5 చిత్రాలలో 2023 Hyundai i20 Sportz CVT వేరియెంట్ వివరణ

హ్యుందాయ్ ఐ20 కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 28, 2023 01:57 pm ప్రచురించబడింది

  • 45 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించిన హ్యుందాయ్ i20 స్పోర్ట్జ్ వేరియెంట్ మాన్యువల్ మరియు CVT ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ రెండు ఎంపికలలో వస్తుంది

హ్యుందాయ్ i20 ఇటీవల తేలికపాటి డిజైన్ మార్పులను పొందింది, మరియు దిని పవర్ؚట్రెయిన్ ఎంపికలలో కూడా మార్పులు చేశారు. నవీకరించిన i20 ఐదు విస్తృత వేరియెంట్ؚలలో – ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా(O)గా అందిస్తున్నారు. ఈ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ మిడ్-స్పెక్ స్పోర్ట్జ్ CVT వేరియెంట్ అందిస్తున్నది ఏమిటో ఇక్కడ చూద్దాం, ఇది ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌లో ఎంట్రీ-లెవెల్ ఎంపికగా నిలుస్తుంది. దీని ధర రూ. 9.38 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.

I20 స్పోర్ట్జ్ ముందు భాగం, టాప్-స్పెక్ వేరియెంట్‌ల ముందు భాగం విధంగానే కనిపిస్తుంది, ఇందులో పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ గ్రిల్ మరియు కొట్టొచ్చినట్లు కనిపించే స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. అయితే ఇది ఇప్పటికీ హాలోజెన్ హెడ్ؚలైట్ సెట్అప్ؚను పొందుతుంది మరియు LED DRLలు బంపర్ ఎయిర్ కర్టెన్‌ల వద్ద అమర్చబడ్డాయి. టాప్-స్పెక్ ఆస్టా మరియు ఆస్టా (O) వేరియెంట్‌లలో, ఇంటిగ్రేటెడ్ LED DRLలతో LED హెడ్ؚలైట్‌లను చూడవచ్చు.

ఇది కూడా చూడండి: హ్యుందాయ్ ఎక్స్టర్ మరియు కాస్పర్ؚల మధ్య 5 తేడాలు

ప్రొఫైల్ విషయానికి వస్తే, వీటి డోర్ హ్యాండిల్ؚలు మరియు ORVMలు బాడీ-రంగులోనే వస్తాయి, సైడ్ ఇండికేటర్‌లు వెలుపల మిర్రర్‌లకు ఉంటాయి. టాప్-స్పెక్ ఆస్టా మరియు ఆస్టా (O) వేరియెంట్ؚలతో అందించే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కాకుండా ఇందులో స్టైల్లిష్‌గా ఉండే 16-అంగుళాల స్టీల్ వీల్స్ؚతో వస్తుంది. అంతేకాకుండా, ఈ స్పోర్ట్జ్ ట్రిమ్ డ్యూయల్-టోన్ వర్షన్ؚను ఎంచుకుంటే, ORVMలు బ్లాక్ అవుట్ చేయబడాయి. i20 టాప్-స్పెక్ మోనోటోన్ వర్షన్ؚలు కూడా క్రోమ్ ఫినిషింగ్ కలిగిన డోర్ హ్యాండిల్ؚలతో వస్తాయి.

వెనుక భాగంలో, ఈ i20 స్పోర్ట్జ్ మోడల్ Z-ఆకారపు LED టెయిల్ ల్యాంపులతో వస్తుంది, ఇవి క్రోమ్ గార్నిష్, వెనుక బంపర్‌పై సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు షార్క్ ఫిన్ యాంటెనాతో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. దీనిలో రేర్ డీఫాగర్ కూడా ఉంది, అయితే రేర్ వైపర్ మరియు వాషర్ లేవు. వీటిని మినహాహిస్తే, ఇది మరిన్ని ఫీచర్‌లు ఉన్న i20 వర్షన్ؚలకు సారూప్యంగా ఉంటుంది.

i20 స్పోర్ట్జ్ లోపలి వైపు డ్యూయల్-టోన్ నలుపు మరియు బూడిద రంగు క్యాబిన్ మరియు ఫ్యాబ్రిక్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ ఉన్నాయి. అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ؚరెస్ట్ؚలు, డ్రైవర్ సీట్ ఎత్తును రెండిటినీ సర్దుబాటు చేసుకోవచ్చు. ఫీచర్‌ల విషయానికి వస్తే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, ముందు వైపు టైప్-C USB చార్జర్, పవర్డ్ ORVMలతో ఈ i20 వేరియెంట్ వస్తుంది. అయితే ప్రీమియం 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ؚకు బదులుగా, ఇందులో 2-ట్వీటర్‌లతో బేసిక్ 4-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉంటుంది.

i20 మిడ్-స్పెక్ స్పోర్ట్జ్ వేరియెంట్ రేర్ AC వెంట్‌లు మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి సౌకర్యాలతో వస్తుంది. వెనుక ప్రయాణీకుల కోసం టైప్-C USB పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. భద్రత పరంగా ఇందులో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు (ప్రామాణికంగా), EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలను కలిగి ఉన్నాయి. 

పవర్ؚట్రెయిన్ తనిఖీ

హ్యుందాయ్ i20 ఫేస్ؚలిఫ్ట్ కేవలం 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో (83PS/115Nm) వస్తుంది. మిడ్-స్పెక్ స్పోర్ట్జ్ వేరియెంట్ؚలో, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVT ఆటోమ్యాటిక్ؚతో జోడించబడుతుంది. CVT మోడల్‌లలో, పవర్ అవుట్ؚపుట్ 88PS అధికంగా ఉంటుంది, మరియు ‘సాధారణ’ మరియు ‘స్పోర్ట్జ్’ డ్రైవింగ్ మోడ్ؚలు ఉంటాయి.

ధర పరిధి & పోటీదారులు 

హ్యుందాయ్ i20 ఫేస్ లిఫ్ట్ ధర రూ.6.99 లక్షల నుండి రూ.11.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుంది. ఇది టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాలతో పోటీ పడుతుంది. ఇక్కడ క్లిక్ చేసి i20 ఫేస్ؚలిఫ్ట్ؚ లోయర్-స్పెక్ మాగ్నా వేరియెంట్ ఇమేజ్ గ్యాలరీని కూడా మీరు చూడవచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: i20 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ ఐ20

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience