Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

చిత్రాల ద్వారా వెల్లడైన Facelifted Kia Sonet HTK వేరియంట్ వివరాలు

కియా సోనేట్ కోసం rohit ద్వారా జనవరి 16, 2024 05:19 pm ప్రచురించబడింది

సోనెట్ HTK లో భద్రతా కిట్‌తో పాటు కొన్ని కీలక సౌకర్యం మరియు సౌలభ్య ఫీచర్లు ఉండనున్నాయి.

ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ భారతదేశంలో రూ.7.99 లక్షల (ప్రారంభ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ప్రారంభ ధరతో విడుదల అయింది. మేము ఇప్పటికే చిత్రాల ద్వారా సోనెట్ యొక్క టాప్-స్పెక్ GTX+ మరియు X-లైన్ వేరియంట్ల వివరాలను పంచుకున్నాము. ఇప్పుడు దాని బేస్ పైన ఉన్న HTK వేరియంట్ ప్రత్యేకత ఏమిటో చిత్రాల ద్వారా తెలుసుకుందాం.

ఎక్స్టీరియర్

2024 సోనెట్ కారు యొక్క HTK వేరియంట్ ముందు భాగంలో క్రోమ్ సరౌండ్తో రీడిజైన్ చేయబడిన గ్రిల్ లభిస్తుంది. కియా ఈ వేరియంట్లో LEDలకు బదులుగా హాలోజెన్ హెడ్లైట్లను అందించారు మరియు LED DRLలను కూడా అందించలేదు (అవుట్లైన్ ఇప్పటికీ ఉంది). ఫ్రంట్ బంపర్ కింద కొత్త ఎయిర్ డ్యామ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను అందించారు.

సోనెట్ HTK వేరియంట్ లో ప్రధాన నవీకరణలు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ORVMలకు బదులుగా ఫ్రంట్ ఫెండర్ పై టర్న్ ఇండికేటర్ లు మరియు 16-అంగుళాల చక్రాల కోసం స్టైలిష్ వీల్ క్యాప్ లు.

రేర్ లోని మధ్య భాగంలో కాంతి ప్రకాశించని విధంగా టెయిల్ ల్యాంప్లు సెటప్ చేయబడ్డాయి. ఇందులో వెడల్పాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్, సవరించిన రేర్ బంపర్లు ఉన్నాయి.

ఇంటీరియర్

క్యాబిన్ లోపల, ఇది గ్రే ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ మరియు ఆల్-బ్లాక్ క్యాబిన్ థీమ్తో పాటు స్టీరింగ్ వీల్, డోర్లు మరియు AC వెంట్ల చుట్టూ కొన్ని సిల్వర్ ఎలిమెంట్లు ఉంటాయి. సోనెట్ HTK వేరియంట్ వెనుక భాగంలో సింగిల్ పీస్ బెంచ్ సీటు లభిస్తుంది. రేర్ సెంటర్ ప్యాసింజర్ కు హెడ్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ సదుపాయం లేదు. అయితే ఇందులో మూడు టైప్-C ఛార్జింగ్ పోర్టులు (1 ముందు మరియు 2 వెనుక) ఉన్నాయి.

ఫీచర్లు మరియు భద్రత

ఇది లోవర్ స్పెక్ వేరియంట్ అయినప్పటికీ, ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ AC, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 6-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందించారు. సోనెట్ HTK వేరియంట్ లో రేర్ సన్ షేడ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు నాలుగు పవర్ విండోలు కూడా ఉండనున్నాయి.

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ (VSM) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

సంబంధిత: కొత్త vs పాత కియా సోనెట్ మధ్య వ్యత్యాసాలను తెలుసుకోండి

పవర్ట్రెయిన్ ఎంపికలు

కియా సోనెట్ HTK వేరియంట్ 5-స్పీడ్ MTతో 1.2-లీటర్ పెట్రోల్ (83 PS/ 115 Nm) మరియు 6-స్పీడ్ MTతో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (116 PS/ 250 Nm) అనే రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది.

కియా సోనెట్ యొక్క వేరియంట్ల వారీగా ఇంజన్-గేర్ బాక్స్ ఎంపికల వివరాలను మేము ఈ కథనంలో కవర్ చేసాము, ఇది సరైన వేరియంట్ ను ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది.

ధరలు మరియు ప్రత్యర్థులు

కొత్త కియా సోనెట్ ధర భారతదేశంలో రూ.7.99 లక్షల నుండి రూ.15.69 లక్షల మధ్య ఉంటుంది, కాని సోనెట్ HTK వేరియంట్ ధర రూ.8.79 లక్షల నుండి రూ.10.39 లక్షల మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ప్యాన్ ఇండియా). ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మారుతి ఫ్రాంక్స్ సబ్-4m క్రాసోవర్ SUV వంటి మోడళ్ళతో పోటీ పడనుంది.

మరింత చదవండి: సోనెట్ ఆన్ రోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 612 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన కియా సోనేట్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర