2024 లో రాబోయే టాటా ఎలక్ట్రిక్ కార్లలో Tata Nexon EVని మించిన నాలుగు ఎలక్ట్రిక్ కార్లు ఇవే
టాటా పంచ్ EV కోసం rohit ద్వారా నవంబర్ 03, 2023 11:53 am ప్రచురించబడింది
- 854 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా ఎలక్ట్రిక్ వాహనాల జాబితాలో పంచ్ EVతో మొదలై అనేక ఎలక్ట్రిక్ SUVలు చేరనున్నాయి.
టాటా మోటార్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడంలో వేగంగా పనిచేసింది. 2025 నాటికి 10 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తామని 2021 మధ్యలో కంపెనీ ప్రకటించింది. వీటిలో టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV, టాటా టిగోర్ EV సహా మూడు కార్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వచ్చే 12 నెలల్లో అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం:
టాటా పంచ్ EV
ఆశించిన విడుదల తేదీ - 2023 చివరలో లేదా 2024 ప్రారంభంలో
అంచనా ధర - రూ.12 లక్షలు
టాటా పంచ్ EV అనేక సార్లు టెస్టింగ్ చేయబడింది. ఈ కారు చాలా త్వరగా ఉత్పత్తికి సిద్ధమవుతోంది. స్టాండర్డ్ పంచ్ తో పోలిస్తే దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ లో అనేక కొత్త మార్పులు ఉండనున్నాయి. ఈ కారులో పెద్ద టచ్ స్క్రీన్ మరియు బ్యాక్ లిట్ 'టాటా' లోగోతో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారులో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉండే అవకాశం ఉంది. టాటా యొక్క ఇటీవలి వాదలన ప్రకారం, ఈ కారు 500 కిలోమీటర్లకు పైగా క్లెయిమ్ పరిధిని అందించగలదు. టాటా యొక్క అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే, ఈ మాడల్ స్థానం నెక్సాన్ EV కంటే దిగువన ఉంటుంది.
టాటా కర్వ్ EV
ఆశించిన విడుదల తేదీ: 2024 ప్రారంభంలో
అంచనా ధర: రూ.20 లక్షలు
టాటా కర్వ్ EV కంపెనీ యొక్క మొదటి SUV కూపే కారు, ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. టాటా యొక్క అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే, ఈ మాడల్ స్థానం నెక్సాన్ EV మరియు హారియర్ EVల మధ్య ఉంటుంది. కంపెనీ కాంపాక్ట్ SUVలకు పోటీగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) ను కూడా విడుదల చేయనుంది, దీని అమ్మకాలు తరువాత ప్రారంభమవుతాయి. కర్వ్ కారు టాటా యొక్క జెన్ 2 ప్లాట్ ఫామ్ పై నిర్మించబడుతుంది, ఇది జిప్ట్రాన్ EV పవర్ ట్రెయిన్ టెక్నాలజీతో అందించబడుతుంది. టాటా కర్వ్ EV పరిధి కూడా 500 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.
కొత్త నెక్సాన్ EVలో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆరు ఎయిర్ బ్యాగులు ఉండనున్నాయి. వీటితో పాటు అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS)ను కూడా ఇందులో అందించారు.
ఇది కూడా చదవండి: టెస్టింగ్ సమయంలో కనిపించిన టాటా కర్వ్ SUV, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ యొక్క గ్లింప్స్
టాటా హారియర్ EV
ఆశించిన విడుదల తేదీ: 2024 ప్రారంభంలో
అంచనా ధర: రూ.30 లక్షలు
ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా హారియర్ EV మోడల్, ఆటో ఎక్స్ పో 2023 యొక్క అతిపెద్ద హైలైట్స్ లో ఒకటి. దీనిలో ఉన్న కొన్ని EV-స్పెసిఫిక్ విజువల్ ఎలిమెంట్స్, ఇటీవల విడుదలైన హారియర్ ఫేస్ లిఫ్ట్ ను పోలి ఉన్నాయి. ఈ కారులో లభించే ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ వివరాలు ఇంకా వెల్లడికానప్పటికీ, ల్యాండ్ రోవర్ యొక్క ఒమేగా ఆర్క్ ప్లాట్ ఫామ్ పై ఈ SUV కారును తయారు చేయనున్న విషయం మనకి తెలిసిన విషయమే. హారియర్ EVలో డ్యూయల్ మోటార్ సెటప్ (ప్రతి యాక్సిల్ పై ఒకటి) తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (AWD) లభిస్తుంది. ఈ వాహనం 500 కిలోమీటర్ల వరకు పరిధిని అందించగలదని మేము భావిస్తున్నాము.
ఇందులో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, డ్యూయల్ జోన్ AC, ఏడు ఎయిర్ బ్యాగులు, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ప్రామాణిక హారియర్ ఫీచర్లు ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: సింగూరు ప్లాంట్ కేసులో విజయం పొందిన టాటా మోటార్స్, టాటా నానోకు ఈ సదుపాయం
టాటా సఫారీ EV
ఆశించిన విడుదల తేదీ: 2024 ప్రారంభంలో
అంచనా ధర: రూ.35 లక్షలు
టాటా సఫారీ EVని హారియర్ EV ప్రదర్శన సందర్భంగా ఆటో ఎక్స్ పో 2023 లో కూడా ధృవీకరించారు. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు సాధారణ పెట్రోల్-డీజిల్ వెర్షన్ మాదిరిగానే డిజైన్ థీమ్స్ మరియు ఫీచర్లను పొందుతాయి. ల్యాండ్ రోవర్ యొక్క ఒమేగా ఆర్క్ ప్లాట్ ఫామ్ పై సఫారీ EVని నిర్మించనున్నారు. అయితే దీని బ్యాటరీ ప్యాక్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. హారియర్ EV మాదిరిగానే, సఫారీ EV కూడా డ్యూయల్ మోటార్ సెటప్ (ప్రతి యాక్సిల్ పై ఒకటి) తో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ట్రెయిన్ ను పొందవచ్చు. అధిక బరువు కారణంగా, సఫారీ EV హారియర్ EV కంటే తక్కువ పరిధిని ఇవ్వగలదని అంచనా.
ఇందులో 12.3 అంగుళాల టచ్స్క్రీన్ సిస్టమ్, డ్యూయల్ జోన్ AC, ఏడు ఎయిర్ బ్యాగులు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ప్రామాణికంగా 6 ఎయిర్ బ్యాగులుతో లభించనున్న రూ.10 లక్షల లోపు 8 కార్లు
టాటా యొక్క ఈ ఎలక్ట్రిక్ SUV కార్లన్నీ 2024 నాటికి విడుదల చేయబడతాయి. మీరు ఏ కారు విడుదల కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అలాగే ఎందుకు? కామెంట్స్ లో తెలియజేయండి.
మరింత చదవండి : టాటా నెక్సాన్ AMT
0 out of 0 found this helpful