2019 జాగ్వార్ XE ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రూ .44.98 లక్షలకు ప్రారంభమైంది

published on డిసెంబర్ 09, 2019 12:45 pm by rohit for జాగ్వార్ ఎక్స్ఈ

  • 125 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫేస్‌లిఫ్టెడ్ XE ని ఇప్పుడు BS6 2.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో అందిస్తోంది

  • ఫేస్‌లిఫ్టెడ్ XE ని రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు: ఒకటి S మరియు రెండోది SE.
  •  రెండు వేరియంట్లు BS 6 2.0-లీటర్ పెట్రోల్ మరియు 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసిన డీజిల్ ఇంజిన్‌లతో వస్తాయి.
  •  వైర్‌లెస్ ఛార్జింగ్, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటివి ఆఫర్‌లో ఉన్నాయి.
  •  ఫేస్‌లిఫ్టెడ్ XE ధర రూ .44.98 లక్షల నుంచి రూ .46.33 లక్షలు (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉంది.
  •  ఇది మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్, BMW 3 సిరీస్ మరియు ఆడి A 4 లకు ప్రత్యర్థిగా కొనసాగుతోంది.

జాగ్వార్ ఫేస్‌లిఫ్టెడ్ XE ని భారతదేశంలో రూ .44.98 లక్షలకు (ఎక్స్‌షోరూమ్ ఇండియా) విడుదల చేసింది. బ్రిటిష్ కార్ల తయారీదారు సెడాన్‌ ను S మరియు SE అనే రెండు వేరియంట్లలో అందిస్తుంది. రెండు వేరియంట్లు BS 6 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తాయి మరియు వీటి ధర రూ .44.98 లక్షలు.

దాని ధరల జాబితాను ఇక్కడ చూడండి:

పెట్రోల్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

ప్రెస్టీజ్- రూ .44.36 లక్షలు

S- రూ. 44.98 లక్షలు

రూ. 62,000

పోర్ట్‌ఫోలియో- రూ .46.51 లక్షలు

SE- రూ. 46.33 లక్షలు

రూ. 18,000

 డీజిల్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

ప్రెస్టీజ్- రూ .45.06 లక్షలు

S- రూ. 44.98 లక్షలు

రూ. 8,000

పోర్ట్‌ఫోలియో- రూ .46.99 లక్షలు

SE-రూ.46.33 లక్షలు

రూ. 66,000

 (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఇండియా)

2019 Jaguar XE Facelift Launched In India At Rs 44.98 Lakh

2.0-లీటర్ పెట్రోల్ యూనిట్ 250Ps పవర్ మరియు 365Nm  టార్క్ ని ఇస్తుంది, అయితే డీజిల్ ఇంజిన్ యొక్క అవుట్పుట్ గణాంకాలు 180 Ps పవర్ మరియు 430 Nm టార్క్ వద్ద ఉన్నాయి. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి.

2019 Jaguar XE Facelift Launched In India At Rs 44.98 Lakh

జాగ్వార్ XE ఫేస్‌లిఫ్ట్ మునుపటి కంటే చాలా స్పోర్టియర్‌గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొత్త మెష్ నమూనాతో పునర్నిర్మించిన ఫ్రంట్ గ్రిల్‌ ను పొందుతుంది, LED DRL లతో సొగసైనదిగా కనిపించే హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అదనంగా, జాగ్వార్ కూడా బంపర్‌ను పునః రూపకల్పన చేసి, పెద్ద ఎయిర్ డ్యామ్‌లను ఉంచారు, తద్వారా ఇది స్పోర్టియర్ రూపాన్ని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: జాగ్వార్ I-పేస్ ఎలక్ట్రిక్ SUV ఇండియా 2020 లో లాంచ్; ఆడి ఇ-ట్రోన్ కి ప్రత్యర్ధి అవుతుందా

2019 Jaguar XE Facelift Launched In India At Rs 44.98 Lakh

ఫేస్‌లిఫ్టెడ్ XE ని రెండు వేరియంట్‌లలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందిస్తున్నారు. టైర్లు మినహా, సైడ్ ప్రొఫైల్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్‌ కు సమానంగా కనిపిస్తుంది. జాగ్వార్ వెనుక బంపర్‌ను కూడా తిరిగి డిజైన్ చేసింది మరియు స్పోర్టియర్ లుక్ చెక్కుచెదరకుండా ఉండటానికి కొత్త LED టెయిల్ లాంప్స్‌ ను ఇచ్చింది.

2019 Jaguar XE Facelift Launched In India At Rs 44.98 Lakh

ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే తో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను కలిగి ఉన్న కొత్త టచ్ ప్రో డుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో జాగ్వార్ ఫేస్‌లిఫ్టెడ్ XE సెడాన్‌ ను అందిస్తోంది. అనలాగ్ సెటప్‌ ను భర్తీ చేసే 12.3-అంగుళాల ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇంకా ఏమిటంటే, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలతో వస్తుంది. ప్రామాణిక భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.

2019 Jaguar XE Facelift Launched In India At Rs 44.98 Lakh

అప్‌డేట్ చేసిన జాగ్వార్ XE ధర రూ .44.98 లక్షల నుంచి రూ .46.33 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఇండియా). ఇది  మెర్సిడెస్ బెంజ్ C-క్లాస్, BMW 3 సిరీస్ మరియు ఆడి A4 లకు ప్రత్యర్థిగా కొనసాగుతోంది.

దీనిపై మరింత చదవండి: XE ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎక్స్ఈ

Read Full News
ఎక్కువ మొత్తంలో పొదుపు!!
save upto % ! find best deals on used జాగ్వార్ cars
వీక్షించండి ఉపయోగించిన <modelname> లో {0}
  • ట్రెండింగ్
  • ఇటీవల

trendingసెడాన్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience