదే. ఏబిఎస్ ను అందించటం అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ అనేవి స్పీకర్లతో ఆడియో సిస్టమ్ అందించే ఏకైక కార్లు. ఫిగో లో విద్యుత్తో సర్దుబాటు వెలుపల రేర్ వ్యూ మిర్రర్ లు అందించబడవు, అయితే ఇవి మిగిలిన అన్ని ప్రత్యర్ధి కార్లలో అందించబడతాయి.        

స్పోర్ట్స్ మరియు స్పోర్ట్స్ (ఓ)

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

స్పోర్ట్స్ వేరియంట్- రేర్ పార్కింగ్ సెన్సార్స్, ప్యాసింజర్ ఎయిర్బాగ్, 5.0- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, శీతలీకరణ గ్లోవ్ బాక్స్ వంటి లక్షణాలను అందిస్తుంది. ఇది రెండు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. పెట్రోల్ ధర రూ. 5.65 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ .6.58 లక్షలు.

స్పోర్ట్స్ వేరియంట్ లో అందించబడిన అన్ని అంశాలతో పాటు అదనంగా స్పోర్ట్స్ (ఓ) వేరియంట్- రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎంలు మరియు మిర్రర్ లింక్తో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే ఏడు అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది. పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిటితోనూ అందుబాటులో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఈ వేరియంట్ ధర రూ .5.96 లక్షలు, నాలుగు స్పీడ్ ఆటోమేటిక్ ను కలిగి ఉన్న వేరియంట్ ధర రూ 6.82 లక్షలు. డీజిల్ ఇంజన్ తో అలాగే ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ఉన్న స్పోర్ట్స్ (ఓ) వేరియంట్ ధర రూ. 6.89 లక్షలు.

ఈ శ్రేణి లో, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ఉన్న స్పోర్ట్స్ / స్పోర్ట్స్ (ఓ) పెట్రోల్ ఇంజన్ - ఇదే శ్రేణిలో ఉన్న ఇగ్నిస్ జీటా (రూ 5.75 లక్షలు), స్విఫ్ట్ విఎక్స్ ఐ (రూ .5.52 లక్షలు), ఫిగో టైటానియం (5.82 లక్షల రూపాయలు), స్విఫ్ట్ విడిఐ (రూ 6.44 లక్షలు), ఫిగో టైటానియం (రూ 6.67 లక్షలు), ఇగ్నిస్ జీటా (రూ 6.91 లక్షలు) వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది. పెట్రోల్ ఇంజన్ తో మరియు నాలుగు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన స్పోర్ట్స్ (ఓ) వేరియంట్- ఇగ్నిస్ జీటా ఏ ఎంటి రూ 6.3 లక్షలు, 1.5 ఫిగో టైటానియం ధర రూ. 7.44 లక్షలు వంటి వాహనాలకు వ్యతిరేకంగా పోటీ పడుతుంది.

లక్షణాల పరంగా, గ్రాండ్ ఐ 10 అనేది- శీతలీకరణ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతిచ్హే ఏడు అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగిన్న ఏకైక కారు ఇదే. ఇగ్నిస్ పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ ను అందిస్తున్నప్పుడు, ఫిగో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ను అందిస్తుంది, ఇవి మిగిలిన కార్లలో లేవు. ఏమైనప్పటికీ, గ్రాండ్ ఐ 10 ఏబిఎస్ ని అందించదు, ఇది ఇతర కార్లలో అందించబడుతుంది.

అస్టా

Grand i10 Facelift Vs Ignis Vs Figo Vs Swift: Variant-To-Variant Feature Comparison

అస్టా అగ్ర శ్రేణి వేరియంట్ మరియు ఇది- పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏబిఎస్ మరియు రేర్ స్పాయిలర్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ రెండిటితో ఇది అందుబాటులో ఉంది. రూ. 6.39 లక్షల ధరతో ఉన్న పెట్రోల్ వేరియంట్- ఇగ్నిస్ ఆల్ఫా (రూ 7.80 లక్షలు), ఫిగో టైటానియం ప్లస్ (రూ 6.36 లక్షలు), స్విఫ్ట్ జెడ్ ఎక్స్ ఐ (రూ 6.37 లక్షలు) వంటి కార్లకు పోటీను ఇస్తుంది. మరోవైపు రూ. 7.32 లక్షల తో అందుబాటులో ఉన్న డీజిల్ వెర్షన్- ఇగ్నిస్ ఆల్ఫా (రూ 7.80 లక్షలు), స్విఫ్ట్ జెడ్డిఐ (రూ 7.44 లక్షలు), ఫిగో టైటానియం ప్లస్ (రూ .7.26 లక్షలు) వంటి కార్లతో పోటీ చేస్తుంది.

ఫిగో టైటానియం ప్లస్ వేరియంట్, 4.2- అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందిస్తుంది. ఏమైనప్పటికీ, గ్రాండ్ ఐ 10 మరియు ఇగ్నిస్ మాత్రమే ఏడు అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి, ఈ వ్యవస్థ- ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇస్తుంది. మరియు ఫిగో తప్ప అన్ని కార్ల లో పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్ ను అందించబడుతుంది. అయితే అన్ని నాలుగు కార్లు ముందు డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ఏబిఎస్ లను కలిగి ఉంటాయి, ఫిగో మాత్రమే ఇక్కడ సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్ కలిగి ఉన్న ఏకైక కార్. ధరను చూసినట్లైతే, ఈ శ్రేణిలోని మిగిలిన నాలుగు కార్లతో పోలిస్తే ఇగ్నిస్ అత్యంత ఖరీదైనది. అయితే, ఇది పూర్తి ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ మరియు అనుకూలీకరణ ఎంపికలు వంటి అదనపు ఫీచర్లను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఫేస్లిఫ్ట్: వేరియంట్ల వివరాలు

మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 2017

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai Grand ఐ10

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience