అల్ట్రా టెక్నాలజీతో క్వాట్రో ని బహ ిర్గతం చేసిన ఆడీ సంస్థ
ఆడి ఏ4 2015-2020 కోసం manish ద్వారా ఫిబ్రవరి 18, 2016 07:28 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆడీ సంస్థ సంవత్సరాల నుండి ర్యాలీ గెలుస్తున్న వారసత్వంతో సగర్వంగా లద్భిని పొందుతుంది. ఇప్పుడు జర్మన్ వాహన తయారీసంస్థ ర్యాలీలో-గెలుచుకున్న ఆల్ వీల్ డ్రైవ్ క్వాట్రో వ్యవస్థ యొక్క నవీకరించబడిన వెర్షన్ ని బహిర్గతం చేసింది. ఈ నవీకరణ ఆన్ డిమాండ్ AWD సిస్టం మరియు శాశ్వత 4X4 అమరికల మధ్య పరిపూర్ణ సంతులనం అందిస్తుంది. ఈ వ్యవస్థ ఆల్ట్రా టెక్నాలజీ తో ఆడీ క్వాట్రో ని అనుకరిస్తుంది మరియు ఈ వ్యవస్థ సెన్సార్ల అమరికను ఉపయోగించుకుంటుంది,దాని ద్వారా ఒక ప్రాసెసర్ సేకరించిన డేటా పంపబడుతుంది, దీనివలన పవర్ డెలివరీ నాలుగు చక్రాలకు సరిగ్గా జరుగుతుంది. ఉదాహరణకి ఈ వ్యవస్థ కారు తక్కువ లోడ్ ని తీసుకొన్నట్లయితే కారు ముందుకు వెళ్ళేలా కాంఫిగర్ చేస్తుంది మరియు ఒకవేళ కారు ట్రాక్షన్ కోల్పోయినట్లైతే ఈ వ్యవస్థ రియర్ ఆక్సిల్ ని నిమగ్నం చేస్తుంది. ఈ సెన్సార్లు ద్వారా సేకరించిన డేటాలో డ్రైవర్ యొక్క డ్రైవింగ్ ప్రాధాన్యతలు, శైలి మరియు రోడ్డు పరిస్థితులు అందించబడుతాయి.
అల్ట్రా టెక్నాలజీతో ఆడి క్వాట్రో కారు మొత్తం ఇంధన ఆర్థికవ్యవస్థను పెంచుతుంది మరియు కంపెనీ తెలిపిన దాని ప్రకారం క్వాట్రో తో ప్రారంభించబడిన ఆడి ద్వారా 0.3లీటర్/ 100 కిలోమీటర్ల ఇంధన వినియోగం తగ్గిస్తుంది. ఈ ఆవిష్కరణ గురించి వ్యాఖ్యానిస్తూ, " ట్రాక్షన్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ సంబంధించి పెద్ద తేడాలు ఏమీ లేకుండా నవీకరణలు చేశారు. " అని సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ వ్యవస్థ కారు యొక్క నిర్వహణ లక్షణాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, క్రమంగా దాని పనితీరు మెరుగుపరుస్తుంది కాని అల్ట్రా టెక్నాలజీతో ఆడీ క్వాట్రో కారు యొక్క ఉద్గారాలు తగ్గించడం ద్వారా కారు యొక్క కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు డీజిల్ గేట్ కారణంగా ఆడి యొక్క మాతృ సంస్థ వోక్స్వ్యాగన్ ఒక గమ్మత్తైన పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇది జర్మన్ వాహన తయారీసంస్థకి ఒక తెలివైన తరలింపుగా చెప్పవచ్చు.