Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి ఫ్రాంక్స్ బేస్ వేరియెంట్ గురించి మీరు తెలుసుకోవలసిన వివరాలు: చిత్రాలలో

మారుతి ఫ్రాంక్స్ కోసం tarun ద్వారా మే 03, 2023 03:39 pm ప్రచురించబడింది

సిగ్మా వేరియెంట్ బేసిక్ మోడల్ మాత్రమే, కానీ దీన్ని కొనుగోలుచేసిన తరువాత యాక్సెసరీలతో అలంకరించవచ్చు

మారుతి ఫ్రాంక్స్ అమ్మకాలు ఇటీవల ప్రారంభమయ్యాయి, దీని ధరలు రూ. 7.46 లక్షల నుండి రూ.13.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి. ఈ హ్యాచ్ؚబ్యాక్ క్రాస్ؚఓవర్ ఐదు విస్తృతమైన వేరియెంట్ؚలలో వస్తుంది –సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా మరియు ఆల్ఫా. నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో ఛార్జెడ్ పెట్రోల్ ఇంజన్ؚల మధ్య ఎంచుకోవచ్చు, రెండవ ఎంపిక డెల్టా+ వేరియెంట్ నుండి అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియెంట్ సాధారణంగా బడ్జెట్ పరిమితులను కలిగి ఉండి, యాక్సెసరీలను తరువాత జోడించాలని అనుకునే వారిని ఆకర్షిస్తుంది. ఫ్రాంక్స్ వినియోగదారులు ఎవరైనా అదే లాంటి దాని కోసం ఆలోచిస్తుంటే, బేస్-స్పెక్ సిగ్మా వేరియంట్‌ని ఇక్కడ వివరంగా చూడండి:

ముందు వైపు, ఫ్రాంక్స్ؚలో LED హెడ్ ల్యాంపులకు బదులుగా, హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ؚలు వస్తాయి. టాప్-ఎండ్ వేరియెంట్ؚలో ఉన్నట్లుగానే స్కిడ్ ప్లేట్, గ్రిల్ పైన క్రోమ్ డీటైలింగ్, నాజూకైన టర్న్ ఇండికేటర్‌లు వంటివి ఇందులో కూడా ఉన్నాయి. LED DRLలు కూడా ఇందులో ఉండవు, ఇవి LED హెడ్‌ల్యాంపులతో పాటుగా, మిడ్-స్పెక్ డెల్టా+ వేరియెంట్ నుండి అందుబాటులో ఉంటాయి.

బేస్ వేరియెంట్, కవర్‌తో 16-అంగుళాల స్టీల్ వీల్స్ؚను పొందుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్ని వేరియెంట్ؚలు ఒకే వీల్ సైజ్ؚను కలిగి ఉంటాయి.

బాడీ క్లాడింగ్ మరియు రూఫ్ రెయిల్స్ అన్ని వేరియెంట్ؚలలో ప్రామాణికం. అయితే, బేస్ సిగ్మా గ్రేడ్ؚలో బాడీ-రంగు ORVM, మిర్రర్ؚకు అమర్చిన టర్న్ ఇండికేటర్‌లు మరియు UV-కట్ గ్లాస్ అందుబాటులో లేవు.

ఇది కూడా చదవండి: 6 చిత్రాలలో వివరించబడిన మారుతి ఫ్రాంక్స్ డెల్టా+ వేరియెంట్

బ్రషెడ్ సిల్వర్ ఎలిమెంట్ؚలతో డ్యూయల్-టోన్ నలుపు మరియు గోధుమరంగు ఇంటీరియర్ థీమ్ అన్ని వేరియెంట్ؚలలో ప్రామాణికంగా వస్తుంది, దీని కారణంగా బేస్ వేరియెంట్ కూడా ప్రీమియంగా కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం సాధారణ ఫీచర్‌లతో వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేదా TFT మల్టీ-ఇన్ఫర్మేన్షన్ డిస్ప్లే లేనందున స్టీరింగ్ వీల్ؚలో కంట్రోల్స్ ఉండవు, కానీ టాప్-ఎండ్ ఆల్ఫా వేరియెంట్ؚలో ఉన్న అదే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీనిలో కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ సీట్‌లు కూడా అన్ని వేరియెంట్ؚలలో ప్రామాణికంగా వస్తాయి.

టాప్ వేరియెంట్ؚల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ స్థానంలో, బేస్ వేరియెంట్‌లో ఒక చిన్న స్థలంలాగా డ్యాష్ బోర్డు నుంచి బయటకు వచ్చిన ఒక పెద్ద ప్లాస్టిక్ హౌసింగ్ మాత్రమే ఉంటుంది. దీని వలన కొనుగోలు చేసిన తరువాత టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚను అమర్చగలిగే అవకాశం ఉంటుంది. USB ఛార్జింగ్ యూనిట్ؚలు కూడా ఇందులో అందించలేదు, 12V సాకెట్ మాత్రం ఉంటుంది. అయితే, ఆటోమేటిక్ AC అనేది బేస్ వేరియంట్ నుండే అదే కంట్రోల్ ప్యానెల్‌తో అందుబాటులో ఉంది. ఇది అప్ మార్కెట్ అనుభూతిని అందిస్తుంది.

ఫ్రాంక్స్ సిగ్మా వేరియెంట్ؚలో కీలెస్ ఎంట్రీ ఉంది కానీ పుష్ స్టార్ట్-స్టాప్ బటన్ కేవలం టాప్-ఎండ్ ఆల్ఫా మరియు జెటా వేరియెంట్‌లకు మాత్రమే పరిమితం అయ్యింది. ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఆటోమ్యాటిక్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ ప్రామాణికంగా అందిస్తున్నారు, అనుకూలతను బట్టి దీన్ని స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

ముందు సీట్‌ల వెనుక భాగంలోఎటువంటి స్టోరేజ్ స్థలం లేదు. సెంటర్ కన్సోల్ చివర రెండు చిన్న హోల్స్ మరియు 12V సాకెట్‌ను అందిస్తున్నారు. వెనుక ప్రయాణీకులు తమ ఫోన్ؚలు ఛార్జింగ్ చేస్తున్నపుడు ఉంచేందుకు ఇది వీలు కల్పిస్తుంది. మరొక వైపు, వెనుక AC వెంట్ؚలను టాప్ వేరియెంట్ కంటే ఒక స్థానం తక్కువలో ఉన్న వేరియెంట్‌లను మొదలకొని అందిస్తున్నారు.

సిగ్మా వేరియెంట్ కేవలం 5-స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 90PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందుతుంది. ఇదే ఇంజన్ؚను ఐదు-స్పీడ్‌ AMT ఎంపికతో డెల్టా మరియు డెల్టా+ వేరియెంట్ؚలతో ఎంచుకోవచ్చు. 100PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ మరొక ఇంజన్ ఎంపికగా ఉంది, ఇది 5-స్పీడ్‌ మాన్యువల్ లేదా 6-స్పీడ్‌ ATతో వస్తుంది.

ఇది కూడా చదవండి : మారుతి ఫ్రాంక్స్ Vs టాటా పంచ్ మరియు నెక్సాన్ ధరల పోలిక

ఫ్రాంక్స్ؚకు ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ, మారుతి సొంత లైనప్ؚలో బాలెనో మరియు బ్రెజ్జా మధ్య స్థానంలో ఉండే ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలు మరియు సబ్ؚకాంపాక్ట్ SUVలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి : ఫ్రాంక్స్ AMT

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 33 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి ఫ్రాంక్స్

N
narayan rathi
May 19, 2023, 11:20:10 AM

Milege is missing in manual book

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర