• English
  • Login / Register

Citroen C3 Aircross: వచ్చే నెలలో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ బుకింగ్‌లు ప్రారంభం, అక్టోబర్‌లో ధరల విడుదల

సిట్రోయెన్ aircross కోసం shreyash ద్వారా ఆగష్టు 02, 2023 06:01 pm ప్రచురించబడింది

  • 301 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ C3 ఎయిర్‌క్రాస్ భారతదేశంలో నాల్గవ సిట్రోయెన్ మోడల్ అవుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా వంటి కాంపాక్ట్ SUVలకు ప్రత్యర్థిగా ఉంటుంది

Citroen C3 Aircross

  • సిట్రోయెన్  C3 ఎయిర్ క్రాస్ యొక్క సీటర్ లేఅవుట్‌లు 5- మరియు 7- మధ్య ఉంటాయి.

  • C3 హ్యాచ్‌బ్యాక్ లోని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉపయోగించబడుతుంది.

  • యూనిట్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

  • ఇది 10-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్ మరియు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

  • రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ధరలు.

ఇండియా-స్పెక్ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఏప్రిల్ 2023లో వెల్లడైంది. ఫ్రెంచ్ కార్‌మేకర్ దాని ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లను విడుదల చేసారు. సిట్రోయెన్ కాంపాక్ట్ SUV యొక్క బుకింగ్‌, ప్రారంభం మరియు విడుదల తేదీ వివరాలను ప్రకటించింది. C3 ఎయిర్‌క్రాస్ యొక్క బుకింగ్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభంమవుతాయి. ధరల ప్రకటించిన తర్వాత డెలివరీలు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి.

సిట్రోయెన్  C3 ఎయిర్ క్రాస్ ఏమి అందిస్తుందో చూద్దాం.

ప్రాథమిక ఫీచర్ జాబితా

Citroen C3 Aircross

C3 ఎయిర్‌క్రాస్‌లో దాని ప్రత్యర్థులతో పోలిస్తే వినియోగదారులను ఆకట్టుకొనే సౌకర్యాలు లేవు. ఇది సెగ్మెంట్ కొనుగోలుదారుల ప్రాథమిక అవసరాలను తీర్చదు. దేనిలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో నియంత్రణలను కలిగి ఉంటుంది.

భద్రత కోసం, C3 ఎయిర్‌క్రాస్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

C3 ఎయిర్‌క్రాస్‌లో ఆటోమేటిక్ AC, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు దాని సెగ్మెంట్ పోటీదారులు అందించే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ముఖ్యమైన ఫీచర్లు లేవు.

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 భారతదేశంలో 1 సంవత్సరాన్ని పూర్తి చేసింది: ఇక్కడ ఒక రీక్యాప్ ఉంది

పవర్ట్రెయిన్ తనిఖీ

Citroen C3 Aircross

సిట్రోయెన్ యొక్క కాంపాక్ట్ SUV C3 హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అదే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 110PS , 190Nm పవర్, టార్క్ లను అందిస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం ఇప్పుడు ఎంపిక లేనప్పటికీ, ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని జోడించే అవకాశాలు ఉన్నాయి.

ధరలు మరియు ప్రత్యర్థులు

C3 ఎయిర్‌క్రాస్ ఫీచర్-రిచ్ వేరియంట్ కానప్పటికీ, ప్రారంభ ధర దాదాపు రూ. 9 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంటుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు హోండా ఎలివేట్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

మరింత చదవండి : C3 ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Citroen aircross

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience