• English
  • Login / Register

టెస్టింగ్ సమయంలో కనిపించిన Tata Curvv SUV, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ యొక్క గ్లింప్స్

టాటా కర్వ్ కోసం rohit ద్వారా నవంబర్ 01, 2023 07:13 pm ప్రచురించబడింది

  • 214 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా కర్వ్  ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ తో అందించబడుతున్న టాటా యొక్క మొదటి ప్రొడక్షన్-స్పెక్ టాటా కారు.

Tata Curvv spied

  • టాటా ఆటో ఎక్స్ పో 2023 లో ప్రొడక్షన్ రెడీ కర్వ్ కాన్సెప్ట్ ను ప్రదర్శించారు. 

  • ఇది టాటా యొక్క మొదటి కాంపాక్ట్ SUV కారు, ఇది 2024 మధ్య నాటికి విడుదల కానుంది.

  • ఎక్ట్సీరియర్ లో హై బూట్ లిడ్స్, కొత్త నెక్సాన్ లాంటి అల్లాయ్ వీల్స్, LED టెయిల్ లైట్స్ ఉన్నాయి.

  • దాని క్యాబిన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇందులో రెండు వేర్వేరు సైజుల డిస్ ప్లే, బ్యాక్ లిట్ టాటా స్టీరింగ్ వీల్ ఉండనున్నాయి.

  • ఈ కూపే SUV కారులో వెంటిలేటెడ్ సీట్లు, 6 ఎయిర్ బ్యాగులు, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • ఈ కొత్త కారులో కొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ICE కర్వ్ కంటే ముందు దీని ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల కానుంది.

  • టాటా కర్వ్ కారు ప్రొడక్షన్ వెర్షన్ ప్రారంభ ధర రూ .10.5 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఆటో ఎక్స్ పో 2023 లో అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటి టాటా కర్వ్ యొక్క ప్రొడక్షన్ కు దగ్గరగా ఉన్న వెర్షన్. ఈ SUV కూపే కారు టెస్టింగ్ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఇప్పుడు ఈ కారును మరోసారి పరీక్షించడంతో ఇందులో ఇచ్చిన కొత్త డిజైన్ ఎలిమెంట్స్ పై ఓ లుక్కేయండి.

ఆకర్షణీయమైన ఎక్స్టీరియర్ డిజైన్లు

Tata Curvv side spied

స్పై షాట్లో, ఈ కారులో ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ కనిపించాయి, ఇది టాటా ప్రొడక్షన్-స్పెక్ కారులో మొదటిసారి ఇవ్వబడింది. ఈ కారులో కొత్త ఏరోడైనమిక్ తరహా అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో LED టెయిల్ లైట్లను అమర్చారు. కొత్త చిత్రాలలో, కర్వ్ యొక్క కూపే వంటి రూఫ్లైన్ను కూడా చూడవచ్చు.

FYI: ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మాస్ మార్కెట్ కార్లలో కనిపించే ఒక ప్రసిద్ధ లక్షణంగా మారాయి. 2021 లో, ఇది మహీంద్రా XUV700 SUV యొక్క టాప్ వేరియంట్లో చేర్చబడింది.

ఇంతకు ముందు విడుదలైన చిత్రాలలో, ఈ SUV కూపే కారు టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ EV, టాటా హారియర్ మరియు టాటా సఫారీ కార్ల మాదిరిగా స్ప్లిట్ మరియు వర్టికల్ లేఅవుట్ లో అమర్చిన LED హెడ్ లైట్లు కనిపించాయి.

ఇది కూడా చదవండి: హెడ్స్ అప్ డిస్ప్లేతో రూ.20 లక్షల లోపు 7 కార్లు

క్యాబిన్ డిజైన్ 

Tata Curvv concept cabin

కర్వ్ కారు ప్రొడక్షన్ వెర్షన్ యొక్క ఇంటీరియర్ యొక్క చిత్రాలు ప్రస్తుతానికి వెల్లడించబనప్పటికీ, ఈ వాహనం ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రకాశవంతమైన 'టాటా' లోగో మరియు క్లీన్ డ్యాష్ బోర్డ్ లేఅవుట్ తో క్యాబిన్ కొత్త స్టీరింగ్ వీల్ తో అందించబడవచ్చు.

టాటా కర్వ్ లో టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, పెద్ద టచ్ స్క్రీన్ (బహుశా నెక్సాన్ EV వంటి 12.3 అంగుళాల యూనిట్), 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఇది కాకుండా, కంపెనీ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ను కూడా అందించవచ్చు, ఇందులో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ వివారాలు

టాటా కర్వ్ కొత్త 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ (125PS/225Nm) తో పనిచేస్తుంది. అయితే దీని గేర్ బాక్స్ ఆప్షన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది నెక్సాన్ కారు మాదిరిగానే 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇందులో లభించే ఇతర ఇంజన్ ఆప్షన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Tata Curvv EV concept

టాటా యొక్క కొత్త జెన్ 2 ప్లాట్ ఫామ్ పై నిర్మించబడిన కర్వ్ కారు యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా టాటా విడుదల చేయనుంది. ఈ వాహనం 500 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించే పవర్ట్రెయిన్ గురించి సమాచారం ప్రస్తుతానికి వెల్లడించబడలేదు, కానీ ఈ కూపే SUV కారు యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ మొదట విడుదల అవుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.

ఆశించిన ప్రారంభ తేదీ మరియు ధర

Tata Curvv rear spied

టాటా కర్వ్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ 2024 మధ్య నాటికి భారతదేశంలో విడుదల కావచ్చు. ఈ వాహనం యొక్క ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్ ప్రారంభ ధర రూ .10.5 లక్షలు, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ .20 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్). టాటా కర్వ్ హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్, MG ఆస్టర్ మరియు ఫోక్స్వ్యాగన్ టిగువాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అదే సమయంలో, కర్వ్ ఎలక్ట్రిక్ కారు MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ లతో పోటీపడుతుంది.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 2023 లో విడుదల అయిన అన్ని కార్లు, ఈ పండుగ సీజన్ లో ఎంచుకోవడానికి చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.

was this article helpful ?

Write your Comment on Tata కర్వ్

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience