మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 2 ద్వారా మీ వోల్వో కారుని నియంత్రించండి
modified on జనవరి 07, 2016 02:34 pm by saad
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వాయిస్ కంట్రోల్ డివైజ్ అనేది కొత్త టెక్నాలజీ ఏమీ కాదు, కానీ ఒక వాయిస్ కమాండ్ ద్వారా మీ కారు లక్షణాలు ఎలా నియంత్రించగలరు? మేము ఒక సాధ్యం కాని సైన్స్ ఫిక్షన్ గురించి మాట్లాడటం లేదు, ఇది అతి త్వరలోనే నిజం కాబోతున్న యదార్ధం. ఇన్-కారు టెక్నాలజీ విషయానికి వస్తే, వోల్వో ఉత్తమ ఆటో కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దాని ప్రమాణాలను అంటుకుంటూ స్వీడిష్ సంస్థ ఇప్పుడు తన కార్ల కోసం సేవ అందించడానికి టెక్-దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో కలసింది.
తాజా టెక్నాలజీ ఒక కారు డ్రైవర్ కి మైక్రోసాఫ్ట్ ధరించగలిగే బ్యాండ్ 2 ద్వారా వాయిస్ నియంత్రణతో వాహనాన్ని నియంత్రించుకొనేలా చేస్తుంది. ఈ బ్యాండ్ ద్వారా, డ్రైవర్ ఒక రిమోట్ ఉపయోగించి హారన్, హీటర్ / AC ప్రారంభం, డోర్లు లాక్, లైట్ ఆన్ చేయుట మరియు నావిగేషన్ ద్వారా ప్లే చేయుట వంటివి చేసుకోవచ్చు.
తాజా టెక్నాలజీ ఒక కారు డ్రైవర్ కి మైక్రోసాఫ్ట్ ధరించగలిగే బ్యాండ్ 2 ద్వారా వాయిస్ నియంత్రణతో వాహనాన్ని నియంత్రించుకొనేలా చేస్తుంది. ఈ బ్యాండ్ ద్వారా, డ్రైవర్ ఒక రిమోట్ ఉపయోగించి హారన్, హీటర్ / AC ప్రారంభం, డోర్లు లాక్, లైట్ ఆన్ చేయుట మరియు నావిగేషన్ ద్వారా ప్లే చేయుట వంటివి చేసుకోవచ్చు. ఇప్పటివరకు, వోల్వో కార్లు మాత్రమే XC90 మరియు రాబోయే S90 సెడాన్ లా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరచుకోగలవు.
ఈ కారు వాయిస్ నియంత్రణ లక్షణం 2016 ల ద్వితీయార్ధంలో వోల్వో కార్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో డ్రైవర్ చేయాల్సిన పని ఏమిటంటే వోల్వో ఆన్ కాల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, తద్వారా అతను తన వాహనం యొక్క పనితీరును నియంత్రించవచ్చు. వోల్వో నుండి ఈ యాప్ యుఎస్, యూరప్ మరియు చైనా మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.
ఇది రెండో సారి ఇటువంటి సాంకేతిక టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థలు కలవడం. అంతకుముందు వోల్వో మరియు మైక్రోసాఫ్ట్ HoloLens ఉపయోగించి ఒక వాస్తవిక షోరూమ్ సృష్టించడానికి చేతులు కలిపారు. ఈ టెక్నాలజీ ప్రాస్పెక్టివ్ కొనుగోలుదారులకు కొత్త డిజైన్ లు, కలర్స్, లక్షణాలు మరియు అటువంటి చాలా విషయాలకు ఉపయోగపడుతుంది.
వోల్వో-మైక్రోసాఫ్ట్ వాయిస్ కంట్రోల్ వీడియో
ఇంకా చదావండి
- వోల్వో కాన్సెప్ట్ '26' ప్రదర్శిస్తుంది
- ఎస్90 ను వెల్లడించిన వోల్వో | క్యూ4 2016 లో భారతదేశంలో ప్రారంభం
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful