Bharat NCAP Vs గ్లోబల్ NCAP: సారూప్యతలు, తేడాల వివరణ

ఆగష్టు 24, 2023 05:55 pm tarun ద్వారా ప్రచురించబడింది

  • 256 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారత్ NCAP నియమాలు, గ్లోబల్ NCAP నియమాలకు స్వారూప్యంగా ఉంటాయి; అయితే, మన రోడ్డు మరియు డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి భారతదేశానికి-ప్రత్యేకమైన కొన్ని మార్పులు ఉన్నాయి

Bharat NCAP vs Global NCAP

ప్రయాణీకుల భద్రత విషయంలో భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి, భారత్ NACPని ప్రవేశపెట్టింది. భారతదేశంలో విక్రయించే కార్‌లకు భద్రతా రేటింగ్ؚలను ఇవ్వడానికి ప్రస్తుతం దేశంలోనే క్రాష్ టెస్ట్‌లను నిర్వహించవచ్చు. అయితే, రహదారి చట్టబద్ధత కలిగి ఉండటానికి కారు తయారీదారులు ప్రాధమిక నిబంధనలను అందుకోవడం తప్పనిసరి మరియు ఈ రేటింగ్ సిస్టమ్ అనేది స్వచ్ఛంద ప్రక్రియ. భారత్ NCAP అక్టోబర్ 2023 నుండి అమలులోకి వస్తుంది.

View this post on Instagram

A post shared by CarDekho India (@cardekhoindia)

ఇప్పటివరకు, భారతదేశంలో తయారు అయ్యే కార్‌లకు ‘భారతదేశం కోసం సురక్షితమైన కార్‌లు’ అనే కార్యక్రమంలో భాగంగా గ్లోబల్ NCAP క్రాష్-టెస్ట్ రేటింగ్ؚలను అందించేది. భారతదేశంలో విక్రయించే కొత్త కార్‌లకు భద్రత రేటింగ్ؚలను 10 సంవత్సరాలు పంచుకున్న తరువాత మరియు అధిక రేటింగ్ؚలు ఉన్న కార్‌ల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపడం కారణంగా, BNCAP, GNCAP ప్రమాణాలను మరియు ప్రోటోకాల్స్ؚను ఉపయోగించి తన సొంత ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం సహేతుకంగా ఉంది.

ఏ పారామితులు మరియు విశ్లేషణలు ఒకేలా ఉన్నాయి?

NCAP రెండు వర్షన్ؚలలో ఈ క్రింది పరీక్షలు ఉన్నాయి:

Mahindra Thar frontal impact test

  • ఫ్రంటల్ ఇంపాక్ట్:  ఫ్రంట్ ఆఫ్ؚసెట్ బ్యారియర్ పరీక్షలు 64kmph వేగం వద్ద నిర్వహిస్తారు. దీని ద్వారా తల, మెడ, ఛాతీ, కటి భాగం మరియు మోకాలు ప్రాంతాలలో ప్రభావాన్ని పరిశీలించవచ్చు.

  • సైడ్ పోల్ ఇంపాక్ట్: సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షను 29kmph వేగం వద్ద పరీక్షిస్తారు. ఈ పరీక్ష విజయవంతం కావాలంటే కారులో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండాలి. 

  • సైడ్ బ్యారియర్: 50kmph వేగం వద్ద, ఒక బ్యారియర్, కారు పక్క భాగాన్నీ ఢీ కొడుతుంది, లోపల ఉన్న ప్రయాణీకులకు కలిగే హానిని అంచనా వేస్తారు. 

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్: ESC ఒక క్రియాశీల భద్రత ఫీచర్, ఇది టైర్‌లు స్కిడ్ కావడాన్ని నివారిస్తుంది. కార్‌లలో ESC ప్రామాణికంగా ఉండాలి మరియు దీనికి కూడా ఒక పరీక్ష ఉంది. 

  • పెడెస్ట్రియన్ కంప్లైంట్ ఫ్రంట్ డిజైన్: ప్రస్తుతం కార్‌లు నడిచే వారికి హాని కలిగించని బంపర్ మరియు బోనెట్ డిజైన్ తప్పనిసరిగా ఉండాలి, ప్రమాదం జరిగితే నడిచే వారికి తక్కువ గాయాలు అయ్యేలా ఇది నిర్ధారిస్తుంది. 

అత్యుత్తమ భద్రతా రేటింగ్‌లు పొందటానికి ప్రతి కారు ఈ పరీక్షలలో పాల్గొని, విజయవంతం అవ్వాలి.

ఫ్రంట్ ఆఫ్‌సెట్ పరీక్షలు 64kmph వేగం వద్ద నిర్వహించడం కొనసాగుతుంది. సైడ్ బ్యారియర్ పరీక్షలు 50kmph వద్ద, పోల్ టెస్ట్ؚను 29kmph వద్ద నిర్వహిస్తారు. GNCAP నిబంధనలకు సమానంగా, భారత్ NCAP కూడా కారు నిర్మాణ సమగ్రత మరియు భద్రతా అసిస్ట్ సాంకేతికతలను కూడా పరిగణిస్తుంది.

Hyundai Exter six airbags

3-స్టార్ భద్రతా రేటింగ్ؚను పొందడానికి, కార్‌లలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మరియు ముందు వరుస సీట్ బెల్ట్ రిమైండర్‌లు ఖచ్చితంగా ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా, మూల్యాంకనంలో కొన్ని పాయింట్‌లు తగ్గుతాయి. 

ఇది కూడా చూడండి: టెస్ట్ నిర్వహిస్తుండగా మరొక్కసారి కనిపించిన Kia Sonet Facelift; 2024 ప్రారంభంలో విడుదలవుతుందని అంచనా

అవే స్కోర్ؚలు మరియు స్టార్ రేటింగ్ؚలు

స్కోర్ؚలు కూడా ఒకటి నుండి ఐదు పరిధిలో ఉంటాయి. ప్రతి స్టార్ రేటింగ్ కోసం అవసరమైన కనీస స్కోర్ؚలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

Global NCAP To Start Crash Tests In India By End Of 2023

అడల్ట్ ఆక్యుపెంట్ రక్షణ

చైల్డ్ ఆక్యుపెంట్ రక్షణ

స్టార్ రేటింగ్

స్కోర్

స్టార్ రేటింగ్

స్కోర్

5 స్టార్లు

27

5 స్టార్లు

41

4 స్టార్లు

22

4 స్టార్లు

35

3 స్టార్లు

16

3 స్టార్లు

27

2 స్టార్లు

10

2 స్టార్లు

18

గ్లోబల్ NCAP ప్రక్రియలకు అనుగుణంగా ఉంటూనే, భారత్ NCAP, చివరి స్కోర్ؚను నిర్ణయించే ముందు వ్యక్తిగత పారామితుల వెయిటేజ్ؚకి సంబంధించి భారతదేశానికి ప్రత్యేకమైన కొన్ని సవరణలను చేస్తుంది. 

భిన్నంగా ఉన్నది ఏది?

కొత్తగా పరిచయం చేసిన భారత్ NCAP కంటే గ్లోబల్ NCAP ముందంజలో ఉన్నందున, ప్రస్తుతానికి భారత్ NCAPలో చేర్చని కొన్ని భద్రతా పారామితులు ఉన్నాయి.

Kia Seltos rear seatbelts

ఇందులో ముఖ్యమైనది, అత్యధిక భద్రతా రేటింగ్ؚల కోసం వెనుక సీట్ బెల్ట్ రిమైండర్ؚలు. వెనుక సీట్ బెల్ట్ రిమైండర్‌లు కూడా తప్పనిసరి అని ఇంతకు ముందు కేంద్ర రోడ్డు, రవాణా మరియు హైవేల మంత్రి శ్రీ. నితిన్ గడ్కారీ గారు ప్రకటించారు, ఆ తరువాత అనేక తయారీదారులు తమ కార్‌లలో ఈ ఫీచర్ؚను జోడించి అప్‌డేట్ చేశారు. 

ఈ పరీక్షలు గ్లోబల్ NCAP మార్గదర్శకాలపై ఎక్కువగా ఆధారపడినప్పటికీ, భారత డ్రైవింగ్ పరిస్థితులు మరియు రోడ్‌లను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 

ఇది కూడా చదవండి: ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ మొదట్లో ప్రారంభం కానున్న మారుతి ఎర్టిగా-ఆధారిత MPV టయోటా రూమియన్ అమ్మకాలు

రేటింగ్ؚలు ప్రదర్శించబడతాయి

చివరిగా, భారత్ NCAP ద్వారా పరీక్షించబడిన కార్‌లపై అడల్ట్ మరియు చైల్డ్ భద్రతా రేటింగ్ؚలను ప్రదర్శించే స్టిక్కర్‌లు కలిగి ఉంటాయి. మోడల్, వేరియెంట్ పేరు, పరీక్షించిన సంవత్సరం వంటి వివరాలను స్టిక్కర్‌పై పేర్కొంటారు. PR మెటీరియల్స్ విధంగా కాకుండా, BNCAP నుండి నాలుగు స్టార్ؚల కంటే తక్కువ స్కోర్ పొందిన కార్‌లపై కూడా ఈ స్టిక్కర్ అంటించబడుతుంది. 

ఈ టెస్టింగ్ ప్రక్రియలను అప్‌డేట్ చేస్తూ ఉండాలనే ప్రణాళికలను ప్రభుత్వం కలిగి ఉంది. క్రాష్ టెస్ట్ ఏజెన్సీ, రేర్ క్రాష్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ టెస్ట్ؚను కూడా జోడించాలని భావిస్తోంది, మూల్యాంకనం కోసం కారులో ఎంచుకున్న ADAS ఫీచర్‌లు (లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్రేక్ అసిస్ట్, మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్) ఉండటం తప్పనిసరి చేసింది.

భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్ؚల కోసం ఇప్పటికే అనేక మంది తయారీదారులు బారులు తీరారు. ఈ చర్య, తయారీదారులు ప్రయాణీకుల భద్రతపై దృష్టి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది, తద్వారా రోడ్డు ప్రమాదాలలో సంభవించే మరణాలను అతి తక్కువగా ఉండేలా చేస్తుంది. అక్టోబర్ 2023లో కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత, అనేక కార్‌లు క్రాష్ టెస్ట్‌లో పాల్గొనడాన్నీ చూడవచ్చని భావిస్తున్నాము.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience