2020 ఫోర్త్-జెన్ హోండా జాజ్: ఏమి ఆశించవచ్చు?
హోండా జాజ్ 2014-2020 కోసం dhruv attri ద్వారా అక్టోబర్ 23, 2019 02:04 pm ప్రచురించబడింది
- 41 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నాల్గవ తరం హోండా జాజ్ అక్టోబర్ 23 న జరగబోయే టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడుతుంది, 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఇండియాలో ప్రారంభించబడుతుంది
జాజ్ ఇప్పుడు మీరు భారతదేశంలో కొనుగోలు చేయగల ‘అత్యంత సరసమైన హోండా కారు’. ఈ సంవత్సరం ప్రారంభంలో బ్రియో నిలిపివేయబడిన తరువాత ఇది టైటిల్‌ను సొంతం చేసుకుంది. కానీ థర్డ్-జెన్ హ్యాచ్‌బ్యాక్ 2015 నుండి అమ్మకానికి ఉంది మరియు రాబోయే టోక్యో మోటార్ షోలో హోండా నాల్గవ-జెన్ కారుని ప్రదర్శించబోతోంది. కాబట్టి, క్రొత్త జాజ్ లో మనం ఏ అప్‌డేట్స్ ను ఆశించవచ్చు? ఆ జాబితాను మేము ఇక్కడ పొందుపరిచి ఉంచాము, క్రింద చూడండి:
- రాబోయే హోండా జాజ్ రెండవ తరం మోడల్ మాదిరిగానే కర్వీ సిల్హౌట్ ని కలిగి ఉంటుంది. ఇది షార్ప్ డిజైన్ ని కలిగి ఉన్న థర్డ్-జెన్ మోడల్ నుండి గణనీయమైన మార్పు అని చెప్పవచ్చు. స్పై షాట్లు DRL లతో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌గేట్ మరియు రీ -డిజైన్ చేసిన బంపర్‌లలో విస్తరించి ఉన్న హారిజాంటల్ టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి.
- నాల్గవ-తరం హోండా జాజ్ 2020 ప్రారంభంలో భారతదేశానికి రానున్న ఐదవ-తరం హోండా సిటీ తో తన ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటుంది. కాబట్టి, ఎప్పటిలాగే లక్షణాల పరంగా హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ల మధ్య పోలికలను కలిగి ఉంటాయని మనం ఆశించవచ్చు.
- అధికారిక చిత్రాలు ఇంకా బయటకి రాలేదు, కాని మా కంటపడిన టెస్ట్ మ్యూల్ లో డాష్‌బోర్డ్ లేఅవుట్ ని కొద్దిగా మార్చినట్టు తెలుస్తుంది, కానీ ప్రస్తుతం ఉన్న జాజ్ తో పోలిస్తే ఈ మార్పులు అనేవి చాలా తక్కువ. ఇది రాబోయే ఐదవ-తరం హోండా సిటీ మరియు కొత్త WR-V (ఎప్పుడు వచ్చినా సరే) లో కూడా ఆశిస్తున్నాము.
- టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ డాష్‌బోర్డ్ నుండి బయటకు వస్తుంది మరియు ఇది ఇప్పటికే ఉన్న 7-అంగుళాల యూనిట్ కంటే పెద్దదిగా అనిపిస్తుంది, అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క డిస్ప్లే మనకి సివిక్ ను గుర్తు చేస్తుంది.
- ప్రస్తుత జాజ్‌లో లభించే కెపాసిటివ్ టచ్ యూనిట్‌కు బదులుగా స్విఫ్ట్ మాదిరిగానే డిజిటల్ డిస్ప్లేతో క్లైమేట్ కంట్రోల్ నాబ్స్ గుండ్రంగా ఉంటాయి. స్టీరింగ్ వీల్ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది మరియు హోండా ‘e’ ఎలక్ట్రిక్ కారు లాగా కనిపిస్తుంది.
(మూడవ తరం హోండా జాజ్)
- గ్లోబల్ మార్కెట్లలో హోండా సంస్థ జాజ్‌ను హైబ్రిడ్ సెటప్‌తో సమకూర్చుతుంది, కాని ఇండియా లాంచ్ ప్రస్తుతానికి ఇంకా ధృవీకరించబడలేదు.
- యూరప్ లోని సివిక్ పై విధులు నిర్వర్తించే 1.0-లీటర్, 3-సిలిండర్ i-VTEC టర్బో పెట్రోల్ ఇంజన్ జాజ్ లో కూడా అమర్చబడుతుందని భావిస్తున్నారు. ఇది 130PS శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది.
- ఇండియా విషయానికి వస్తే, హోండా జాజ్ 1.2-లీటర్ i-VTEC మరియు 1.5-లీటర్ i-DTEC ఇంజిన్ ని BS 6 నారంస్ కి అనుగుణంగా కలిగి ఉంటుంది.
- భారతదేశంలో దీని లాంచ్ 2020 చివరినాటికి లేదా 2021 ప్రారంభంలో ఉండవచ్చు, అలాగే ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది.
మరింత చదవండి: హోండా జాజ్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful