ఆగస్ట్ 4, 2015 న ఫియట్ వారు 500 అబార్త్ 595 కాంపిటియోజోన్ ని విడుదల చేయనున్నరు
ఫియట్ అబార్ట్ 595 కోసం raunak ద్వారా జూలై 10, 2015 12:53 pm ప్రచురించబడింది
- 12 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇటలీకి గుండె కాయ వంటి ఈ ఫియట్ అధికారికంగా భారతదేశంలో అబార్త్ బ్రాండ్ ని ప్రవేశపెట్టి మినీ కూపర్ ఎస్ కి పోటీగా నిలుపదలచింది
జైపూర్: దేశంలో ఫియట్ ఇండియా వారి తరువాతి దశ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.ఈ ఇటాలియన్ తయారిదారి ఆగస్ట్ 4, 2015 న దాని ప్రఖ్యాత ప్రదర్శన బ్రాండ్ అబార్త్ ని భారతదేశంలో ప్రారంభించనుంది. ప్రవేశ పెట్టే మొట్టమొదటి మోడలు 500 అబార్త్ 595 కాంపిటియోజోన్. తరువాతి దశ కార్యకలాపాలులో భాగంగా ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్ వారు 280 మిలియన్ డాలర్లను ఫియట్ వారి రంజంగాయోన్ యొక్క ఉత్పత్తి సముదాయాన్ని విస్తరింప చేయుటకై పెట్టుబడి పెట్టింది. దీని వలన జీప్ ఎస్ యూ వీ లను 2017 నుండి తయారి చేయటానికి వీలు అవుతుంది.
595 కాంపిటియోజోన్ ఫీయట్ 500 ఆధారంగా నిర్మించబడింది కాని బాహ్య రూపంగా మాత్రం స్పోర్టి లుక్స్ తో ప్రత్యేకంగా కనబడుతుంది. పైగా కారు మీద ఎక్కడా ఫియట్ వారి లోగో కనపడదు. కేవలం అబార్త్ యొక్క స్కార్పియో బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. స్టాక్ 500 తో పోలిస్తే, 595 కాంపిటియోజోన్ కి 205/40 క్రాస్ సెక్షన్ 17 ఇంచుల పిరెల్లి జీరో నంబర్ టైర్లతో వస్తుంది.
లీనియా కి ఉన్న 1.4 లీటర్ టీ-జెట్ మోటార్ దీనికి కూడా ఉంది. కాని అబార్త్ కి అనుగుణంగా అమర్చిన ఈ ఇంజినుకి మరింత పెద్ద టర్బో ఇంటర్ కూలర్ వస్తుంది. ఈ మోటరు 5,500ఆర్పీఎం వద్ద 160పీఎస్ ని మరియూ 3,000ఆర్పీఎం వద్ద 230ఎనెం ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యూల్ ట్రాన్స్మిషంతో పాటుగా దేశంలో విడుదల కానుంది.
0 out of 0 found this helpful