ఇకపై కియా నుండి CNG లేదా హైబ్రిడ్ వాహనాల కోసం ఎదురుచూడకండి
published on జనవరి 25, 2023 03:35 pm by sonny
- 82 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కార్ తయారీ సంస్థ భారతదేశంలో కేవలం పెట్రోల్, టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను మాత్రమే అందిస్తుంది.
భారతదేశంలో ప్రవేశించిన కేవలం మూడు సంవత్సరాలలోనే, ప్రాముఖ్యం చెందిన SUVలు మరియు MPVలతో కియా ఇప్పటికే దేశంలో అధికంగా విక్రయించబడే మొదటి ఐదు కార్ బ్రాండ్‌లలో ఒకటి అయ్యింది. SUV, MPV విభాగాలలో CNG మోడళ్ళ కొనుగోలు పెరిగిన, తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలు తమకు లేవని కియా నిర్ధారించింది.
CNGతో పోటీదారులు
భారత సిఎన్‌జి మార్కెట్‌లో మారుతి తన ఆధిపత్యం చెలాయిస్తుంది, ఈ ఇంధన ఎంపికతో మారుతి ఎన్నో రకాల మోడళ్లను అందిస్తోంది. ఇటీవల మారుతి తన మొదటి సిఎన్‌జి-ఆధారిత మోడల్ కొత్త గ్రాండ్ విటారాను SUV విభాగంలో ప్రవేశపెట్టింది, ఇది నేరుగా కియా సెల్టోస్ؚతో పోటీ పడుతుంది.
సొనేట్ؚతో పోటీ పడే బ్రెజ్జా కూడా త్వరలో సిఎన్‌జితో అందుబాటులోకి రానుంది. మారుతి ఎర్టిగా మరియు XL6 వంటి వాహనాల కంటే కియా కేరెన్స్ MP అధిక నాణ్యతతో వస్తుంది, మారుతి ఎర్టిగా మరియు XL6 వాహనాలు సిఎన్‌జి పవర్ؚట్రెయిన్ ఎంపికలో అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల టాటా, టియాగో మరియు టిగోర్ؚతో CNG స్పేస్ؚలో ప్రవేశించింది. పంచ్ మరియు అల్ట్రోజ్ؚతో అందించడానికి కొత్త సిఎన్‌జి సాంకేతికతను కూడా ప్రదర్శించింది. తన సోదర బ్రాండ్ హ్యుందాయ్ లా, ఈ CNG విభాగంలోకి కియా ప్రవేశించే అవకాశం లేదు.
హైబ్రిడ్స్ కూడా ఉండవు
మారుతి మరియు టొయోటాలు తమ కొత్త కాంపాక్ట్ SUVలు అయిన గ్రాండ్ విటారా మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ؚతో భారత మాస్ మార్కెట్ కోసం బలమైన హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ؚలను పరిచయం చేశాయి. ఈ రెండు వాహనాలు డీజిల్ వేరియంట్ కంటే ఎక్కువగా తమ మెరుగైన ఇంధన ఆదాతో మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. అయితే, భారతదేశంలో బలమైన హైబ్రిడ్‌లను పరిచయం చేసే ప్రణాళికలు లేవని కియా ప్రకటించింది.
అయితే కియా ప్రణాళిక ఏమిటి?
ఈ కొరియన్ కారు తయారీదారు, 2025 నాటికి మాస్-మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ కంబుషన్ ఇంజన్ మోడళ్ళ నుండి EVలకు మారాలని అనుకుంటుంది. కియా ఇటీవల భారతదేశంలో తన మొదటి EV, ప్రీమియం మరియు స్పోర్టీ వాహనం అయిన EV6ను పరిచయం చేసింది, ఇది CBU రూట్ ద్వారా అందించబడింది. డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలో 700 కిమీ పరిధితో వస్తుంది, దీని ధర రూ.60.95 లక్షల(ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. మరో వైపు, కియా సాపేక్షంగా తక్కువ ధరకు అందించే SUV EV సుమారు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు ఉండవచ్చు ఇది మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ EV మాక్స్ వంటి వాటితో పోటీగా ఉండవచ్చు.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Health Insurance Policy - Buy Online & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful