తేడాలను తెలుసుకోండి: కొత్త Vs పాత Kia Sonet
కియా సోనేట్ కోసం rohit ద్వారా డిసెంబర్ 18, 2023 01:05 pm ప్రచురించబడింది
- 557 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిజైన్ పరంగా ఈ SUV మరిన్ని మార్పులను ఎక్స్‌టీరియర్‌లో పొందింది, అంతేకాకుండా క్యాబిన్ కూడా కొన్ని ఉపయోగకరమైన సౌకర్యాలు మరియు ఫీచర్ అప్ؚగ్రేడ్ؚలను పొందింది
కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ ఇప్పటికే ఆవిష్కరించబడినప్పటికీ, దీని ధరల కోసం 2024 ప్రారంభం వరకు వేచి ఉండాల్సి ఉంది. ఇది మిడ్ؚలైఫ్ అప్ؚడేట్ అయినందున, SUV పరంగా మరిన్ని మార్పులు లేకపోయినా, లోపల మరియు వెలుపల అప్‌డేట్‌లను పొందింది. ఈ SUV ఎటువంటి మార్పులను పొందింది మరియు కొత్త మరియు పాత కియా సోనెట్ SUVల మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముందు భాగం
ఈ SUV ముందు భాగం మరిన్ని స్టైలింగ్ మార్పులను పొందింది. ఈ అప్ؚడేట్ؚతో, సోనెట్ ఆకర్షణీయమైన 3-పీస్ؚల LED హెడ్ؚలైట్ؚలు మరియు పొడవైన ఫ్యాంగ్-ఆకారపు LED DRLలను పొందింది. కియా దీని గ్రిల్ؚను కూడా సవరించింది, ప్రస్తుతం ఇది సిల్వర్ ఇన్సర్ట్ؚలతో వస్తుంది, మరియు కొత్త సోనెట్ నాజూకైన LED ఫాగ్ ల్యాంప్ؚలను కలిగి ఉంది. నవీకరించిన మోడల్, సవరించిన బంపర్ మరియు భిన్నమైన స్టైలింగ్ గల ఎయిర్ డ్యామ్ؚలను కూడా పొందింది.
సైడ్
ప్రొఫైల్ؚలో, గమనించదగిన ప్రధాన మార్పులలో కొత్త అలాయ్ వీల్స్ (X-లైన్ వేరియెంట్‌ను మినహహించి 16-అంగుళాల రిమ్స్ కోసం) మరియు ORVMకు అమర్చిన కెమెరాను (360-డిగ్రీల సెట్ؚఅప్ؚలో భాగంగా) చూడవచ్చు. మరొక తేలికపాటి సవరణలో, కొత్త సోనెట్ హయ్యర్-స్పెక్ వేరియెంట్ؚలలో, నవీకరణకు ముందు ఉన్న క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ బదులుగా ప్రస్తుతం బాడీ-రంగులోని డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
వెనుక భాగం
వెనుక వైపు చోటు చేసుకున్న భారీ స్టైలింగ్ మార్పులలో ఫుల్లీ కనెక్టెడ్ LED టెయిల్‌లైట్ؚలు (కొత్త సెల్టోస్ؚలో చూసినట్లు ఇప్పుడు నిలువుగా మార్చబడ్డాయి), ‘సోనెట్’ బ్యాడ్జింగ్ స్థానంలో మార్పులు మరియు సవరించిన బంపర్ ఉన్నాయి.
ఇది కూడా పరిశీలించండి: వివరణ: కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ؚలో ఉన్న అన్ని రంగు ఎంపికలు
ఇంటీరియర్ మరియు ఫీచర్‌లు
లోపల వైపు, కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ క్యాబిన్ లేఅవుట్ దాదాపుగా నిలిపివేయబడుతున్న మోడల్ؚకు స్వరూపంగా ఉంది. డిజైన్ పరంగా చెప్పుకోదగిన భారీ తేడా, టచ్ؚస్క్రీన్ దిగువన కొత్త క్లైమేట్ కంట్రోల్ ఫ్యానెల్ؚను చేర్చడం.
కొత్త 360-డిగ్రీల కెమెరా కాకుండా, కియా సబ్-4m SUV ప్రస్తుతం, సెల్టోస్ؚలో ఉన్న 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚతో వస్తుంది. దీనిలో అందిస్తున్న ఇతర ప్రీమియం ఫీచర్‌లలో 4-వే పవర్డ్ డ్రైవర్ సీట్ (హ్యుందాయ్ వెన్యూలో ఉన్నట్లుగా), సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ؚలు మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
దీని సేఫ్టీ ఫీచర్‌లలో కూడా భారీ మార్పులను చేయలేదు, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందింది మరియు 10 అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) టాప్ వేరియెంట్ؚలలో అందిస్తున్నారు. ఇతర సేఫ్టీ ఫీచర్‌లలో ఇప్పటికీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
ఇంజన్-గేర్ؚబాక్స్ ఎంపికలు
నిలిపివేస్తున్న మోడల్ؚలో ఉన్న అవే పవర్ؚట్రెయిన్ ఎంపికలను 2024 సోనెట్ؚలో కొనసాగించారు. అయితే, 2023 ప్రారంభంలో నిలిపివేసిన డీజిల్-మాన్యువల్ కాంబోని కియా తిరిగి తీసుకువచ్చింది. కియా సబ్-4m SUV ఇంజన్-వారీ అవుట్ؚపుట్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
-
1.2-లీటర్ పెట్రోల్ (83 PS/115Nm): 5-స్పీడ్ MT
-
1-లీటర్ టర్బో-ఎట్రోల్ (120 PS/172Nm): 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT
-
1.5-లీటర్ డీజిల్ (116 PS/250 Nm): 6-స్పీడ్ MT (కొత్తది), 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT
విడుదల మరియు పోటీ
కియా సోనెట్ ఫేస్ؚలిఫ్ట్ జనవరి 2024లో ఆవిష్కరించబడుతుంది, దీని ప్రారంభ ధర రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మరియు మారుతి ఫ్రాంక్స్ క్రాస్ؚఓవర్ؚలు దీనికి పోటీగా నిలుస్తాయి.
కియా సోనెట్ؚలో వచ్చిన డిజైన్ మరియు ఫీచర్ మార్పులు మీకు నచ్చాయా? క్రింద కామెంట్ సెక్షన్ؚలో మాకు తెలియజేయండి
ఇది కూడా చదవండి: 2023లో భారతదేశంలో కియాలో ఆవిష్కరించిన అన్నీ కొత్త ఫీచర్లు
ఇక్కడ మరింత చదవండి: కియా సోనెట్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful