• English
  • Login / Register

6 చిత్రాలలో వివరించబడిన మారుతి ఫ్రాంక్స్ డెల్టా+ వేరియెంట్

మారుతి ఫ్రాంక్స్ కోసం shreyash ద్వారా ఏప్రిల్ 26, 2023 04:28 pm ప్రచురించబడింది

  • 47 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫ్రాంక్స్ రెండు పెట్రోల్ ఇంజన్ؚల ఎంపికను కేవలం ఈ వేరియెంట్ؚలోనే మారుతి అందిస్తున్నది 

Maruti Fronx Delta+ Front

మారుతి తన బాలెనో ఆధారిత క్రాస్‌ఓవర్ SUV ఫ్రాంక్స్ؚను విడుదల చేసింది, దీని ధర రూ.7.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభం అవుతుంది. ఇది మొత్తం ఐదు విస్తృత వేరియెంట్‌లలో అందుబాటులో ఉంటుంది – సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా మరియు ఆల్ఫా- ఇవి రెండు ఇంజన్ ఎంపికలతో వస్తాయి. క్రాస్‌ఓవర్ SUVలు ఇప్పటికే షోరూమ్ؚలకు చేరుకోగా, మారుతి ఫ్రాంక్స్ డెల్టా+ AMT వేరియెంట్ మొదటి లుక్ ఇక్కడ అందించబడింది:

Maruti Fronx Delta+ Front

ఇది ఫ్రాంక్స్ డెల్టా+ AMT వేరియంట్ కాబట్టి, LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో ఆటోమ్యాటిక్ LED హెడ్‌ల్యాంప్ؚలను చూడవచ్చు. బంపర్ దిగువ భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ؚతో సహా, క్రోమ్ గ్రిల్ బార్ అన్ని వేరియెంట్ؚలలో ప్రామాణికంగా అందించబడుతుంది. 

Maruti Fronx Delta+ Profile

ప్రొఫైల్‌తో పాటుగా, డెల్టా+ వేరియెంట్ నుండి అందించిన నలుపు రంగు పెయింట్ చేసిన 16-అంగుళాల అలాయ్ؚ వీల్‌లు మరింత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. రూఫ్ రెయిల్, బాడీ క్లాడింగ్ؚలతో స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఈ క్రాస్ఓవర్ؚకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ మోడల్‌లో టర్న్ ఇండికేటర్‌లతో బాడీ రంగు ORVMలు వస్తాయి, వీటిని ఎలక్ట్రానిక్ؚగా ఫోల్డ్ చేయవచ్చు. 

ఇది కూడా చదవండి: టాటా పంచ్ మరియు నెక్సాన్ Vs మారుతి ఫ్రాంక్స్ ధరలు

Maruti Fronx Delta+ Rear

వాహనం వెనుక భాగం గురించి చెప్పాలంటే, ఇది కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ؚలతో వస్తుంది కానీ డెల్టా+ వేరియెంట్ؚలో ఇల్యూమినేటెడ్ మధ్య భాగం లేదు. ఇది మిడ్-స్పెక్ వేరియెంట్ అనడానికి మరొక విషయం, వెనుక గ్లాస్‌పై రేర్ వైపర్ లేకపోవడం. ఇతర ప్రామాణిక వివరాలలో రూఫ్ పైన షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు బంపర్ దిగువ భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

Maruti Fronx Delta+ Interior

లోపల, మెరూన్ రంగుగల మునపటి డ్యాష్‌బోర్డ్ؚను కలిగి ఉంటుంది, కానీ మిడ్-స్పెక్ వేరియెంట్ కేవలం ఏడు-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ؚను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఈ టచ్ؚస్క్రీన్ యూనిట్ వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలకు మద్దతు ఇస్తుంది అయితే కనెక్టెడ్ కార్ ఫీచర్‌లను కలిగి ఉండదు. ఆటోమ్యాటిక్ AC మరియు యాంటీ-పించ్ ఫంక్షన్ؚతో ఆటో అప్/డౌన్ డ్రైవర్ వైపు పవర్ విండోలు ఫ్రాంక్స్‌లో ప్రామాణికంగా వస్తాయి.

ఫ్రాంక్స్ ఈ ప్రత్యేక వేరియెంట్ؚలో డిజిటల్ TFD MID, వెనుక AC వెంట్ؚలు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, క్రూజ్ కంట్రోల్, రేర్-వ్యూ కెమెరా మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ లేవు, ఇవి తదుపరి వేరియెంట్ؚలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ؚలో స్టీరింగ్ వీల్ కేవలం టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే, దీనిని టెలీస్కోపిక్ؚగా అడ్జస్ట్ చేయలేము.

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ Vs ఇతర మారుతి కాంపాక్ట్‌లు: ధర చర్చ 

Maruti Fronx Delta+ Interior

ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ వేరియెంట్‌లో లోపలి వైపు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ లేవు. భద్రత విషయానికి వస్తే, దీనిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి. 

ఇంజన్ & ట్రాన్స్ؚమిషన్

దీని ఇంజన్ గురించి చెప్పాలంటే, ఫ్రాంక్స్ 5-స్పీడ్ AMT ట్రాన్స్ؚమిషన్ؚకు జోడించిన (90PS/113Nm) 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ؚను వినియోగిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్‌ల మాన్యువల్ గేర్ బాక్స్ؚతో కూడా అందుబాటులో ఉంటుంది. 

ఇవే కాకుండా, మారుతి తన క్రాస్‌ఓవర్ SUVలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚను (100PS మరియు 148Nm) కూడా అందిస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది. మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో రెండు ఇంజన్ؚల ఎంపికను పొందే ఏకైక వేరియెంట్ ఇది, కానీ టర్బో-ఆటోమ్యాటిక్ ఎంపిక లేదు.

ధర & పోటీదారులు

ఫ్రాంక్స్ డెల్టా+ వేరియెంట్ ధర రూ.8.72 లక్షల నుంచి రూ.9.72 లక్షల వరకు ఉంది. ఫ్రాంక్స్ మోడల్‌ల ధరల పరిధి రూ.7.46 లక్షల నుండి రూ.13.14 లక్షల (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) వరకు ఉంటుంది. భారతదేశంలో ఫ్రాంక్స్ؚకు ప్రత్యక్ష ప్రత్యర్ధి లేకపోయినా ఇది మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్ వంటి సబ్‌కాంపాక్ట్ SUVలు మరియు బాలెనో, i20 వంటి ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: మారుతి ఫ్రాంక్స్ AMT 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఫ్రాంక్స్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience