• English
  • Login / Register

అన్ని కొత్త ఆడి క్యూ7 వాహనాల డీలర్షిప్లు డిసెంబర్ 10 న ప్రారంభం

ఆడి క్యూ7 2006-2020 కోసం nabeel ద్వారా నవంబర్ 30, 2015 03:21 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మలేషియాలో ప్రారంభం తరువాత త్వరలో, భారతదేశంలో ఆడి తన యొక్క అన్ని ఫ్లాగ్షిప్ ఎస్యువి లను తీసుకురాబోతుంది. అన్ని కొత్త ఆడి క్యూ7 వాహనాల డీలర్షిప్లు, డిసెంబర్ 10 న భారతదేశానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ యొక్క 3.0 టి ఎఫ్ ఎస్ ఐ క్వాట్రో వేరియంట్, ఆర్ ఎం 589,900 (భారతీయ రూపాయిలలో సుమారు 91.06 లక్షల) ధర వద్ద మలేషియాలో ప్రారంభించబడింది. ప్రారంభంలో ఈ కొత్త క్యూ7 ఒక సిబియూ యూనిట్ ద్వారా పరిచయం అయ్యింది కానీ ఈ ఆడి క్యూ 7 స్థానిక అసెంబ్లీ, 2016 వ సంవత్సరం లో ఔరంగాబాద్ ప్లాంట్లో త్వరలో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.  
 
ఈ వాహనం చుట్టూ, గమనించ దగ్గ మార్పులను కలిగి ఉంది. ఈ కొత్త ఆడి క్యూ7 వాహనం యొక్క బాహ్య కొలతలను గమనించినట్లైతే, ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 5050 మిల్లీ మీటర్లు, మొత్తం వెడల్పు 1970 మిల్లీ మీటర్లు మరియు వీల్బేస్ 2990 మిల్లీ మీటర్లు. మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ వాహనం 37 మిల్లీ మీటర్లు తక్కువ పొడవును, 15 మిల్లీ మీటర్ల తక్కువ వెడల్పును మరియు 12 మిల్లీ మీటర్ల తక్కువ వీల్బేస్ ను కలిగి ఉంది. ఈ కొత్త క్యూ7 వాహనం, 3.0 లీటర్ టి ఎఫ్ ఎస్ ఐ సూపర్చార్జెడ్ వి6 ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 333 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2900 నుండి 5300 ఆర్ పి ఎం మధ్యలో 440 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 8- స్పీడ్ టిప్ ట్రోనిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క త్వరణం గురించి మాట్లాడటానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 6.3 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఇంజన్ మునుపటి మోడల్ కంటే, 1.6 సెకన్ల వేగంగా వెళుతుంది అని చెప్పవచ్చు. మరోవైపు ఇదే వాహనం, 250 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ తక్కువ కొలతలు మరియు కొత్త నిర్మాణం తో 300 కిలోలతో తేలికగా ఉంది.

ఈ వాహనం బయటి మార్పుల గురించి మాట్లాడటానికి వస్తే, మరింత ఆకర్షణీయంగా కనపడే గ్రిల్, మార్పు చేయబడిన కోణీయ ఆకృతి కలిగిన హెడ్ ల్యాంప్లు, కొత్త దీర్ఘచతురస్రాకార ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు ముందు అలాగే వెనుక కొత్త బంపర్లు వంటి మార్పు చేయబడిన అంశాలను కలిగి ఉంది. అంతర్గత భాగం విషయానికి వస్తే, సమాచార ప్రదర్శన, చక్కని మరియు స్పష్టమైన లే అవుట్ కలిగిన డాష్బోర్డ్ అలాగే కన్సోల్, కొత్త మీడియా సెంటర్ నాబ్ మరియు కొత్త గేర్ లెవర్ వంటి అంశాలను కలిగి ఉంది. వీటన్నింటితో పాటు ఈ ఎస్యువి, విధ్యుత్తు సర్ధుబాటు కలిగిన లెథర్ సీట్లు, 19 స్పీకర్లు గల బోస్ ఆడియో వ్యవస్థ కు ఒక కొత్త సమాచార వ్యవస్థ, హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ తో కూడిన టచ్ ప్యాడ్, పనోరామిక్ సన్ రూఫ్, నాలుగు జోన్ల క్లైమేట్ కంట్రోల్, విధ్యుత్తు తో మడత వేయగల మూడవ వరుస సీటు, 360 డిగ్రీల కెమెరా తో కూడిన పార్క్ అసిస్ట్, మ్యాట్రిక్స్ ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్లు, ఆడి యొక్క విరుత్యువల్ కాక్పిట్, అన్ని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ సెలెక్ట్ మరియు ఎయిర్ సస్పెన్షన్ వంటి అంశాలతో భారతదేశంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Audi క్యూ7 2006-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience