అబార్త్ వారు పుంటొ కోసమై #హూ యాం ఐ అనే ప్రచారాన్ని మొదలు పెట్టారు
ఫియట్ పుంటో అబార్ట్ కోసం cardekho ద్వారా సెప్టెంబర్ 23, 2015 04:48 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఫియట్ అబార్త్ పుంటో వచ్చే నెలలో విడుదలకు అన్ని విధాల సిద్దం అయ్యింది. గత నెలలోని అంతర్జాతీయ బుద్ద్ సర్క్యూట్ లో ఈ కారుని మొదట ఆవిష్కరించిన తరువాత ఈ కారు ఇప్పుడు 1.4-లీటర్ టర్బో జెట్ ఇంజిను తో సిద్దం అయ్యింది. ఇది 145bhp మరియూ 200Nm ని విడుదల చేస్తుంది. ఫియట్ ఇంజిను 135ps మరియూ 200Nm గా అంతర్జాతీయ మార్కెట్లలో పేర్కొన్నా, కంపెనీ వారు సున్నితమైన మార్పులతో దేశంలోని డ్రైవర్లకి కొద్దిగా ఎక్కువే అందిస్తున్నారు. సస్పెన్షన్ సిస్టం కూడా అధిక శక్తి ఉత్పత్తి చేసేందుకై మరి కొంచం బిగుతు చేశారు.
ఫియట్ ఉత్పత్తులలో సామర్ధ్యం పొందు పరిచే అబార్త్ వారు ఎక్కడా తల్లి కంపెనీ పేరు కనపడకుండా చూసుకున్నారు. అందుచేత ఇప్పుడు, ఈ కారు అబార్త్ కి చెందినది అని, ఫియట్ కి చెందినది మాత్రమే కాదు అనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్ళేందుకై కంపెనీ వారి హూ యాం ఐ అనే ఒక ప్రచారాన్ని మొదలు పెట్టారు.
స్కార్పియన్ లోగో, స్పోర్టీ డీకాల్స్, కొత్త కలర్ స్కీము, అబార్త్ బ్యాడ్జ్ తో 16 అంగుళాల అల్లోయ్స్ కి 195/55 టైర్లు జత చేయబడి ఉండి, ఈ కారు చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
అబార్త్ పుంటో దాదాపుగా అన్ని పరికారాలు మార్పు లేకుండానే వస్తోంది మరియూ రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు రావొచ్చు అని అంచనా. పవరు విషయంలో జాగ్రత్త పడుతూ ఈ కారు యొక్క USP ( అమ్మకాలు కోసమై విన్నుత్న ప్రయత్నం) గా దీనిని చేసుకుంటున్నారు. ఈ కారు కోసం బుకింగ్స్ అన్ని ఇండియన్ ఫియట్ డీలర్షిప్ లలో రూ. 50,000 వేల కి చేసుకోవచ్చును.
0 out of 0 found this helpful