2020 మారుతి సుజుకి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ మా కంటపడింది త్వరలో లాంచ్ కానున్నది
మారుతి డిజైర్ 2017-2020 కోసం dinesh ద్వారా మార్చి 06, 2020 12:42 pm ప్రచురించబడింది
- 60 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్ మైల్డ్-హైబ్రిడ్ టెక్ తో బాలెనో యొక్క 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందగలదని భావిస్తున్నాము
- ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్ రాబోయే వారాల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నాము.
- అప్‌డేట్ చేయబడిన డిజైర్ పెట్రోల్-మాత్రమే సమర్పణ అవుతుంది. BS 6 డీజిల్ ఆఫర్‌లో లేదు.
- ఇది మునుపటి కంటే మెరుగ్గా అమర్చబడిందని భావిస్తున్నాము.
- హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్ మరియు టాటా టిగోర్ లకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
మారుతి థర్డ్-జెన్ డిజైర్ ను 2017 లో విడుదల చేసింది. మూడేళ్ల తరువాత, కార్-మేకర్ సబ్ -4 ఎమ్ సెడాన్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఫేస్ లిఫ్ట్ 2020 డిజైర్ మొదటిసారిగా మా కంటపడింది. మారుతి యొక్క ఉత్పాదక కేంద్రం వద్ద ఎటువంటి కవరింగ్ లేకుండా మా కంటపడింది దాని చూస్తే ఇది ఇప్పటికే ఉత్పత్తి జరుగుతోందని మనకి అర్ధం అవుతుంది.
ఇది పెద్ద హెక్సోగొనల్ ఫ్రంట్ గ్రిల్ తో రిఫ్రెష్ చేసిన ఫ్రంట్ ఫాసియాను మరియు తిరిగి డిజైన్ చేసిన ఫాగ్ లాంప్ హౌసింగ్‌తో కొత్త బంపర్ ను పొందుతుంది. మరోవైపు సైడ్ ప్రొఫైల్ చూస్తే గనుక ఎటువంటి మార్పులు లేవు. అయినప్పటికీ రహస్య షాట్లు కారు వెనుక భాగాన్ని బహిర్గతం చేయనప్పటికీ, సవరించిన టెయిల్ లాంప్ వివరాలు మరియు బంపర్ డిజైన్ పరంగా ఇది సూక్ష్మ సౌందర్య నవీకరణలను కలిగి ఉంటుందని భావిస్తున్నాము.
అదేవిధంగా, క్యాబిన్ కూడా పెద్దగా మారదు. అయితే, మారుతి ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్‌లో కొన్ని కొత్త ఫీచర్లను అందిస్తుందని, వీటిలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆటో-డిమ్మింగ్ IRVM లతో కూడిన కొత్త 7-ఇంచ్ స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆటో AC, LED హెడ్‌ల్యాంప్స్ వంటి ఇతర ఫీచర్లను కూడా ముందుకు తీసుకొస్తుందని భావిస్తున్నాము.
ఇంజన్ విషయానికి వస్తే, ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్ మైల్డ్-హైబ్రిడ్ టెక్ తో బాలెనో యొక్క 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ ఇంజన్ ద్వారా పవర్ ని పొందుతుందని భావిస్తున్నాము. ఇది 90Ps పవర్ మరియు 113Nm టార్క్ ని అందిస్తుంది, ప్రీ-ఫేస్‌లిఫ్ట్ డిజైర్ లో ప్రస్తుత 1.2-లీటర్ యూనిట్ అందించే దానికంటే 7 Ps ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ తో ఉన్న బాలెనో 23.87 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT తో మారవు. మైల్డ్-హైబ్రిడ్ ఎంపిక కాకుండా, డిజైర్ రెగ్యులర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83 Ps / 113 Nm) ను కూడా అందించగలదు. ఇది బిఎస్ 6 డీజిల్ ఎంపికను పొందదు.
మారుతి 2020 డిజైర్ ప్రారంభ తేదీని ఇంకా ధృవీకరించలేదు, అయితే రాబోయే వారాల్లో ఇది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మరియు టాటా టైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది. ధరలు పెద్దగా మారవు. ప్రస్తుతం, డిజైర్ ధర రూ .5.82 లక్షల నుండి రూ .9.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).