2020 మహీంద్రా XUV500 ఆటోమేటిక్ మా కంటపడింది, కొత్త ఇంటీరియర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి
2020 XUV500 కొత్త BS 6 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగించుకుంటుందని భావిస్తున్నారు
- 2020 XUV500 ప్రోటోటైప్ లోపల మరియు వెలుపల నుండి భారీగా కవరింగ్ చేయబడి ఉంది.
- ఇది బూమేరాంగ్ తరహా DRL ల కోసం హెడ్‌లైట్ల క్రింద ఒక రిసీస్ ని కలిగి ఉంది.
- డాష్‌బోర్డ్‌లో డ్యూయల్ టోన్ లేఅవుట్ ఉన్నట్లు ఉంది.
- 2020 ద్వితీయార్ధంలో లాంచ్ ఉంటుందని ఆశిస్తారు.
- ప్రస్తుత- జనరేషన్ XUV500 మాదిరిగానే ధరని కలిగి ఉంటుంది.
2020 XUV500 మరోసారి రహస్యంగా మా కంటపడింది. రాబోయే SUV పూర్తిగా వెలుపల మరియు లోపల కవరింగ్ చేయబడి ఉంది, మహీంద్రా వాటి వివరాలను రహస్యంగా ఉంచుదాము అనుకుంటుంది అని అర్ధం అవుతుంది. అయినప్పటికీ, మేము కొన్ని వివరాలను గుర్తించగలిగాము, దాని ప్రొడక్షన్ వెర్షన్ కి ఇది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము.
SUV యొక్క హెడ్‌ల్యాంప్‌లు టెస్టింగ్ యూనిట్లు మరియు ఫైనల్ లైట్స్ అనేవి తరువాతి స్టేజ్ లో వస్తాయి. అయినప్పటికీ, బూమరాంగ్ యొక్క రూపాన్ని ప్రతిబింబించే టియర్‌డ్రాప్- స్టయిల్ DRL లు హెడ్‌లైట్ రెసీస్ కింద కనిపిస్తాయి. డిజైన్ మేము XUV300 లో చూసిన దానితో సమానంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: మీరు చూడటానికి ముందే 2020 మహీంద్రా XUV500 క్యాబిన్ యొక్క ఓవర్ వ్యూ ఇక్కడ ఉంది
దీని ఫ్రంట్ గ్రిల్ మనం అనేక మహీంద్రా కార్లలో చూసిన ఏడు స్లాట్‌లను కలిగి ఉంది, వెనుక భాగంలో పెద్ద మెష్ వంటి డిజైన్ ఉంటుంది. వారు దానిని ఉత్పత్తి చేస్తారా అని మేము నమ్మకంతో చెప్పలేము. చిత్రాలు లోపలి భాగం స్పష్టంగా కనిపించేలా ఉన్నాయి మరియు చాలా భాగం కవరింగ్ తో ఉన్నా కూడా డ్యూయల్ టోన్ లేఅవుట్ ఉన్న డాష్ ని చూసాము. మరోసారి XUV300 వలె ఉంటుంది.
టెస్ట్ మ్యూల్ ఆటోమేటిక్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ‘S’ అని ఉంది, ఇది ‘స్పోర్ట్’ మోడ్ అని సూచిస్తుంది. ఇంజన్లు కొత్త 2.0-లీటర్ యూనిట్లుగా ఉంటాయని మరియు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించే అవకాశం ఉంది. ఒక ఎమిషన్ టెస్టింగ్ యూనిట్ వెనుక భాగంలో కూడా గుర్తించబడింది, అంటే రాబోయే XUV500 మరియు కొత్త ఇంజిన్‌లను కూడా మహీంద్రా పరీక్షించే పనిలో ఉంది అని అర్ధం అవుతుంది.
ఇది కూడా చదవండి: ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ పొందనున్న 2020 మహీంద్రా XUV500
2020 రెండవ భాగంలో మహీంద్రా రెండవ తరం XUV500 ను ఎప్పుడైనా విడుదల చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత XUV500 వంటి ఏడు సీట్ల SUV, ఇది రాబోయే SUV లకు పోటీగా వెళ్తుంది, టాటా గ్రావిటాస్, MG యొక్క ఏడు సీట్ల వెర్షన్ హెక్టర్, మరియు కొత్త ఫోర్డ్ SUV 2020 XUV500 వలె అదే ప్లాట్‌ఫామ్‌లో నిర్మించబడుతుంది. ధరలను పోటీగా ఉంచడానికి ప్రస్తుత మోడల్ - రూ .122.22 లక్షల నుండి 18.55 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి: XUV500 ఆటోమేటిక్