Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ముఖ్యమైన వివరాలను చూపుతూ, మొదటిసారిగా కెమెరాకు చిక్కిన నవీకరించబడిన టాటా నెక్సాన్ EV

టాటా నెక్సన్ ఈవి మాక్స్ 2022-2023 కోసం rohit ద్వారా మే 25, 2023 09:57 am ప్రచురించబడింది

నవీకరించబడిన నెక్సాన్ EV మొదటిసారిగా LED హెడ్ؚలైట్ؚలను పొందవచ్చు

  • కెమెరాకు చిక్కిన మోడల్‌లో, ఫ్లోర్ కింద అమర్చిన బ్యాటరీ ప్యాక్ؚను చూడవచ్చు మరియు టెయిల్ؚపైప్ మిస్ అయినట్లుగా కనిపిస్తుంది.

  • రానున్న నవీకరించబడిన నెక్సాన్ؚలో ఉన్నట్లుగా కనెక్టెడ్ LED టెయిల్ؚలైట్ؚలను కూడా ఇందులో చూడవచ్చు.

  • ఇంతకు ముందు విధంగానే దీన్ని ప్రైమ్ మరియు మాక్స్ؚలలో అందిస్తారని అంచనా.

  • వాటి సంబంధిత బ్యాటరీ ప్యాక్ؚలు మరియు పరిధి 30.2kWh (312km) మరియు 40.5kWh (453km)గా ఉండవచ్చు.

  • ఇది రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 2024 ప్రారంభంలో రావచ్చని అంచనా.

ఇప్పటికే, మీరు నవీకరించబడిన టాటా నెక్సాన్ రహస్య చిత్రాలను మరియు వీడియోలను చూసి ఉంటారు. ఊహించిన విధంగానే, టాటా SUV నవీకరించబడిన EV ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేస్తుంది, దీని మొదటి రహస్య వీడియో ఆన్ؚలైన్ؚలో కనిపించింది.

వీడియోలో గమనించదగిన వివరాలు

ఎలక్ట్రిక్ స్వభావాన్నీ తెలిపే ప్రధాన సంకేతం ఎమిషన్ పైప్ లేకపోవడం. నెక్సాన్ EVలో గమనించదగిన మరొక ఆసక్తికరమైన అంశం ఫ్లోర్ క్రింద అమర్చిన బ్యాటరీ ప్యాక్. నవీకరించబడిన నెక్సాన్ EV రహస్య వీడియోలో కనిపించినట్లుగా ఇది LED హెడ్ؚలైట్‌లను పొందవచ్చు, నవీకరించబడిన నెక్సాన్ టెస్ట్ వాహనాలలో కనిపించిన కనెక్టెడ్ టెయిల్ؚలైట్ సెట్అప్ؚను కూడా కలిగి ఉండవచ్చు.

ఇది కూడా చూడండి: టెస్ట్ చేస్తూ ఫోటోలకు చిక్కిన నవీకరించబడిన టాటా సఫారి, కానీ భారతదేశంలో మాత్రం కాదు,

ఇంతకు ముందు ఉన్న ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ؚలతో వస్తుందా?

నవీకరించబడిన నెక్సాన్ EVని టాటా మునుపటి వేరియెంట్ؚలలోనే అందిస్తుందని ఆశిస్తున్నాము: ప్రైమ్ (ప్రామాణిక పరిధి) మరియు మాక్స్ (దీర్ఘ పరిధి). ఈ రెండిటి ప్రస్తుత పవర్ؚట్రెయిన్ؚలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • నెక్సాన్ EV ప్రైమ్ - 30.2kWh బ్యాటరీ ప్యాక్‌తో 312km క్లెయిమ్ చేసిన పరిధిని కలిగి ఉంటుంది, ఇది 129PS/245Nm ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడుతుంది.

  • నెక్సాన్ EV మాక్స్ – 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 453km క్లెయిమ్ చేసిన పరిధిని కలిగి ఉంటుంది, ఇది 143PS/250Nm ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడుతుంది.

అనేక ఫీచర్‌లు

నవీకరించబడిన నెక్సాన్ EV క్యాబిన్ వీడియోలో కనిపించకపోయినప్పటికి, ఇది రాబోయే నెక్సాన్ؚతో సారూప్యతను కలిగి ఉండవచ్చు. వీటిలో ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఇక్కడ, బ్యాటరీ రీజనరేషన్ కోసం), కొత్త అప్ؚహోల్ؚస్ట్రీ మరియు భారీ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ ఉండవచ్చు.

ఇది బహుశా ప్రస్తుత మోడల్‌లలో ఉన్న వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ఆటో AC మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ؚలను కొనసాగించవచ్చు. భద్రత అప్ؚగ్రేడ్ؚలలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా మరియు కొన్ని అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) రూపంలో ఉండవచ్చు.

విడుదల, ధర మరియు పోటీదారులు

నవీకరించబడిన నెక్సాన్ EVని టాటా 2024 ప్రారంభంలో విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము, వీటి ధరలు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం కావచ్చు. ఇది మహీంద్రా XUV400తో పోటీ పడనుంది, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ؚలకు మరింత చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి : నెక్సాన్ EV మాక్స్ ఆటోమ్యాటిక్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 962 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా నెక్సన్ EV మాక్స్ 2022-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.74 - 19.99 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర