• English
  • Login / Register

పుంటో అబార్త్ బుకింగ్స్ ప్రారంభం - వివరాలు చూడండి!

ఫియట్ పుంటో అబార్ట్ కోసం manish ద్వారా సెప్టెంబర్ 05, 2015 04:38 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: అవును ఇది నిజం! మా మూలాల ప్రకారం, కొన్ని ఫియట్ అబార్త్ డీలర్షిప్స్ ఈ ఏడాది అత్యంత ముందస్తుగా హాట్ హాచ్ కోసం బుకింగ్స్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఫియట్ పుంటో అబార్త్ బుకింగ్స్ 1.5 లక్షల ప్రారంభ ధర వద్ద ప్రత్యేక అబార్త్ షోరూంలో ప్రారంభమయినాయి. ఈ బుకింగ్ మొత్తం పుంటో అబార్త్ యొక్క రిజర్వేషన్ ని నిర్ధారిస్తుంది. మీరు కూడా ఢిల్లీ సహా ఎంపిక నగరాల్లో, డీలర్షిప్ల కోసం మీ ప్రాధాన్యత ప్రకారం టాప్ 3 రంగు ఎంపికలను చేయవచ్చు. దీనిలో తెలుపు నలుపు మరియు బూడిద రంగులు కూడా ఉన్నాయి. కారు అక్టోబర్ లో ఏదో ఒక సమయంలో ప్రారంభం కావచ్చు మరియు రూ.10 నుండి 12 లక్షల మధ్య ధరను కలిగి ఉండవచ్చు. 

ఈ కారు 1.4 లీటర్ టి-జెట్ ఇంజిన్ ద్వారా ఆధారితం చేయబడి ఉంటుంది. గతంలో ఈ ఇంజిన్ దాని సి-సెగ్మెంట్ సెడాన్ లీనియా లో కనిపించింది. ఈ ఇంజిన్ 145bhp శక్తిని మరియు 195Nm కి పైగా టార్క్ ని అందిస్తుంది. ఈ కారు 10 సెకెన్లలో 0 నుండి 100 త్వరణాన్ని అందివ్వగలదు. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జత చేయబడి ఉంటుంది. ఇప్పటివరకూ ఉన్న ఆధారాలను బట్టి ఫియట్ పుంటో అబార్త్ దాని పోటీ దారులైన విడబ్లు పోలో జిటి టిఎస్ ఐ వంటి వాటితో పోటి పడగలుగుతున్నది. 

భారతదేశానికి ప్రత్యేఖంగా అందించబడుతున్న అబార్త్, దాని అబార్త్ బ్యాడ్జీలతో పాటు గ్రిల్ మరియు వింగ్ మిర్రర్ క్యాప్స్ పైన భిన్నమైన షేడ్స్ ని కలిగి ఉంటాయి. ఈ కారు అబార్త్ సైడ్ డికేల్స్ మరియు స్పోర్టి డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ తో వస్తాయి. దీనిలో అంతర్భాగాలు ఫియట్ బ్యాడ్జ్లు స్థానంలో కుట్లు మరియు అబాత్ బ్యాడ్జింగ్ తో ప్రతేఖ సీట్లతో వస్తాయి. అలానే ఈ కారు 20 మిల్లీమీటర్ల తక్కువ రైడ్ ఎత్తుతో, నవీకరించిన బ్రేక్ పెడల్స్ మరియు షిఫ్టెడ్ అప్ సస్పెన్షన్ వ్యవస్థతో వస్తుంది. పుంటో అబార్త్ ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ మరియు ప్రామాణిక ఏబిఎస్ వంటి భద్రతా లక్షణాలతో అమ్మకాలకు వెళుతుంది. 

was this article helpful ?

Write your Comment on Fiat పుంటో అబార్ట్

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience