గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులలో 5 స్టార్ؚలు సాధించిన 2023 Hyundai Verna
హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా అక్టోబర్ 04, 2023 06:01 pm సవరించబడింది
- 50 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దీని బాడీ షెల్ ఇంటిగ్రిటీ మరియు ఫుట్ؚవెల్ ఏరియాలు ‘అస్థిరం’గా రేట్ చేయబడ్డాయి
-
అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రెండింటిలోను ఐదు స్టార్ؚలను సాధించిన హ్యుందాయ్ వెర్నా.
-
భద్రత అస్సెస్మెంట్‌లో పూర్తి 5-స్టార్ రేటింగ్ؚలను పొందిన, భారతదేశంలో తయారు చేయబడిన మొదటి హ్యుందాయ్ కారు.
-
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అస్సెస్మెంట్‌లో 34 పాయింట్లకు 28.18 స్కోర్ؚను సాధించింది.
-
చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో, హ్యుందాయ్ సెడాన్ 49 పాయింట్లకు 42 పాయింట్లను సాధించింది.
-
అందిస్తున్న ప్రామాణిక భద్రత ఫీచర్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్ؚలు, ESC మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు కూడా ఉన్నాయి.
-
లేన్-కీప్ అసిస్ట్ మరియు హై-బీమ్ అసిస్ట్ؚతో సహా కొన్ని ADAS ఫీచర్‌లను కూడా పొందింది.
2024 నుండి గ్లోబల్ NCAP భారతదేశానికి ప్రత్యేకమైన కార్‌లను టెస్ట్ చేయడం నిలిపివేస్తుండగా, మరొక సెట్ క్రాష్ టెస్ట్ ఫలితాలను ఇది వెల్లడించింది, ఈ ఫలితాలలో ఆరవ-తరం హ్యుందాయ్ వెర్నా ఫలితాలు ఉన్నాయి. ఈ సెడాన్, అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ రెండిటి భద్రతలో 5 స్టార్ؚలను సాధించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్ؚలు మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలతో వచ్చే దీని అత్యంత బేసిక్ వర్షన్ؚను పరీక్షించారు. కొత్త వెర్నా పూర్తి 5-స్టార్ రేటింగ్ؚను సాధించిన, భారతదేశంలో తయారైన మొదటి హ్యుందాయ్ కార్.
అడల్ట్ ఆక్యుపెంట్ భద్రత
ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)
అడల్ట్ ఆక్యుపెంట్ భద్రతలో కొత్త వెర్నా 34 పాయింట్లకు 28.18 పాయింట్లను సాధించింది. ఇది డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు ‘మంచి’ భద్రతను అందించింది. డ్రైవర్ చాటీకి అందించే రక్షణ ‘ఒక మోస్తరు’ కాగా, ప్రయాణీకుల చాటీకి ‘మంచి’ భద్రతను అందిస్తుంది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్ళకు ‘ఒక మోస్తరు’ భద్రతను అందిస్తుంది.
డ్రైవర్ కాలి ఎములకు ‘తగినంత’ భద్రతను అందిస్తుండగా, ప్రయాణీకుల కాలి ఎముకలకు ‘మంచి మరియు తగినంత’ భద్రతను అందిస్తుంది. దీని ఫుట్‌వెల్ ప్రాంతం మరియు బాడీషెల్ ‘అస్థిరంగా’ ఉన్నాయని పరిగణించబడింది. ఇంకా ఎక్కువ లోడింగ్ؚలను తట్టుకునే సామర్ధ్యం ఈ కారుకు లేదని భావన.
సైడ్ ఇంపాక్ట్ (50kmph)
సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో తల, కడుపు మరియు పెల్విస్ ప్రాంతంలో ‘మెరుగైన’ భద్రత ఉందని, అయితే ఛాతీకి ‘తగినంత’ భద్రత అందుతుందని ప్రకటించారు.
సైడ్ పోల్ ఇంపాక్ట్ (29kmph)
కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ؚల అమరిక కూడా అవసరమైన ప్రోటోకాల్స్ؚకు అనుగుణంగా ఉంది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ؚలో మెడ మరియు పెల్విస్ؚకు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ నుండి ‘మంచి’ భద్రత లభించింది, ఛాతీకి ‘ఒక మోస్తరు’ భద్రత మరియు కడుపుకు ‘తగినంత’ భద్రత లభించింది.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
హ్యుందాయ్ సెడాన్ ESC ఫిట్‌మెంట్ రేట్ అవసరాలను అందుకుంది మరియు టెస్ట్‌లో చూపిన పనితీరు గ్లోబల్ NCAP కొత్త అవసరాల ప్రకారం ఆమోదయోగ్యంగా ఉంది.
సంబంధించినది: 2023 హ్యుందాయ్ వెర్నా వేరియెంట్‌ల వివరణ: మీరు ఏ వేరియెంట్ؚను కొనుగోలు చేయాలి?
చైల్డ్ ఆక్యుపెంట్ రక్షణ
ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)
3-సంవత్సరాల వయసు పిల్లలకు చైల్డ్ సీట్ వెనుక వైపుకు అభిముఖంగా అమర్చబడింది మరియు ఫ్రంటల్ ఇంపాక్ట్ సమయంలో తలకు గాయం కాకుండా నివారించగలిగింది మరియు పూర్తి భద్రతను అందించింది. మరొక వైపు, 1.5 సంవత్సరాల డమ్మీ కోసం చైల్డ్ సీట్ కూడా వెనుక వైపుకు అభిముఖంగా ఉంది మరియు ఇది కూడా తలకు పూర్తి భద్రతను అందించింది.
సైడ్ ఇంపాక్ట్ (50kmph)
చైల్డ్ రిస్ట్రైంట్ సిస్టమ్ؚలు (CRS) రెండూ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో పూర్తి భద్రతను అందించగలిగాయి.
కొత్త హ్యుందాయ్ వెర్నాలో భద్రత కిట్
హ్యుందాయ్ కొత్త వెర్నాలో 30 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్‌లను ప్రామాణికంగా అందిస్తోంది. వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM) మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.
ఇది ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలతో (ADAS) వస్తుంది, దీనిలో లేన్-కీప్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్ మరియు అడాప్టివ్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.
కొత్త వెర్నా నాలుగు విస్తృత వేరియెంట్‌లలో అందిస్తున్నారు: అవి EX, S, SX మరియు SX(O). వీటి ధరలు రూ.10.96 లక్షల నుండి రూ.17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: భారతదేశంలో ADAS కలిగి ఉన్న మరో 5 కార్‌ల వివరాలు
ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్‌రోడ్ ధర
0 out of 0 found this helpful