• English
  • Login / Register

Bharat NCAP: సురక్షితమైన కార్‌ల కోసం ప్రవేశపెట్టనున్న కొత్త కార్యక్రమం గురించి కారు తయారీదారుల అభిప్రాయం

ఆగష్టు 24, 2023 06:08 pm rohit ద్వారా ప్రచురించబడింది

  • 1K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జాబితాలో భారతీయ, అంతర్జాతీయ కారు తయారీదారులు కూడా ఉన్నారు, భారతదేశంలో సురక్షితమైన కార్‌లకు వీరు మద్దతు ఇస్తున్నారు

Carmakers on Bharat NCAP

రోడ్డు రవాణా మరియు హైవేల (MoRTH) మంత్రిత్వ శాఖ ఇటీవల భారత దేశ సొంత క్రాష్ టెస్ట్ మరియు భద్రతా రేటింగ్ ఏజెన్సీ భారత్ NCAPని ప్రారంభించింది. స్వచ్ఛంద కార్యక్రమంగా, ఇది కారు తయారీదారులను అన్నీ ధర శ్రేణులలో తమ కార్‌ల భద్రతను మెరుగుపరిచేలా ప్రోత్సాహించడమే దీని లక్ష్యం. ఆటో పరిశ్రమలో వివిధ సంస్థలతో పాటు, అనేక కారు తయారీదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని ప్రకటించారు. BNCAP పరిచయం గురించి ప్రధాన కారు తయారీదారులు ఏం చెబుతున్నాయి అనే విషయంపై సంక్షిప్త వివరణ క్రింది ఇవ్వబడింది. 

మారుతి

మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్పొరేట్ అఫైర్స్, శ్రీ. రాహుల్ భార్తీ ఇలా అన్నారు, “భారతదేశంలో విడుదల అయ్యే ప్రతి కారు భారత ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అనుసరిస్తుంది. అదనపు భద్రతా సమాచారాన్ని కోరుకునే వినియోగదారుల కోసం, భారత్ NCAP అనేది ఒక నిష్పాక్షిక మరియు ప్రామాణిక రేటింగ్ సిస్టమ్, కొనుగోలుదారులు అవగాహనాపూర్వక ఎంపికను చేసుకోగలిగేలా చేస్తుంది.”

“ఈ ప్రభుత్వ కార్యక్రమానికి మారుతి స్వాగతం పలుకుతోంది మరియు మొదటి దఫాలోనే కనీసం మూడు మోడల్‌లను భారత్ NCAP పరీక్షకు పంపుతుంది,” అని తెలిపారు.

Maruti Grand Vitara

ప్రస్తుతానికి మారుతి నుండి టెస్టింగ్‌కు సిద్దంగా ఉన్న మోడల్‌ల వివరాలు మాత్రం తెలియదు, కానీ వీటిలో గ్రాండ్ విటారా మరియు బ్రెజ్జా SUVలు ఉంటాయని భావిస్తున్నాము. 

టాటా

టాటా మోటార్స్ పాసెంజర్ వెహికిల్స్ మరియు టాటా పాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ MD (మేనేజింగ్ డైరెక్టర్) శ్రీ. శైలేష్ చంద్ర ఇలా వ్యాఖ్యానించారు, “టాటా మోటార్స్‌గా, భారత్ NCAPని ప్రవేశపెట్టడం మాకు చాలా గర్వంగా ఉంది, ఇది భారతదేశంలో వాహన భద్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇది గొప్ప మైలురాయి. మా DNAలో భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంది మరియు మా వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే వాహనాలను అందించడంలో మాకు ఉన్న అంకిత భావానికి ఈ కార్యక్రమం ఖచ్చితంగా అనుగుణంగా ఉంటుంది.”

“అత్యున్నత భద్రత ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు మరియు ఆటోమోటివ్ పరిశ్రమలు చేసిన ఉమ్మడి కృషిని మేము అభినందిస్తున్నాము. ఆధునిక ఫీచర్‌లను అందించే వాహనాలను ఆవిష్కరించడానికి మరియు రూపొందించడానికి, రోడ్ వినియోగదారులు అందరికి అత్యున్నత స్థాయి భద్రత ఉండేలా నిర్ధారించడానికి టాటా మోటార్స్ కట్టుబడి ఉంది” అని కూడా అన్నారు.

Tata Punch

పంచ్ మరియు నెక్సాన్ వంటి మరింత చవకైన మోడల్‌లలో కూడా టాటా రెండు ఎయిర్ బ్యాగ్ؚల కంటే ఎక్కువ అందించడం లేదు, అయినప్పటికీ ఇది ఇంతకుముందు, పాత GNCAP క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం 5-స్టార్ భద్రత రేటింగులను సాధించింది. 

మహీంద్రా 

మహీంద్రా అండ్ మహీంద్రా CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఆటోమోటివ్ డివిజన్, వీజే నక్రా ఇలా అన్నారు, “మేము ఎల్లప్పుడూ భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తాము, మా ఉత్పత్తులు నిరంతరంగా ఐదు-స్టార్ؚలు మరియు నాలుగు-స్టార్ؚల గ్లోబల్ NCAP రేటింగ్ؚలను అందుకోవడం దీనికి రుజువు. భారత్ NCAPను ప్రారంభించడం MoRTH యొక్క ప్రశంసనీయ కార్యక్రమం, ఇది భారతదేశంలో వాహన భద్రత ప్రమాణాలను మరింతగా పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాము.”

Mahindra Scorpio N

మహీంద్రా విడుదల చేసిన చివరి రెండు సరికొత్త SUVలు, XUV700 మరియు స్కార్పియో N రెండూ GNCAP నుండి 5-స్టార్ؚల భద్రత రేటింగ్ؚలను సాధించాయి.  

హ్యుందాయ్ 

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కూడా తమ MD మరియు CEO ఉన్సూ కిమ్ స్పందనను పంచుకుంది, ఆయన ఇలా అన్నారు, “భారత ప్రభుత్వం BNCAP భద్రత కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాము, ఈ చర్య భద్రతా ప్రమాణాలను పెంచుతుందని, కీలకమైన సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తుంది మరియు భారతీయ రహదారులు అందరికి సురక్షితంగా ఉండేల చేస్తుంది అని మేము విశ్వసిస్తున్నాము. హ్యుందాయ్ మోటార్ ఇండియాలో మేము అత్యధిక భద్రతా ప్రమాణాలను, మా ఉత్పత్తుల శ్రేణి అంతటా అందించడానికి కట్టుబడి ఉన్నాము.”

Hyundai Creta

హ్యుందాయ్, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ ప్రజాదరణ పొందిన కారు బ్రాండ్, గ్రాండ్ i10 నియోస్, వెన్యూ మరియు క్రెటా వంటి భారతదేశానికి ప్రత్యేకమైన ఉత్పత్తులలో 5-స్టార్ భద్రతా రేటింగ్ؚలను ఇది ఇంకా సాధించవలసి ఉంది. 

సంబంధించినది: ఇప్పటికే మెరుగైన భద్రత కోసం క్రాష్ టెస్ట్ పారామితులను అప్‌డేట్ చేయడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్న భారత్ NCAP

టయోటా

“భారత్-NCAPను పరిచయం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము మరియు ఇది సరైన దిశలో వేసిన ముందడుగు అని బలంగా నమ్ముతున్నాము. వినియోగదారులు తీసుకునే కొనుగోలు నిర్ణయాన్ని అత్యున్నత భద్రతా ప్రమాణాలు, సురక్షితమైన వాహనాలు ప్రభావితం చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన విషయం. వినియోగదారులను సాధికారులను చేయడమే కాకుండా, ఇది అందిస్తున్న వివిధ ఉత్పత్తులలోని భద్రతా అంశాల పోలికను తెలుసుకోవడం ద్వారా సరైన అవగాహన మరియు పారదర్శకతను కలిగి ఉండడంలో సహాయపడుతుంది.

Toyota Innova Hycross

TKM విషయానికి వస్తే, మనిషి ప్రాణాలు ఎంతో ముఖ్యమైనవి మరియు భద్రత విషయంలో రాజీ పడకూడదు. మేము అందించే ఉత్పత్తులు అన్నీ విధాలుగా అత్యధిక ప్రమాణాలను అందుకునేలా మేము ఎల్లపుడూ అన్నీ చర్యలనూ తీసుకుంటాము. అత్యాధునిక ఫీచర్‌లతో ఎప్పటి కంటే సురక్షితమైన కార్‌లను తయారు చేయడం, భద్రత అవగాహన కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి సమగ్ర విధానాన్ని అనుసరించడాన్ని మేము కొనసాగిస్తాం” అని టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గులాటీ వ్యాఖ్యానించారు.

కియా

Kia Seltos

కియా ఇండియా చేసిన ఒక ప్రకటనలో, చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ ఆఫీసర్ మ్యూంగ్-సిక్ సోహ్న్ ఇలా అన్నారు, “BNCAP ఒక మెరుగుపరచిన రహదారుల భద్రతా కార్యక్రమం, ఇది కార్‌లకు భద్రతా రేటింగ్ؚలు ఇవ్వడాన్ని మించి విస్తరిస్తుంది. క్రియాశీల మరియు పరోక్ష భద్రతా అంశాలు రెండూ ఇమిడేలా, భద్రత కోసం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనిక విధానాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము మరియు వాటిని అనుసరిస్తాము. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ విజన్‌కు తగినట్లు ఉన్న ఈ చర్య, వాహనాలను దేశం వెలుపల పరీక్ష చేయించవలసిన అవసరాన్ని మరియు ఖర్చులను నివారిస్తుంది. మంచి రేటింగ్ؚలను కలిగి ఉండే, భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును కూడా తెస్తుంది.”

అంతర్జాతీయంగా పరీక్షించడానికి అయ్యే ఖర్చు సుమారు రూ.2.5 కోట్లతో పోలిస్తే, భారత్ NCAPతో ఒక కారును క్రాష్ టెస్ట్ చేయడానికి అయ్యే అంచనా ఖర్చు సుమారు రూ.60 లక్షలు, అని కేంద్ర మంత్రి శ్రీ. నితిన్ గడ్కారీ గారు చేసిన వాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. 

ఇది కూడా చదవండి: భారత NCAP Vs గ్లోబల్ NCAP: సారూప్యతలు మరియు తేడాల వివరణ 

స్కోడా 

“కారు భద్రతను మెరుగుపరిచే భద్రతా నిబంధనలు మరియు విధానాలకు భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నాము. BNCAP పరిచయం సరైన దిశలో వేసిన అడుగు. భద్రత ఒక ముఖ్యమైన అంశము మరియు కారు నిర్మాణంతో సహా, క్రియాశీల మరియు పరోక్ష భద్రత ఫీచర్‌లు వాహనాన్ని నడిపే వ్యక్తి మరియు వారి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతాయి. స్కోడా ఒక కుటుంబ బ్రాండ్, వినియోగదారులు అందరి భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాము. భారతదేశ మార్కెట్ؚలో ఈ బ్రాండ్ మరింత అభివృద్ధి చెందడానికి భద్రతపై మరింత దృష్టి పెట్టడాన్ని స్కోడా కొనసాగిస్తుంది”, అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్క్ అన్నారు.Skoda Slavia

స్కోడా-వోక్స్వ్యాగన్ ఇండియా ప్రస్తుతం భ్రాతదేశంలో అత్యధిక భద్రతా రేటింగ్ కలిగిన కార్ లను కలిగి ఉంది, ఎందుకంటే ఇవి గ్లోబల్ NCAPచే పరీక్షించబడినాయి, వీటిలో వోక్స్వాగన్ టైగూన్, వోక్స్వాగన్ విర్టస్, స్కోడా కుషాక్ మరియు స్కోడా స్లావియా ఉన్నాయి. 

రెనాల్ట్

Renault Kiger

“సరైన సమయంలో, భారత ప్రభుత్వం చారిత్రాత్మక భారత్ NCAPను ప్రవేశపెట్టడం, తమ పౌరులను రక్షించడం మరియు రోడ్డు భద్రతను పెంపొందించడం పట్ల వారికి ఉన్న అంకిత భావాన్ని చూపుతోంది. ఈ కార్యక్రమానికి రెనాల్ట్ ఇండియా హృదయపూర్వకంగా మద్దతు ఇస్తోంది మరియు ప్రమాదాలను తగ్గించడం మరియు అందరికి సురక్షితమైన ప్రయాణాలను నిర్ధారించడం కోసం మా నైపుణ్యాలను అందించడానికి ఎదురుచూస్తున్నాము,” అని రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ CEO మరియు MD వెంకట్ రామ్ మామిళ్లపల్లె వ్యాఖ్యానించారు. 

భారత్ NCAP గురించి శీఘ్ర పునశ్చరణ 

అక్టోబర్ 1, 2023 నుండి భారత్ NCAP తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది, గ్లోబల్ NCAPకి సమానంగా దాదాపుగా అదే పారామితులలో కార్లను పరీక్షిస్తుంది, దీనిలో ఫ్రంటల్ ఆఫ్ సెట్, సైడ్ ఇంపాక్ట్ మరియు పోల్ సైడ్ ఇంపాక్ట్ వంటివి ఉంటాయి. రేటింగ్ సిస్టమ్, కారు ఎంపికల ప్రమాణాలు మరియు వాహనాల రకాలు, మా ప్రధాన కథనంలో చర్చించబడ్డాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

1 వ్యాఖ్య
1
S
sunny
Aug 23, 2023, 3:08:35 PM

Suzuki need to need all the arena cars for crash testing project.

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience