భారతదేశం లో ఆడి ఒక కొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. ఆ మోడల్ ఇప్పుడు కొనుగోలుదారులకు ఆడి RS7 స్పోర్ట్ బేక్ అను పేరుతో రు. 1.4 కోట్లతో అందుబాటులో ఉంది.
ఆడి ఆర్ 2015-2019 కోసం sourabh ద్వారా మే 25, 2015 02:02 pm సవరించబడింది
- 17 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: భారతదేశం లో ఆడి ఇండియా ఒక నవీకరించబడిన వర్షెన్ ను ప్రవేశపెట్టింది. ఆ మోడల్ కొనుగోలుదారులకు ఆడి RS7 స్పోర్ట్ బేక్ అను పేరుతో రు.1.4 కోట్ల తో ( ఎక్స్-షోరూమ్ ధర-ముంబై) లో అందుబాటులో ఉంది. ఈ 2015 ఆడి RS7 లక్షణాలు మరియు బంపర్ ను పునఃరూపకల్పన చేశారు. ఒక కొత్త హనికోంబ్డ్ సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ తో క్వాట్రో బేడ్జింగ్ మరియు నవీకరించబడిన LED హెడ్ల్యాంప్స్ తో పాటుగా LED మాట్రిక్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ LED మాట్రిక్స్ ను ఇంతకుముందే లగ్జరీ A8 సెలూన్ లో ఉపయోగించారు. ఈ నవీకరించబడిన స్పోర్ట్ బేక్ యొక్క ధర, అవుట్గోయింగ్ మోడల్ కంటే 12 లక్షలు ఎక్కువ.
తేలికపాటి డిజైన్ కాన్సెప్ట్ హైబ్రిడ్ అల్యూమినియం తో ఆడి యొక్క ఐదు తలుపుల స్పోర్ట్ బాక్ మోడల్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా తయారుచేయబడిన RS అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ను మరియు 20 అంగుళాల అలాయ్ వీల్స్ ను ఈ మోడల్ యొక్క చాసిస్ కు అమర్చారు. ఈ మోడల్ యొక్క బాహ్య బాగాల గురించి చెప్పాలంటే, కొత్త మాట్రిక్స్ LED హెడ్ల్యాంప్స్, LED వెనుక లైట్లు మరియు డైనమిక్ టర్న్ సూచికలు. అయితే, లోపలి క్యాబిన్ కార్బన్ తో పొదిగిన బ్లాక్ ఇంటీరియర్, మరింత ప్రకాశించడానికి డోర్లకు సొగసైన అనుభూతిని జతచేస్తుంది. మరియు RS స్పోర్ట్ సీట్లు. ఈ పరికరాలతో పాటుగా ఈ స్పోర్ట్ బేక్ వేరియంట్, BOSE సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు MMI నావిగేషన్ తో పాటు అదనంగా MMI టచ్ ను కలిగి ఉంటాయి.
హుడ్ క్రింద బాగానికి వస్తే, ఈ మోడల్ సిరీస్ యొక్క ఇంజెన్ టర్బోచార్జ్డ్ ను కలిగి ఉంటాయి. దీనితో పాటుగా 4.0 లీటర్ TFSIV8 పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ పెట్రోల్ ఇంజెన్ అత్యధికంగా 552 bhp పవర్ ను విడుదల చేస్తుంది. మిల్లు నుండి విడుదల అయిన శక్తి ని 8- స్పీడ్ టిప్ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో ఒక క్వాట్రో ఆదారంగా అన్ని చక్రాల కు పంపుతుంది. ఈ వాహనం యొక్క పనితీరు గురించి చెప్పలంటే, ఈ పెట్రోల్ ఇంజెన్ 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 3.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ ఇంజెన్ అత్యదికంగా 225 kmph వేగాన్ని చేరుకోగలదు. అంతేకాకుండా ఈ వాహనానికి 'డైనమిక్ ప్యాకేజీ' ను ఎంచుకోవడం ద్వారా ఈ ఇంజెన్ 280 kmph నుండి 305 kmph అత్యదిక వేగాన్ని చేరుకోగలుగుతుంది.