విడుదలకు ముందే ఆన్ؚలైన్ؚలో కనిపించిన 2023 హోండా సిటీ
honda city కోసం rohit ద్వారా ఫిబ్రవరి 21, 2023 06:55 pm ప్రచురించబడింది
- 42 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
తేలికపాటి నవీకరణతో, కార్ ఎక్స్ؚటీరియర్ؚలో గమనించదగిన మార్పులు కేవలం “ముందు భాగంలో’ మాత్రమే ఉన్నాయి.
-
వెలుపల డిజైన్ మార్పులలో కొత్త గ్రిల్ నమూనా, నవీకరించిన ముందు బంపర్ ఉన్నాయి.
-
లోపల అదే డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్, ఎనిమిది-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఉన్నాయి.
-
మునపటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, కానీ RDE నిబంధనలకు అనుగుణంగా నవీకరించబడింది.
-
డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.
-
మార్చి 2న విడుదల కానుంది, ధరలు రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
హోండా కార్స్ ఇండియా, నవీకరించబడిన ఐదవ జనరేషన్ సిటీ వర్షన్ؚను మార్చి 2న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 2023 సిటీ మోడల్ చిత్రాలు ఆన్ؚలైన్ؚలో కనిపించాయి, ఈ కాంపాక్ట్ సెడాన్ؚకు చేసిన మార్పుల గురించిన వివరాలు అన్నిటినీ వెల్లడించింది.
హోండా తమదైన పద్ధతిలో, ఈ సెడాన్ؚకు తేలికపాటి మార్పులతో నవీకరించిందని చూడగానే తెలుసుకోవచ్చు. దీని ముందు భాగం ఇప్పుడు LED DRLలు, మెరుగైన నమూనాؚతో సవరించిన గ్రిల్ؚతో మరింత అద్భుతంగా కనిపిస్తోంది. ఈ వాహనం ముందు బంపర్ؚను అతి తక్కువ మార్పులతో నవీకరించబడినది. ఈ హోండా సెడాన్, ప్రొఫైల్ వెనుక భాగంలో దాదాపుగా ఎటువంటి మార్పులు చేయలేదు.ؚ
క్యాబిన్ లోపల కూడా ఎలాంటి మార్పులు చేసినట్లు కనిపించడం లేదు, ఇది మునపటి డ్యూయల్-టోన్ థీమ్ మరియు డ్యాష్ؚబోర్డుపై ‘వుడ్’ ఇన్సర్ట్‌తో కనిపిస్తుంది. అంతేకాకుండా, గతంలో ఉన్న అండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఎనిమిది-అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంది. హోండా ఈ వాహనాన్ని వైర్ؚలెస్ ఫోన్ చార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు మరియు మరింత సాంకేతికతతో అందించవచ్చు.
ఇది కూడా చదవండి: CarDekho గ్రూప్ సిఈఓ & షార్క్ ట్యాంక్ ఇన్వెస్టర్ అమిత్ జైన్ ఈ వాహనాన్నే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోండి
ఈ సెడాన్ భద్రత కిట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగులు ప్రామాణికంగా ఉండవచ్చు. హిల్-స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚతో సహా ఇతర ఫీచర్‌లను కొనసాగించవచ్చు.
ఇటీవల నవీకరణతో, ఈ సెడాన్ డీజిల్ ఇంజన్ ఎంపికను అధికారికంగా నిలిపివేయవచ్చు, నవీకరించక ముందు ఈ వాహనంలో ఉన్న అదే 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ (121PS/145Nm)ను కొనసాగించవచ్చు. రానున్న RDE లేదా BS6 ఫేజ్ II నిబంధనలకు అనుగుణంగా ఇది ఉండవచ్చు, బహుశా E20 ఇంధనం కోసం కూడా సిద్ధంగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: EVల భవిష్యత్తు కోసం ఫార్ములా E ఎందుకో ముఖ్యమో ఇక్కడ తెలుసుకోండి
సిటీ మోడల్‌ను అవే ఆరు-స్పీడ్‌ల MT, CVT ఎంపికలతో అందించడం హోండా కొనసాగిస్తుందని ఆశించవచ్చు. నవీకరించిన సిటీతో, e:HEV హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ బేస్ వేరియెంట్ؚను కూడా అందించవచ్చు, దీని మెరుగైన ఇంధన సామర్ధ్య పవర్ؚట్రెయిన్ؚలు కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించవచ్చు.
నవీకరించబడిన సిటీ మార్చి 2 నుండి రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) అంచనా ధరతో మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. స్కోడా స్లేవియా, మారుతి సియాజ్, వోక్స్ؚవ్యాగన్ వర్చుస్ మరియు రాబోయే కొత్త జనరేషన్ హ్యుందాయ్ వెర్నాతో ఇది పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి : హోండా సిటీ డీజిల్