కొత్త ప్రధాన ఆటోబయోగ్రఫీ వెర్షన్ తో ఆవిష్కరించబడిన జాగ్వార్ ఎక్స్ జె 2016

published on జూన్ 16, 2015 11:18 am by arun for జాగ్వార్ ఎక్స్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: జాగ్వార్ ఎక్స్ జె 2016 ను వాటి షో రూంలలో ప్రవేశ పెట్టారు. జాగ్వార్ ఇప్పుడు అత్యంత సుఖకరమైన-బార్జ్ రేంజ్-టాపింగ్ ఆటోబయోగ్రఫీ స్పెక్ తో అందుబాటులో ఉంది. ఈ ఆటోబయోగ్రఫీ స్పెక్ ఎక్స్ జె ఇపుడు ఎల్ డబ్ల్యూబి(లాంగ్  వీల్ బేస్) అవతార్ లో అందుబాటులో ఉంది.

మన కొత్త ప్రపంచ స్థాయి సమాచార వ్యవస్థ కలిగి, లోపలి మెటీరియల్స్ మరియు కోరుకున్న అనుభూతిని పూర్తిస్థాయిలో సృష్టించి మరియు మా అధిక ఉత్పత్తి తో, తక్కువ ఉద్గారాల డీజిల్ ఇంజన్ తో ఏ ఇతర లగ్జరీ కారు కూడా పొందనటువంటి ప్రశంసలు డ్రైవర్లు మరియు ప్రయాణీకుల నుండి మా కారు పొందుతుంది అని జాగ్వార్ ఎక్స్ జె వాహన లైన్ దర్శకుడు ఇయాన్ హోబాన్ చెప్పారు.

జాగ్వార్ ఎక్స్ జె బాహ్య భాగాల విషయంలో మంచి అందమైన లుక్ ను ఇస్తుంది. అంతర్భాగాల పరంగా మరియు బాహ్య భాగాల పరంగా కొన్ని సూక్ష్మ మార్పులతో అందమైన లుక్స్ తో రాబోతుంది. ఈ జాగ్వార్ ఎలీడి హెడ్ల్యాంప్స్ తో పాటుగా జె-బ్లేడ్ డీఅర్ ఎల్ ఎస్ మరియు ఎలీడి టైల్ ల్యాంప్స్ ను కలిగి ఉంతుంది. ఇప్పుడు ముందరి బంపర్ ఒక లార్జ్ ఎయిర్ ఇంటేక్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా గ్రిల్ పునఃరూపకల్పన ను కలిగి ఉంది. ఎక్స్ జె ఇప్పుడు ఒక కొత్త సైడ్ సిల్స్, మూడు పీసెస్ ముందు స్ప్లిట్టర్, సైడ్ పవర్ వెంట్స్ మరియు ఒక రేర్ స్పాయిలర్ తో ఒక ఆర్ స్పోర్ట్ మోడల్ నుండి పొందుతుంది. ఈ వాహనం అంతర్గత భాగాలలో స్పోర్ట్స్ సీట్స్ ను కలిగి, ఆర్ స్పొర్ట్ స్టీరింగ్ వీల్ ను, త్రెడ్ప్లేట్స్, జెట్ హెడ్లైనర్ మరియు పియానో బ్లాక్ ట్రిమ్ లేదా కార్బన్ ఫైబర్ వంతి లక్షణాలను కలిగి ఉంది.

జాగ్వార్ ఎక్స్ జె వాహనం లోపలివైపు, 8 అంగుళాల సమాచార స్క్రీన్ వ్యవస్థ, 26 స్పీకర్, 1300వోల్ట్స్ సౌండ్ సిస్టం వంటి వాటిని కలిగి ఉంది. వెనుక సీటు వినోదం కోసం రెండు 10.2 అంగుళాల హై డెఫినిషన్ స్క్రీన్స్ మరియు యూజర్ మీడియా కొరకు 100జిబి స్టోరేజ్ ఇవ్వబడింది. వెనుక సీట్ వినోద వ్యవస్థ, రెండు యూఎస్బి 3.0 పోర్ట్లు, ఒక హెచ్డిఎమై మరియు ఒక ఎమ్హెచెల్ పోర్ట్ ఉపయోగించి వివిధ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా, ఛార్జింగ్ మరియు మీడియా అవుట్పుట్ ల విషయంలో సహకరిస్తాయి

ఈ కొత్త ఎక్స్ జె ఇప్పుడు, ఎక్స్ ఈ మరియు ఎక్స్ ఎఫ్ వాహనాలలో ఉండే ఆల్-సర్ఫేస్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ఏ ఎస్ పి సి) టెక్నాలజీ తో రాబోతుంది. ఏ ఎస్ పి సి అనేది ఒక యునిక్ వ్యవస్థ.  మంచు మరియు తడి గడ్డి జారే ఉపరితలాలపై తక్కువ వేగంతో సులభంగా మరియు ఒక శక్తివంతమైన రేర్ వీల్ డ్రైవ్ తో సురక్షితంగా చేయడానికి ఈ ఏకైక వ్యవస్థ చాలా భాగా ఉపయోగపడుతుంది.

ఈ కొత్త ఎక్స్ జె త్వరలో భారతదేశ షోరూం లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనం 3-లీటర్ డీజిల్ వి6  ఇంజెన్ తో మరియు 5-లీటర్ పెట్రోల్ వి8 ఇంజెన్ తో రాబోతున్నాయి. మరియు ఈ ఇంజెన్ లు  8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ సిస్టమ్ తో రాబోతున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎక్స్

Read Full News

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience