• English
  • Login / Register

ఇప్పటికే మెరుగైన భద్రత కోసం క్రాష్ టెస్ట్ పారామితులను అప్‌డేట్ చేయడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్న భారత్ NCAP

ఆగష్టు 23, 2023 03:52 pm rohit ద్వారా ప్రచురించబడింది

  • 809 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ అప్ؚడేట్ؚలు క్రియాశీల మరియు పరోక్ష భద్రత వ్యవస్థలుగా విస్తృతంగా విభజించబడ్డాయి, వీటిలో 360-డిగ్రీల కెమెరా మరియు రేర్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

Bharat NCAP

  • భారత్ NCAP అక్టోబర్ 1, 2023 నుండి తమ కార్యకలపాలను ప్రారంభినచనుంది. 

  • ఇతర అంతర్జాతీయ కారు-భద్రత విశ్లేషణ సంస్థలు అయిన గ్లోబల్ NCAP నిర్వహించే ఏకరితి పరీక్షలను నిర్వహిస్తుంది. 

  • క్రియాశీల భద్రతా ఫీచర్‌లు ఊహించని సంఘటనలు జరగకుండా నివారించడంలో సహాయపడతాయి. 

  • వాహనం ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పడు ప్రయాణీకులకు ప్రమాదాన్ని తగ్గించడంలో పరోక్ష భద్రతా సాంకేతికత ఉపయోగపడుతుంది. 

  • మునపటి ప్రభుత్వం తప్పనిసరి చేసిన భద్రతా అప్ؚడేట్ؚలలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు మరియు EBDతో ABS ఉన్నాయి. 

భారత్ NCAP (భారతదేశ కొత్త కారు విశ్లేషణ కార్యక్రమం) కార్యక్రమాన్ని ఇటీవల కేంద్ర రహదారి రవాణా మరియు హైవేల మంత్రి, శ్రీ. నితిన్ గడ్కారీ గారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న మరియు కొత్త కార్‌లను క్రాష్ టెస్ట్ చేయడానికి మరియు సమగ్ర భద్రతా రేటింగ్‌లను అందించడానికి వివిధ పారామితులు దీనిలో ఉంటాయి. అత్యున్నత భద్రతా ప్రమాణాల కోసం భారత్ NCAP ప్రోటోకాల్స్‌ను అభివృద్ధి చేయడం కొనసాగిస్తారు అని మరియు భవిష్యత్తులో నవీకరించబడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. సూచనలలో కొన్ని క్రింద వివరించబడ్డాయి, ఇవి విస్తృతంగా రెండు వర్గాలుగా విభజించబడ్డాయి:

క్రియాశీల భద్రతా వ్యవస్థలు

ADAS

క్రియాశీల భద్రతా వ్యవస్థలు, ఇవి ప్రధానంగా ప్రమాదాలు లేదా ఊహించని సంఘటనలు నివారించడంలో సహాయపడే భద్రతా ఫీచర్‌లు. కొన్ని ఉదాహరణలలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీల కెమెరా, అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) మరియు TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉంటాయి. 

ESC త్వరలోనే తప్పనిసరి భద్రతా ఫీచర్ కావచ్చని అంచనా, భారత్ NCAP నుండి మంచి సేఫ్టీ రేటింగ్ؚను పొందాలంటే భవిష్యత్తులో 360-డిగ్రీల కెమెరా, బ్రేక్ అసిస్ట్ؚతో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్‌లు కనీస అవసరాలుగా ఉండవచ్చు.

Nissan Magnite 360-degree camera

ప్రస్తుతం, ఈ ఫీచర్‌లు కొన్ని ఇతర డ్రైవర్-అసిస్ట్ ఫంక్షన్‌లతో పాటుగా – ADASను కలిగి ఉన్న కార్‌లలో మాత్రమే ప్రధానంగా లభిస్తున్నాయి. 360-డిగ్రీల కెమెరా మినహాయింపు కానుంది, అయితే ఇది మారుతి బాలెనో మరియు బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్, మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన ప్రధాన కార్‌ల లోనే అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: GM మోటార్స్ సౌజన్యంతో మూడవ తయారీ కర్మాగారాన్ని జోడించనున్న హ్యుందాయ్ మోటార్

మరికొన్ని ADAS అంశాలలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై-బీమ్ అసిస్ట్ మరియు రేర్-క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉన్నాయి. కియా సెల్టోస్, MG హెక్టార్, టాటా సఫారి, మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటిలో ఈ ADAS ఫీచర్‌లు ఉన్నాయి. 

పరోక్ష భద్రతా వ్యవస్థలు

Hyundai Exter six airbags

ఒక వాహనం ఏదైనా ప్రమాదం లేదా ఊహించని సంఘటనలో చిక్కుకున్నప్పుడు, ప్రయాణీకులకు కలిగే హానిని తగ్గించడానికి ఉపయోగపడేవే పరోక్ష భద్రతా ఫీచర్‌లు. వీటి ఉదాహరణలలో సీట్ బెల్ట్ؚలు, ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు ముడుచుకునే ప్రాంతాలు ఉంటాయి. 

భారత్ NCAP అమలులోకి వచ్చిన తరువాత వాహనాలపై పూర్తి ఫుల్-ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ నిర్వహించబడుతుంది, వాహనాలకు భద్రతా రేటింగ్ؚలను అందించడానికి మరిన్ని టెస్ట్ؚలు మరియు ప్రమాణాలను పరిచయం చేయవచ్చని కూడా MoRTH సూచించింది. వీటిలో ఏటవాలు ఇంపాక్ట్ టెస్ట్ మరియు రేర్ ఇంపాక్ట్ టెస్ట్ కూడా ఉన్నాయి.

Electric cars

EV మరియు ప్రత్యామ్నాయ ఇంధన మోడల్‌లకు ప్రత్యేకమైన భద్రతా విశ్లేషణ ప్రోటోకాల్స్ؚను కూడా జోడించాలని BNCAP భావిస్తున్నదని సూచించారు. వీటిలో CNG మరియు ఫ్లెక్స్-ఇంధన-ఆధారిత కార్‌లు కూడా ఉండవచ్చు. సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ మోడల్‌లతో పోలిస్తే, అటువంటి మోడల్‌లలో విభిన్న ఆర్కిటెక్చర్ ఉండవచ్చు మరియు వాటి భద్రతను సాధారణ క్రాస్ టెస్ట్ؚలు ఖచ్చితంగా విశ్లేషించలేవు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలలో కలిగే ప్రమాదాలలో అదనపు ట్యాంకుల నుండి లీకులు లేదా EVల నుండి ఎలక్ట్రిక్ డిస్ؚఛార్జ్ వంటివి ఉంటాయి. 

అయితే, భారత్ NCAP కోసం కొత్తగా సూచించిన అప్ؚడేట్‌లు ఎప్పుడు అమలు అవుతాయో ఖచ్చితమైన సమయాన్ని మంత్రిత్వ శాఖ వివరించలేదు, NCAPలు సాధారణంగా ప్రోటోకాల్స్ؚను 4 నుండి 5 సంవత్సరాల విరామాలలో ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి నవీకరిస్తాయి. 

ఇది కూడా చదవండి: 2023ను మరింత హరితంగా చేసిన 6 ఎలక్ట్రిక్ కార్‌లు

భారత్ NCAP: శీఘ్ర పునశ్చరణ

          View this post on Instagram                      

A post shared by CarDekho India (@cardekhoindia)

భారత్ NCAPతో భారతదేశం భద్రతా విశ్లేషణ కార్యక్రమాల అంతర్జాతీయ సమాజంలో చేరింది. ఇది కార్‌లను ఫ్రంటల్ ఆఫ్ؚసెట్ మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్టులతో సహా అనేక క్రాష్ టెస్ట్ؚలను నిర్వహిస్తుంది మరియు ఫలితాలపై ఆధారపడి వాటికి భద్రతా రేటింగ్ؚలను ఇస్తుంది. భారత్ NCAP ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. పరీక్షించవలసిన వాహనం రకం, రేటింగ్ సిస్టమ్ؚలు వంటి, పరీక్షల కోసం పరిగణించే అనేక పారామితులను MoRTH పంచుకుంది, వీటి వివరాల మా ప్రధాన కథనంలో వివరించబడ్డాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience