హ్యుందాయ్ వెర్నా 2023లోని 7 ఫీచర్‌లు సరికొత్త హ్యుందాయ్ క్రెటాలో ఆశించవచ్చు

హ్యుందాయ్ క్రెటా కోసం tarun ద్వారా మార్చి 27, 2023 12:18 pm ప్రచురించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించబడిన క్రెటా 2024లో వస్తుందని అంచనా మరియు ప్రపంచ వ్యాప్త నవీకరణతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది.

Hyundai Creta Vs Hyundai Verna

కొత్త జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలో, విభాగంలోనే మొదటిసారిగా పరిచయం చేసిన ఎన్నో ఫీచర్‌లతో, మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్, మెరుగైన భద్రతా ఫీచర్‌లతో వస్తుంది. దీని సహచర వాహనం క్రెటా, దీనికి సారూప్యమైన ప్రీమియం మోడల్‌గా నిలుస్తుంది మరియు వచ్చే సంవత్సరంలో నవీకరించబడిన మోడల్‌ను విడుదల చేస్తారని ఆశించవచ్చు. 

ఈ ప్రస్తుత జనరేషన్ కాంపాక్ట్ SUVని 2020లో విడుదల చేశారు, ఇప్పటి వరకు ఈ వాహనం ముఖ్యమైన నవీకరణలు పొందలేదు. ఇటీవలి కాలంలో ఈ విభాగంలో పోటీ బాగా పెరిగినందున, క్రెటా తిరిగి తన ప్రత్యేకతను చాటడానికి, కొత్త వెర్నా సెడాన్ؚకు చేసినట్లుగా దీనికి భారీ మార్పులు అవసరం.

Hyundai Creta

నవీకరించబడిన క్రెటాలో ఆశించగల (ఆరవ-జనరేషన్ వెర్నాలోని) ఏడు ఫీచర్‌లను ఇక్కడ చూద్దాం:

కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్

Hyundai Verna 1.5 Turbo badge

వెర్నా, కొత్త 1.5-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది 160PS మరియు 253Nm పవర్ మరియు టార్క్‌ను అందిస్తుంది. అల్కాజర్,ؚ ప్రస్తుతం ఇదే ఇంజన్‌ను కలిగి ఉంది. 2024 క్రెటాలో కూడా బహుశా ఇదే ఉండవచ్చు, అవే 6-స్పీడ్‌ల మాన్యువల్ మరియు 7-స్పీడ్‌ల DCT ట్రాన్స్ؚమిషన్‌తో రావచ్చు. ఈ పవర్‌ట్రెయిన్, ప్రస్తుతం ఈ SUVలో ఉన్న DCT ఆటోమ్యాటిక్ 140PS 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ స్థానంలో వస్తుంది. కొత్త టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో, క్రెటా ఈ విభాగంలో స్కోడా-వోక్స్వాగన్ జంట కంటే అత్యంత శక్తివంతమైనది అవుతుంది. 

ADAS

Hyundai Verna 2023 Variants

హ్యుందాయ్ ఇప్పుడు సరికొత్త వెర్నాలో ADASను అందిస్తుంది, ఇది బహుశా క్రెటాలో కూడా తీసుకురావచ్చు. దీనిలో ఆటోమ్యాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫ్రంట్  కొలిషన్ అవాయిడెన్స్, లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లు ఉంటాయి. 

MG ఆస్టర్, ప్రస్తుతం రాడార్-ఆధారిత భద్రతా సాంకేతికత కలిగిన ఏకైక వాహనం. క్రెటాలో ADAS ప్రత్యేకమైన ఫీచర్ కాకపోయినా, ఇది దీన్ని పోటీదారులతో సమానంగా ఉండేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: 9 వేరు వేరు రంగులలో అందుబాటులో ఉన్న 2023 హ్యుందాయ్ వెర్నా

ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిస్ప్లేలు

Hyundai Verna 2023

సరికొత్త హ్యుందాయ్ వెర్నాలో ప్రవేశపెట్టిన 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ؚస్క్రీన్ ఇప్పటికే క్రెటాలో వస్తుంది, అలాగే దానిలో ఉన్న డ్యూయల్ డిస్ప్లే సెట్అప్‌ను కూడా పొందవచ్చు.  ఈ SUV సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚను వెర్నాؚలో ఉన్న డిజిటైజ్ చేయబడిన క్లస్టర్ లేదా అల్కాజర్ లోని డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో భర్తీ చేయవచ్చు.

హీటెడ్ మరియు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్‌లు

Hyundai Verna 2023

ఈ విభాగంలో మొదటిసారిగా వెర్నాలో వచ్చిన ఫీచర్ కూడా 2024 క్రెటాలో ఉంటుందని అంచనా. క్రెటా ప్రత్యర్ధులలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్‌లు ఉన్న, హీటింగ్ ఫంక్షన్‌ను ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తున్నారు. 

కనెక్టెడ్ లైట్‌లు

Hyundai Verna 2023

2024 క్రెటా ప్రత్యేకమైన స్టైలింగ్ؚతో వస్తుందని, ఇండోనేషియాలో విక్రయానికి అందుబాటులో ఉన్న నవీకరించబడిన వెర్షన్ؚను పోలి ఉండదని ఇంతకు ముందు చర్చించాము. బదులుగా, ఇండియా-స్పెక్ క్రెటా నవీకరణలో వెర్నాలో ఉండే విధంగానే కనెక్టెడ్ LED DRLలు మరియు టెయిల్ లైట్‌లు ఉండవచ్చు. ప్రస్తుతం కారు తయారీదారులు అందరూ కనెక్టెడ్ లైట్ ట్రెండింగ్ డిజైన్‌ను అనుసరిస్తున్నారు, ప్రస్తుతం వీటిని అన్ని విభాగాలలో అనేక కార్‌లో చూడవచ్చు. 

ఇది కూడా చదవండి: ఈ 5 కొత్త హ్యుందాయ్ వెర్నా ఫీచర్‌లు కేవలం టర్బో వేరియెంట్ؚలకు మాత్రమే ప్రత్యేకం 

స్విచ్చబుల్ కంట్రోల్స్ 

Hyundai Verna 2023

2023 వెర్నాలో ఉన్న మరొక ప్రత్యేకమైన ఫీచర్ స్విచ్చబుల్ క్లైమేట్ మరియు ఇన్ఫోటైన్ؚమెంట్ కంట్రోల్ؚలు, ఇది కియా EV6లో కూడా చూడవచ్చు. టచ్-ఎనేబుల్డ్ ప్యానెల్ؚలోని AC కంట్రోల్ؚను  ఇన్ఫోటైన్ؚమెంట్ ఆడియో కంట్రోల్ؚగా కూడా మార్చవచ్చు. హ్యుందాయ్ క్రెటాలో భవిష్యత్తులో రాబోయే ఎలిమెంట్ؚను కూడా ఆశించవచ్చు.

టర్బో వేరియెంట్ؚల కోసం విభిన్న స్టైలింగ్

Hyundai Verna: Fiery Red Dual-tone

హ్యుందాయ్ క్రెటా ప్రస్తుత వెర్షన్, టర్బో మరియు సాధారణ వేరియెంట్‌ల మధ్య తేలికపాటి భేదాలను చూడవచ్చు. టర్బో వేరియెంట్ؚలలో డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ؚలు, కొన్ని బ్లాకెడ్-అవుట్ ఎలిమెంట్ؚలు మరియు డ్యూయల్-టోన్ ఎక్స్ؚటీరియర్ షేడ్ؚలు ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అయితే, హ్యుందాయ్ కొత్త వెర్నాతో ఈ ప్రత్యేకతను మరింతగా చూపిస్తుంది.

Hyundai Verna Turbo-petrol Cabin

వెర్నా టర్బో-పెట్రోల్ వేరియెంట్ؚలు ఎరుపు రంగు యాక్సెంట్ؚతో నలుపు రంగు క్యాబిన్ థీమ్ؚను, నలుపు రంగు ఆలాయ్ వీల్స్ؚ, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ؚ మరియు ఆప్షనల్ గా నలుపు రంగు రూఫ్ؚను కలిగి ఉంటుంది. నవీకరించబడిన క్రెటాలో టర్బో వేరియెంట్ؚలలో కూడా ఇటువంటి తేడాలనే ఆశించవచ్చు. 

నవీకరించబడిన క్రెటాను హ్యుందాయ్ 2024 మొదటి భాగంలో విడుదల చేయవచ్చు. ఈ సెడాన్ మరియు SUVల మధ్య పెద్ద తేడా ఏమిటంటే ఈ SUV డీజిల్ ఇంజన్ ఎంపికను నిలుపుకోవడం. కొత్త హ్యుందాయ్ వెర్నా ధర రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు ఉంటుంది, ప్రస్తుతం క్రెటా ధర రూ.10.84 లక్షల నుండి రూ.19.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఇక్కడ ఎక్కువ చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience