Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

5 చిత్రాలలో Hyundai Creta EX Variant వివరాలు వెల్లడి

హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా జనవరి 22, 2024 01:09 pm ప్రచురించబడింది

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ యొక్క వన్-ఎబోవ్-బేస్ EX వేరియంట్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో అందించబడుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఇటీవల నవీకరించబడింది, ఇది అనేక కొత్త ఫీచర్లతో పాటు సరికొత్త లుక్ లో ఉండనుంది. 2024 హ్యుందాయ్ క్రెటా 7 వేరియంట్లలో లభిస్తుంది: E, EX, S, S(O), SX, SX టెక్ మరియు SX(O). ఈ ఆర్టికల్ లో, దాని బేస్ మోడల్ పైన ఉన్న EX వేరియంట్ ప్రత్యేకత ఏమిటో చిత్రాల ద్వారా తెలుసుకుందాం:

2024 హ్యుందాయ్ క్రెటా EX లో ఇన్వర్టెడ్ L-ఆకారంలో LED DRLలు, దీర్ఘచతురస్రాకార గ్రిల్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. టాప్-లైన్ వేరియంట్ల నుండి దీనిని వేరు చేసే విషయం ఏమిటంటే, ఇందులో కనెక్టెడ్ DRLలు మరియు LEDలకు బదులుగా మరియు హాలోజెన్ హెడ్లైట్లు లభించవు. ఇది కాకుండా, DRLలలో అమర్చిన టర్న్ ఇండికేటర్లలో సీక్వెన్షియల్ ఫంక్షన్ ఇవ్వబడదు.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, EX వేరియంట్ మరియు టాప్ లైన్ వేరియంట్ల మధ్య వ్యత్యాసాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. EX వేరియంట్లో వీల్ కవర్లతో కూడిన 16 అంగుళాల స్టీల్ వీల్స్ ను అమర్చారు మరియు సైడ్ ఇండికేటర్లను ORVMలకు బదులుగా సైడ్ ఫెండర్లకు అమర్చారు. అయితే, క్రెటా EX లో బేస్-స్పెక్ Eలో అందించబడని సైడ్ గార్నిష్ లభిస్తుంది.

ఇది కూడా చూడండి: 5 చిత్రాలలో కొత్త హ్యుందాయ్ క్రెటా E బేస్ వేరియంట్ యొక్క కీలక వివరాలు వెల్లడి

వెనుక భాగం విషయానికి వస్తే, క్రెటా EXలో LED టెయిల్ ల్యాంప్లు ఉండవు, ఇవి దాని తదుపరి వేరియంట్లలో లభిస్తాయి. అయితే, బేస్ E వేరియంట్ మాదిరిగా కాకుండా, EX వేరియంట్లో షార్క్ ఫిన్ యాంటెనా అందించబడుతుంది. క్రెటా యొక్క ఇతర వేరియంట్ల మాదిరిగానే, ఇది కూడా LED హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ మరియు రేర్ బంపర్ ఇంటిగ్రేటెడ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో లభిస్తుంది.

ఫేస్ లిఫ్టెడ్ క్రెటా EX వేరియంట్ లోపల వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. దీని టాప్-లైన్ వేరియంట్లో 10.25 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది లోవర్ స్పెక్ వేరియంట్ కాబట్టి, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా లభించదు.

హ్యుందాయ్ వెన్యూ మరియు వెర్నా మాదిరిగానే ఈ వేరియంట్లో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యూనిట్ లభించగా, టాప్-లైన్ వేరియంట్ లో 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ క్లస్టర్ లభిస్తుంది.

ఇందులో నాలుగు పవర్ విండోలు, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ సర్దుబాట్లు మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. అంతే కాక ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్ల వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 2024 క్రెటా యొక్క ఈ వేరియంట్లో రేర్ వ్యూ కెమెరా లభించదు.

ఇది కూడా చూడండి: ఫేస్ లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా యొక్క అన్ని వేరియంట్ వివరాలు

ఇంజిన్ ఎంపికలు

EX వేరియంట్ రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది: 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 PS / 144 Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ (116 PS / 250 Nm). ఈ వేరియంట్లో, ఈ రెండు ఇంజన్లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎంపిక మాత్రమే లభిస్తుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క మిడ్-స్పెక్ S(O) వేరియంట్ CVT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది.

2024 క్రెటా యొక్క టాప్-స్పెక్ SX(O) వేరియంట్ లో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) తో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక లభిస్తుంది.

ధర ప్రత్యర్థులు

2024 హ్యుందాయ్ క్రెటా EX ధర రూ.12.18 లక్షల నుండి రూ .13.68 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) మధ్య ఉంది. ఈ కాంపాక్ట్ SUV కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, హోండా ఎలివేట్, MG ఆస్టర్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది.

మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా ఆన్ రోడ్ ధర

Share via

Write your Comment on Hyundai క్రెటా

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.88.70 - 97.85 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర